• November 22, 2023

అంగరంగ వైభవంగా తెలుగు వైభవం వేడుకలు

అంగరంగ వైభవంగా తెలుగు వైభవం వేడుకలు

    ప్రపంచంలో మొట్టమొదటి సారి సిఫా అంతర్జాతీయ తెలుగు చలనచిత్ర పురస్కారాలు కెనడా లోని టొరంటో నగరం లో జరగనున్నాయి.

    తెలుగు వైభవం వేడుకలలో భాగంగా జరగనున్న సిఫా పురస్కారాలకు తెలుగు చలనచిత్ర నటీనటులు దర్శకనిర్మాతలు రానున్నారు.

    తెలుగు వైభవ పండుగకు తెలంగాణ ప్రభుత్వం, ఒంటారియో ప్రభుత్వం మాత్రమే కాకుండా, కెనడా లో పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు కూడా వారి మద్ధతు తెలియజేసారు.

    చలనచిత్ర పురస్కారాలు కాకుండా మరో 20 కార్యక్రమాల సమూహమైన తెలుగు వైభవం వైపు యావత్తు ప్రవాస తెలుగు సమాజం ఆసక్తిగా చూస్తుంది