• August 14, 2025

కూలీ ట్విట్టర్ రివ్యూ.. నాగ్ మామ కేక

కూలీ ట్విట్టర్ రివ్యూ.. నాగ్ మామ కేక

    రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, షోబిన్ ఇలా అగ్ర తారాగణంతో ఈ సారి లోకేష్ కనకరాజ్ ‘కూలీ’ అంటూ మాయ చేస్తాడని అంతా ఫిక్స్ అయ్యారు. ఇక ఇప్పటికే సాంగ్స్ అయితే పిచ్చెక్కించాయి. నాగార్జున విలనిజాన్ని చూద్దామని తెలుగు ఆడియెన్స్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ వచ్చారు. మరి కూలీ చిత్రం నేడు థియేటర్లోకి వచ్చింది. ఇక ఈ మూవీ టాక్ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

    ఫస్ట్ హాఫ్‌లో నాగార్జున విలనిజం అదిరిపోయిందట. నాగ్‌ను మోస్ట్ స్టైలీష్ విలన్‌గా చూపించారట. వెయ్యిరా పైన చెయ్యి చూద్దాం అనే పవర్ ఫుల్ డైలాగ్ అదిరిపోతుందట. ఇక నాగ్ మీద వచ్చే ర్యాప్, సాంగ్ అదిరిందట. అయితే ఈ మూవీ ప్రారంభం కాస్త గందరగోళంగా ఉంటుందట. ఓ ముప్పై నిమిషాల తరువాత గానీ ఆడియెన్స్ సెట్ అవ్వరట.

    ఇక ఇంటర్వెల్ వచ్చే వరకు బాగానే ఉంటుందట. అక్కడ వచ్చే ట్విస్ట్‌ ఆశ్చర్యపరుస్తుందట. రజినీ స్క్రీన్ ప్రజెన్స్, చూపించిన తీరు మాత్రం నెవ్వర్ బిఫోర్ అనేలా ఉంటుందట. అయితే సెకండాఫ్‌కి మరింత ఎలివేషన్ దాచి పెట్టినట్టు అనిపిస్తుందట. ఫస్ట్ హాఫ్ అంతా కూడా నాగ్, షోబిన్ ఆట ఆడేస్తారట. నాగ్ స్వాగ్, స్టైల్ అదిరిపోయిందట.

    షోబిన్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తాట. ఆయన నటన, మోనిక సాంగ్‌లో డ్యాన్స్ ఇలా అన్నీ కూడా మాస్ ఆడియెన్స్‌కు బాగానే ఎక్కేస్తాయట. ఎప్పటిలానే లోకి సినిమాలకు అనిరుధ్ అదరగొట్టేసినట్టే.. ఈ కూలీకి కూడా దుమ్ములేపేశాడట. ఫస్ట్ హాఫ్ అయితే పాస్ అయిపోతుందట. ఇక సెకండాఫ్ మీద కూలీ చిత్రం ఆధార పడుతుందని అంటున్నారు. మరి ఆ సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి. పూర్తి రివ్యూ కాసేపట్లో రానుంది.