• December 17, 2023

‘డియర్ ఉమ’ నటిగా, నిర్మాతగా నిరూపించుకోబోతోన్న తెలుగమ్మాయి సుమయా రెడ్డి

‘డియర్ ఉమ’ నటిగా, నిర్మాతగా నిరూపించుకోబోతోన్న తెలుగమ్మాయి సుమయా రెడ్డి

    తెలుగు అమ్మాయిలు సినీ పరశ్రమలోకి ఎక్కువ గా వచ్చేందుకు ఇష్టపడరు అని అంతా అనుకుంటారు. కానీ ఇప్పుడు తెలుగు అమ్మాయిలు టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. ఇలాంటి తరుణంలో అనంతపురంకు చెందిన తెలుగు అమ్మాయి సుమయారెడ్డి మోడల్‌గా కెరీర్ ప్రారంభించి…. సినిమా ఇండస్ట్రీలో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తూ …. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించారు. సుమయ తన తొలి చిత్రం డియర్ ఉమ కోసం విభిన్నమైన క్రాఫ్ట్‌లను హ్యాండిల్ చేస్తూ మల్టీ టాలెంట్ ను పరిచయం చేస్తున్నారు.

    పృథ్వీ అంబర్‌తో కలిసి నటించిన ఈ డియర్ ఉమ చిత్రంలో సుమయా రెడ్డి హీరోయిన్ గా నటించిడమే కాకండా రచయితగా, నిర్మాతగా కూడా వ్యవరిస్తున్నారు. సుమచిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై సాయి రాజేష్ మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

    డియర్ ఉమ టీం త్వరలో ప్రచార కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ మూవీతో సుమయ తన నటనా ప్రావీణ్యాన్ని ప్రదర్శించి అందరినీ ఆకట్టుకోనున్నారు. ఈ సినిమా తరువాత ఆమెకు క్రేజీ ఆఫర్లు వచ్చేలా ఉన్నాయి. సుమయ తన అందంతో, నటనతో మున్ముందు టాలీవుడ్ ను కట్టిపడేసేలా ఉన్నారు. బ్యూటీ విత్ బ్రెయిన్ అని అందరి చేత అనిపించుకునేలా ఉన్నారు.