• March 20, 2024

ప్రారంభమైన భారీ పాన్ ఇండియా మూవీ RC16.. గెస్టులుగా చిరు, శంకర్

ప్రారంభమైన భారీ పాన్ ఇండియా మూవీ RC16.. గెస్టులుగా చిరు, శంకర్

    RRRతో పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేష‌న‌ల్ క్రియేట్ చేసిన గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా.. తొలి చిత్రం ‘ఉప్పెన’తో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన బుచ్చిబాబు సానా కాంబినేష‌న్‌లో భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ RC 16 బుధ‌వారం ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ఇందులో రామ్‌చ‌ర‌ణ్ జ‌త‌గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ న‌టిస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యాన‌ర్‌పై వెంక‌ట స‌తీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ‌లు మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ స‌మ‌ర్ప‌ణ‌లో సినిమా తెరకెక్కుతుంది. బిజినెస్‌లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న నిర్మాత వెంకట సతీష్ కిలారుకి సినిమా రంగం అంటే ఎంతో ఆసక్తి. ఆ అభిరుచితోనే ఆయన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి చాలా ఏళ్లుగా ట్రావెల్ అవుతున్నారు. తాజాగా RC 16 వంటి భారీ చిత్రంతో నిర్మాతగా ఆయన పరిచయం అవుతుండటం విశేషం.

    RC 16  ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్, స్టార్ ప్రొడ్యూస‌ర్స్ అల్లు అర‌వింద్, బోనీ క‌పూర్, ఎ.ఆర్‌.రెహ‌మాన్‌, గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, జాన్వీ క‌పూర్‌, చిత్ర ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సానా, చిత్ర స‌మ‌ర్ప‌కులు సుకుమార్, దిల్ రాజు, శిరీష్, సాహూ గారపాటి, రామ్ ఆచంట, ఎమ్మెల్యే రవి గొట్టిపాటి, నాగవంశీ తదితరులు హాజ‌ర‌య్యారు.

    ముహూర్త‌పు స‌న్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్ట‌గా బోనీ క‌పూర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. శంక‌ర్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ చేతుల మీదుగా చిత్ర యూనిట్ స్క్రిప్ట్‌ను అందుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ ‘‘చిరంజీవిగారికి,  మా గురువుగారు సుకుమార్‌గారికి, ఇక్కడకు వచ్చిన పెద్దలందరికీ థాంక్స్. రంగస్థలం సినిమాకు నేను సుకుమార్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాను. నాపై నమ్మకంతో చరణ్‌గారు నాకు అవకాశం ఇచ్చారు. దీన్ని నేను సరిగ్గా వినియోగించుకుంటాను. ఈ సినిమాకు ఎ.ఆర్.రెహమాన్‌గారు మ్యూజిక్ అందిస్తున్నారు. నా రెండో సినిమాకే నా కల నేరవేరుతుందని అనుకోలేదు. అయితే చరణ్‌గారు, సుక్కుగారు, నవీన్‌గారు, రవిగారు, సతీష్‌గారి వల్ల నా కల నేరవేరింది. అందరికీ మంచి సినిమా అవుతుంది. ఈ సినిమా జరగటానికి ప్రధాన కారణం మా గురువుగారు సుక్కుసార్. అందరికీ థాంక్స్’’ అన్నారు.

