• September 29, 2024

సోనియాకు తత్త్వం బోధపడలేదా?.. ఇలా అయితే కష్టమే

సోనియాకు తత్త్వం బోధపడలేదా?.. ఇలా అయితే కష్టమే

    బిగ్ బాస్ ఇంటి నుంచి సోనియా ఎలిమినేట్ అయిందని తెలిసినప్పటి నుంచి సోషల్ మీడియాలో పండుగ వాతావరణం కనిపించింది. సోనియాను బిగ్ బాస్ ఎలిమినేట్ చేయడు.. కచ్చితంగా సేవ్ చేసుకుంటాడు.. మేనేజ్మెంట్ కోటా.. ముద్దు బిడ్డ అంటూ సోనియాను సేఫ్ చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ చివరకు ఆడియెన్స్ ఓట్లు, నిర్ణయాన్ని గౌరవిస్తూ సోనియాను ఎలిమినేట్ చేసి పడేశాడు.

    అయితే సోనియా మాత్రం ఎలిమినేట్ అయినా కూడా తన తప్పుల్ని మాత్రం తెలుసుకోలేకపోతోంది. అక్కా అనే ఉద్దేశంలోనే నిఖిల్, పృథ్వీలకు సలహాలు ఇచ్చింది. కానీ నిఖిల్, పృథ్వీలతో సోనియా చేసిన చేష్టలు, చెప్పలేని చోట్ల మర్దనా చేయడం, ముట్టుకోవడం వంటివి చేస్తూ వచ్చింది. ఈ ఇద్దరినీ ఆమె వాడుకుని ఆట ఆడుతున్నట్టుగానే ఆడియెన్స్‌కి అర్థమైంది. అదే విషయం మీద ఇంటి సభ్యులు కూడా నామినేట్ చేశారు. సోనియా మాటలకు మాత్రమే తప్పా.. ఆటల్లో వేస్ట్ అని ఆడియెన్స్ ఫిక్స్ అయ్యారు.

    కానీ సోనియా తన తప్పుల్ని మాత్రం ఒప్పుకోకుండా.. ఇంట్లోని ఆడవాళ్లంతా కలిసి ఇలా తనను టార్గెట్ చేశారని చెప్పుకొచ్చింది. ఇంట్లోని ఆడ కంటెస్టెంట్లంతా కూడా నిఖిల్, పృథ్వీల అటెన్షన్ కోరారట. కానీ వాళ్లిద్దరూ తన మీద అటెన్షన్ చూపించారట. ఆ విషయం లేడీ కంటెస్టెంట్లకు నచ్చలేదట. అందుకే తనను టార్గెట్ చేశారని, తన మైండ్‌కు అర్థమైందే నిజమని నమ్మేస్తోంది. ఇలా తన తప్పుల్ని రియలైజ్ చేసుకోలేకపోతే ఇక కష్టమే.