- July 10, 2024
లేడీ లయన్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 3 మూవీ.. ఘనంగా ప్రారంభం
లేడీ లయన్ క్రియేషన్స్ పతాకం పై ప్రొడక్షన్ నెంబర్ 03 రాజు గుడిగుంట్ల గారి నిర్మాణం లో నూతన దర్శకుడు బి. విక్రమ్ ప్రసాద్ దర్శకత్వం “MERGE ” అనే చిత్రం తేదీ 10-07-2024 న హైదరాబాద్ లోని శ్రీ భద్రకాళి పీఠం లో డా|| సింధు మాతాజీ గారి ఆశీస్సులతో ఘనంగా ప్రారంభం జరుపుకుంది.
ఈ చిత్రం లో జబర్దస్త్ రాము, అంబటి శ్రీను, శక్తి చైతన్య ,పెరికల మాధురి, హరి తేజ, చంటి, దిలీప్, బాలరాజు, తదితరులు తారాగణం నటించనున్నారు. పూజ అనంతరం రాజు గుడిగుంట్ల గారు మీడియా తో మాట్లాడుతూ ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఈ నెల 15 వ తేదీన విజయవాడలో ప్రారంభం కానున్నట్లు తెలిపారు. నూతన దర్శకుడు విక్రమ్ ప్రసాద్ ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ తరహా లో రొటీన్ కథకు భిన్నంగా ఉండబోతుంది అని తెలిపారు.