    సుకుమార్ మాట్లాడుతూ ‘‘నేను బుచ్చిబాబుకి లెక్కలు మాస్టర్‌గా చదువు చెప్పానని నన్ను గురువుగారు అంటాడు. నిజానికి తను నా దగ్గర డైరెక్షన్ నేర్చుకోలేదు. తను ప్రతి విషయాన్ని చాలా పెద్దగా ఆలోచిస్తాడు. ఉప్పెన సినిమా సమయంలో విలన్‌గా ఎవరినీ అనుకుంటున్నావని అన్నప్పుడు విజయ్ సేతుపతి పేరు చెప్పాడు. తను ఎందుకు చేస్తాడని నేను అన్నాను. సరేనని విజయ్ సేతుపతిని కలిస్తే తన నెరేషన్ విని ఉప్పెన విజయ్ సేతుపతి నటించారు. అలాగే నెక్ట్స్ సినిమా ఎవరితో చేస్తావని అంటే రామ్ చరణ్ అన్నాడు. నేను షాకయ్యాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్‌గా రెహమాన్ గారి పేరు చెప్పగానే నేను అలా ఎప్పుడు అనుకోలేదు అనిపించింది. తను ఏం మాట్లాడినా పెద్దగా ఆలోచిస్తాడు. తన కథపైన తనకున్న నమ్మకం అలా ఉంటుంది. బుచ్చిబాబుకి ఆల్ ది బెస్ట్. చరణ్‌కి ఐ లవ్ యు. చరణ్ ఓసారి కథ విని సినిమా చేస్తున్నామని చెప్పేశాడు. తన మేలు ఎప్పటికీ మరచిపోలేను. ఇంత పెద్ద సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్నందుకు సతీష్ గారికి అభినందనలు. ఈ ప్రాజెక్ట్ ఇంత పెద్దగా రావటంలో తమదైన పాత్ర పోషించిన నవీన్ గారు, రవిగారికి థాంక్స్’’ అన్నారు.

    మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెమమాన్ మాట్లాడుతూ ‘‘సుకుమార్ చెప్పినట్లు బుచ్చిబాబు క్రేజీ పర్సన్. తన ఆలోచనలు గొప్పగా ఉంటాయి. తను నన్ను కలిసినప్పుడు ఐదు సిట్యువేషన్స్ చెప్పి, ఒక్కోదానికి మూడేసి సాంగ్స్ ఉండేలా ప్లాన్ చేసిన ఓ ఫైల్ ఇచ్చాడు. తనలోని ఆసక్తి చూసి ముచ్చటేసింది. ఇప్పటికే మూడు ట్యూన్స్ పూర్తి చేశాం’’ అన్నారు.

    హీరోయిన్ జాన్వీ కపూర్ మాట్లాడుతూ ‘‘నేను ఎంతగానో ప్రేమించే, అభిమానించే ప్రముఖులందరితో ఇక్కడున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నమ్మలేకపోతున్నాను. నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. బుచ్చిబాబుగారు ఈ కథను నెరేట్ చేయటానికి వచ్చినప్పుడు ఆయనకు సినిమాపై ఉన్న క్రేజ్ చూసి సినిమా చేయాలనకున్నాను. ప్రేక్షకులందరూ మెచ్చుకునేలా మంచి సినిమాలో భాగమవుతాను’’ అన్నారు.

    బోనీ కపూర్ మాట్లాడుతూ ‘‘హైదరాబాద్ నాకెప్పుడూ రెండో ఇల్లులాంటిది. తెలుగులో సినిమాలు చేశాను. మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను. చరణ్, జాన్వీ నటిస్తున్న సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన సినిమా చూసి రీమేక్ చేయాలని కూడా అనుకున్నాను. ఇక ఈ సినిమా విషయానికి వస్తే నిర్మాతలు నవీన్, రవి, సతీష్‌లకు అభినందనలు’’ అన్నారు.

    గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ ‘‘బుచ్చిబాబుకి సినిమా అంటే పిచ్చి. రంగస్థలంలో సుకుమార్ అసిస్టెంట్ గా తను ట్రావెల్ అయ్యాడు. రంగస్థలం  నెరేషన్‌ను సుకుమార్‌గారు నాకు నలబై నిమిషాలే ఇచ్చారు. అయితే అక్కడి నుంచి ప్రతిరోజూ రెండేసి గంటల నెరేషన్‌ను ఇస్తూ వచ్చింది మాత్రం బుచ్చిబాబునే. తనకు ఇంత పిచ్చి ఉంటుందని నేను అనుకోలేదు. ఈ స్టేజ్ పై ఉన్న ప్రముఖులను చూస్తుంటేనే తన సంకల్పం ఏంటో అర్థమవుతుంది. సుకుమార్ గారి దగ్గరున్న టీమ్ లో బుచ్చిబాబు బెస్ట్. తను ఉప్పెనతో పెద్ద సక్సెస్ చూశాడు. నేను నాకెరీర్‌లో ఇంత త్వరగా ఎ.ఆర్.రెహమాన్‌గారితో పని చేస్తానని అనుకోలేదు. కచ్చితంగా అద్భుతమైన సినిమా చేస్తామనే నమ్మకం ఉంది. నేను, జాన్వీ కలిసి జగదేకవీరుడు-అతిలోక సుందరి అనే సినిమా చేయాలని చాలా మంది అనుకున్నారు. మా కాంబినేషన్ ఈ సినిమాతో నిజం కాబోతుండటం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్బంగా జాన్వీకి థాంక్స్. మా సూపర్ హిట్ ప్రొడ్యూసర్స్ మైత్రీ మూవీ మేకర్స్‌కి, నిర్మాత సతీస్ కిలారుకి, మా టెక్నికల్ టీమ్‌కి థాంక్స్’’ అన్నారు.

    నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ ‘‘చరణ్,జాన్వీ సహా టీమ్‌కు ఆల్ ది బెస్ట్. బుచ్చిబాబు సినిమాను ఎంతలా ప్రేమిస్తాడో మనం చూశాం. తనకు ఈ సినిమాలో ష్యూర్‌గా మరో హిట్ కొడతాడు. ఈవెంట్‌కి వచ్చిన అతిథులకు, మా టీమ్‌కి థాంక్స్’’ అన్నారు.

    రామ్ చ‌ర‌ణ్ త‌న‌దైన పంథాలో ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో RC 16 సినిమాను చేస్తుండ‌టం విశేషం. ఉత్త‌రాంధ్ర నేప‌థ్యంలో జ‌రిగే రూర‌ల్, రా అండ్ ర‌స్టిక్ ఎమోష‌న‌ల్ జ‌ర్నీగా ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా రూపొందిస్తున్నారు. RC 16 అనౌన్స్‌మెంట్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి మెగాభిమానులు సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఆతృత‌గా ఎదురు చూస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ అంచ‌నాల‌ను మించేలా సినిమా ఉంటుంద‌ని ..త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని మేక‌ర్స్ తెలిపారు.

    RC 16 కోసం ఇండియ‌న్ టాప్ టెక్నీషియ‌న్స్ వ‌ర్క్ చేస్తుండ‌టం విశేషం. ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతాన్ని అందిస్తుండ‌గా, స్టార్ సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు కెమెరా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. అవినాష్ కొల్ల ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా, ఎడిట‌ర్‌గా రూబెన్ వ‌ర్క్ చేస్తున్నారు.

    న‌టీన‌టులు:
    రామ్ చ‌ర‌ణ్‌, జాన్వీ క‌పూర్ త‌దిత‌రులు

    సాంకేతిక వ‌ర్గం:
    బ్యాన‌ర్‌:  వృద్ధి సినిమాస్‌, నిర్మాత‌:  వెంక‌ట స‌తీష్ కిలారు, సమర్పకుడు: సుకుమార్, స‌మ‌ర్ప‌ణ‌:  మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌, ద‌ర్శ‌క‌త్వం:  బుచ్చిబాబు సానా, మ్యూజిక్ డైరెక్ట‌ర్:  ఎ.ఆర్.రెహమాన్‌, సినిమాటోగ్ర‌ఫీ:  ర‌త్న‌వేలు, ఆర్ట్‌: అవినాష్ కొల్ల‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌:  వి.వై.ప్ర‌వీణ్ కుమార్‌, యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ:  సుప్రీమ్ సుంద‌ర్‌, పాట‌లు:  చంద్ర‌బోస్‌, అనంత శ్రీరామ్‌, బాలాజీ, ఎడిట‌ర్: ఆంటోని రూబెన్‌, ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌:  క‌పిల‌న్‌, ఫ్యాషన్ డిజైన‌ర్‌:  దీపాలి నూర్‌, పి.ఆర్‌.ఒ(తెలుగు):  నాయుడు సురేంద్ర కుమార్