- March 6, 2025
మార్చి 7న ఓటిటిలోకి మనమే

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand). ఆయన లీడ్ రోల్ చేసిన ఫ్యామిలీ డ్రామా ‘మనమే’ (Maname). దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ మూవీలో శర్వానంద్ సరసన యంగ్ హీరోయిన్ కృతిశెట్టి (Krithi Shetty) నటించారు. గతేడాది జూన్ 7న మూవీ రిలీజ్ అయ్యి సక్సెస్ కొట్టిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించగా.. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. సినిమాలో విక్రమ్ ఆదిత్య, వెన్నెల కిషోర్, సీరత్ కపూర్, త్రిగున్, తులసి, రాహుల్ రవీంద్రన్, శివ కందుకూరి కీలక పాత్రలు పోషించారు. ‘మనమే’ సినిమా ఓటిటి లోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూసారు. ఆ తరుణం రానే వచ్చింది, మార్చ్ 7న అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రం విడుదల కానున్నట్టు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అఫీషియల్ గా అనౌన్సమెంట్ చేసింది.
తల్లి తండ్రులను కోల్పోయిన ఓ కిడ్ ని హీరో, హీరోయిన్ పెంచడం, ఆ కిడ్ ని పెంచే సమయంలో విక్రమ్, సుభద్ర కు ఎలాంటి కష్టాలు ఎదురైయ్యాయి. ఈ జర్నీ లో విక్రమ్, సుభద్ర తో ఎలా ప్రేమలో పడ్డాడు. సుభద్ర తో కార్తిక్(శివ కందుకూరి) కి ఉన్న సంబంధం ఏంటి? అన్నదే ఈ సినిమా కథ. ఈ సినిమాకు ఖుషి ఫెమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందించారు. దాదాపు పదహారు పాటలతో మనమే మూవీ రిలీజ్ అయ్యింది. అతి తక్కువ టైం లో ఇండియా లోనే నిరంతరం సినిమాలు తీస్తూ పేరు ప్రఖ్యాతలు పొందిన సంస్థ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’. ఈ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మేకింగ్, క్యాస్టింగ్, ఇలా ఏ విషయంలో కూడా తగ్గకుండా హీరో శర్వానంద్ కెరీర్ లోనే సినిమాని రిచ్ గా తెరకెక్కించారు.
దాదాపు 8 నెలలు తరువాత ఓటిటి లోకి వస్తున్న ‘మనమే’ చిత్రం. మార్చ్ 7న అమేజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. ఫ్యామిలీ సినిమాలకి పెద్ద పీట వేసే ఆడియన్స్ కి ఫ్యామిలీ తో ఖచ్చితంగా చూడాలిసిన సినిమా ఇది.