• August 2, 2025

జాతీయ చలనచిత్ర అవార్డులు.. అందరినీ ప్రశంసించిన బన్నీ

జాతీయ చలనచిత్ర అవార్డులు.. అందరినీ ప్రశంసించిన బన్నీ

    కేంద్రం ప్రకటించిన 71వ జాతీయ ఉత్తమ చలన చిత్ర అవార్డులపై చర్చలు ఎంతగా జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. ఇక ఈ సారి మన తెలుగు సినిమాలు, తెలుగు ఆర్టిస్టులు, టెక్నీషియన్లు సత్తా చాటారు. జాతీయ అవార్డులు గెల్చుకున్న ప్రతీ ఒక్కరినీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసిస్తూ కంగ్రాట్స్ చెప్పారు. ఈ మేరకు ట్వీట్ వేస్తూ..

    జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డుని గెల్చుకున్న షారుఖ్ ఖాన్ సర్‌కు కంగ్రాట్స్. ఆయన 33 ఏళ్ల ప్రయాణంలో ఇదొక గొప్ప మైలురాయి.. ఇది సాధ్యం చేసిన నా డైరెక్టర్ అట్లీకి కంగ్రాట్స్. విక్రాంత్ మెస్సీకి, 12 ఫెయిల్ సినిమా టీంకు కంగ్రాట్స్. విక్రాంత్ ఈ అవార్డుకు అర్హుడు. వినోద్ గారికి కంగ్రాట్స్. రాణీ ముఖర్జీ గారికి ఉత్తమ నటి అవార్డు రావడం ఆనందంగా ఉంది. 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ప్రకటించిన ప్రతీ ఒక్కరికీ కంగ్రాట్స్.

    నందమూరి బాలకృష్ణ గారు నటించిన భగవంత్ కేసరికి ఉత్తమ జాతీయ తెలుగు చిత్రంగా అవార్డు రావడం ఆనందంగా ఉంది.. సుకృతికి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా రావడం, సుకుమార్ పేరుని నిలబెట్టడం సంతోషంగా ఉంది.. హనుమాన్, బలగం పాట రాసిన కాసర్ల శ్యామ్‌లకు కంగ్రాట్స్ అని ట్వీట్ వేశారు.

    ఇక బేబీ టీంను బన్నీ ప్రత్యేకంగా అభినందించారు. నిర్మాత ఎస్ కే ఎన్, దర్శకుడు సాయి రాజేష్, ఆనంద్ దేవరకొండ, వైష్ణవిలను ప్రశంసించారు. బెస్ట్ మేల్ సింగర్‌గా ప్రేమిస్తున్నా పాటకు రోహిత్‌కు అవార్డు రావడం అభినందనీయమని బన్నీ అన్నారు.