- September 15, 2024
సోనియాకి గడ్డి పెట్టిన కింగ్ నాగ్.. ఇకనైనా విష్ణు ప్రియను వదిలేస్తుందా?
బిగ్ బాస్ ఇంట్లో కంటెస్టెంట్లు చేసే తప్పుల్ని కింగ్ నాగార్జున హెస్ట్‌గా సరి చేయాల్సి ఉంటుంది. కొన్ని సార్లు బిగ్ బాస్ టీం కొంత మంది కంటెస్టెంట్లకు ఫేవర్‌గా పని చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఒకరు తప్పు చేస్తే సారీలు చెప్పిస్తారు.. ఇంకొకరు తప్పులు చేస్తే సున్నితంగా మందలించి వదిలేస్తుంటారు. అంతే కానీ వారితో సారీలు చెప్పించరు. ఈ సారి సోనియాతో విష్ణుప్రియకి సారీ చెప్పిస్తారని అంతా అనుకున్నారు. కానీ సోనియాను నాగ్ సున్నితంగా మందలించి వదిలేశాడు.
సోనియా బిగ్ బాస్ ఇంట్లో ఎలా ఉంటోందో అందరికీ తెలిసిందే. విష్ణు ప్రియ మీద పీకల దాక కోపం, ద్వేషం, పగతో రగిలిపోతుంటుంది. విష్ణు ప్రియ ఏం చేసినా కూడా సోనియా సహించలేదు. అంతటి ద్వేషం ఎందుకు ఏర్పడింది? అనేది కరెక్ట్‌గా చెప్పలేం. పుణ్య స్త్రీ అన్న ఒక్క పదానికే విష్ణు ప్రియ ఇంతటి ద్వేషం పెంచుకుందా? అంటే సోనియాలో ఎంత మెచ్యురిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక విష్ణు ప్రియని అయితే అనరాని మాటలు అనేసింది. విష్ణు ప్రియ వస్త్రాధారణ మీద, పొట్టి బట్టలు వేసుకుని అందరి చుట్టూ తిరుగుతుంటావ్.. నీకు ఫ్యామిలీ లేకపోవచ్చు.. నాకు ఫ్యామిలీ ఉంది అంటూ ఇలా పిచ్చి పిచ్చిగా వాగేసింది. ఇంత వాగినా కూడా సోనియా చేత విష్ణుప్రియకు సారీ చెప్పించలేకపోయాడు కింగ్ నాగ్. పైగా హింట్లు ఇచ్చాడు.
విష్ణు ప్రియతో పెట్టుకోకు.. నువ్వు నోరు అదుపులో పెట్టుకో.. చిన్నోడు పెద్దోడు అంటూ సోపాలో కూర్చుని ఉండటం కాదు.. ఆట ఆడాలి అంటూ హింట్లు ఇచ్చాడు. సోనియాను మాత్రం తెల్లమొహం వేసేలా.. తన తప్పులు తెలుసుకునేలా చేశాడు నాగ్. ఈ దెబ్బతో అయినా సోనియాకు తాను చేసిన తప్పులు తెలిసి వచ్చి.. విష్ణు ప్రియ మీద అనవసరపు ద్వేషాన్ని ప్రదర్శించదేమో చూడాలి.