- April 22, 2023
Two Souls Telugu Movie Review : ఎమోషనల్‌గా సాగే ‘టూ సోల్స్’

Two Souls Telugu Movie Review ఇంత వరకు మనం తెలుగు తెరపై ఎన్నో ప్రేమ కథలను చూశాం. రెండు మనుషుల మధ్య ప్రేమ కథలు చూశాం. ఇంకా చూస్తూనే ఉంటాం. అయితే రెండు ఆత్మల మధ్య సాగే ప్రయాణం, ప్రేమ కథ కొత్త ఫీలింగ్ ఇస్తుంది. ఇప్పుడు అదే కాన్సెప్ట్‌తో టూ సోల్స్ అనే సినిమా వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందనేది ఓ సారి చూద్దాం.
కథ
టూ సోల్స్ కథ అంతా కూడా సిక్కీం బ్యాక్ డ్రాప్‌లో సాగుతుంది. అక్కడే పుట్టి పెరిగిన అఖిల్ (త్రినాథ్ వర్మ) అమ్మను పొగొట్టుకుంటాడు. దానికి కారణమైన తండ్రిని ద్వేషిస్తూ ఉంటాడు. కానీ కొడుకు కోసం తండ్రి ఆరాటపడుతుంటాడు. ఒంటరిగా సాగుతున్న అఖిల్ ప్రయాణంలో ప్రియ వచ్చి చేరుతుంది. ఒకనాడు ప్రియను పెళ్లి చేసుకోవాలని, ఆ ప్రపోజల్ తన ముందు పెట్టాలని అఖిల్ అనుకుంటాడు. కానీ ప్రియ వేరే వ్యక్తితో ఉంటుంది. అది చూసి అఖిల్ తట్టుకోలేకపోతాడు. ప్రియను చంపాలని అనుకుంటాడు. కానీ చివరకు తానే చనిపోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలో అఖిల్‌కు ప్రమాదం జరుగుతుంది. ఆ తరువాత అఖిల్ హాస్పిటల్ బెడ్డు మీద ఉంటాడు. అనంతరం అతని ఆత్మ బయటకు వస్తుంది. అలా బయటకు వచ్చిన అఖిల్ ఆత్మకు.. ప్రియ అనే మరో అమ్మాయి ఆత్మ కనిపిస్తుంది. ఈ రెండు ఆత్మలు ఎందుకు కలిశాయి? ఆ తరువాత వీరి ప్రయాణం ఎలా సాగింది? రూపా, ప్రియలకు అఖిల్‌తో ఉన్న రిలేషన్ ఏంటి? చివరకు అఖిల్ ప్రేమ కథ ఎలా టర్న్ తీసుకుంది? అసలు ఈ కథలో రూప ఎవరు? ప్రియలు ఎవరు? చివరకు అఖిల్ ఏం చేశాడు? అన్నది కథ.
నటీనటులు
టూ సోల్స్ కథలో ముఖ్యంగా ప్రియ, అఖిల్, రూప పాత్రలే కనిపిస్తాయి. వినిపిస్తాయి. అఖిల్ పాత్ర అందరితోనూ కనెక్ట్ అవుతుంది. లవ్ ఫెయిల్యూర్, ఒంటరి జీవితం అనుభవించే వారికి రిలేట్ అయ్యేలా ఉంటుంది. అఖిల్ అంతలా నటించాడు. ఎమోషన్స్‌ను పలికించడం సక్సెస్ అయ్యాడు. ఇక భావన సాగి అయితే తన నటనతో కట్టిపడేస్తుంది. తెరపై చెలాకీగా నవ్వుతూ కనిపించింది. కొన్ని సీన్లలో ఏడిపించింది. మౌనిక రెడ్డి, రవితేజలు తమ పరిధి మేరకు నటించారు. మిగిలిన పాత్రలు పర్వాలేదనిపిస్తాయి.
విశ్లేషణ
ఆత్మలు బయటకు రావడం అనేది ఫిక్షన్. అలాంటి ఫిక్షన్ కథలో ఇక లాజిక్స్ వెతకకూడదు. అలా లాజిక్స్‌ను వెతుక్కుంటూ వెళ్తే ఈ సినిమాను ఎంజాయ్ చేయలేం. లాజిక్స్‌ను పక్కన పెట్టి చూస్తే సినిమాను ఆస్వాదించొచ్చు. ఎమోషనల్‌గా ఆ పాత్రలతో కనెక్ట్ అవ్వొచ్చు. ఆ పాత్రలతో మనం ప్రయాణం చేయవచ్చు. అలా ప్రేక్షకులను కథను కనెక్ట్ చేయడంతో దర్శకుడు శ్రవణ్ సక్సెస్ అయ్యాడు.
టూ సోల్స్ కథ, కథనం స్లోగానే సాగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఎంచుకున్న బ్యాక్ డ్రాప్, సిక్కీం అందాలు, ఆ విజువల్స్, మంచు కొండలు ఇలా అన్నీ కలిసి సినిమాను ఎక్కడా బోర్ కొట్టించదు. విజువల్స్, సాంగ్స్, ఆర్ఆర్ ఇలా అన్నీ కూడా సినిమాకు బలంగా నిలిచాయి. అయితే కథ పరంగా చూస్తే ప్రథమార్థం కాస్త స్లోగా అనిపిస్తుంది. ద్వితీయార్థం ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. ప్రేమ కథకు కనెక్ట్ అవుతాం. ప్రీ క్లైమాక్స్ నుంచి ట్విస్ట్‌లు రివీల్ అయ్యే వరకు బాగుంటుంది. చివరకు మంచి ఫీల్‌తో ప్రేక్షకుడు బయటకు వస్తాడు.
ఇక టెక్నికల్‌గా సినిమా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమాకు విజువల్స్, మాటలు, పాటలు, ఆర్ఆర్ ఇలా అన్నీ కలిసి వచ్చాయి. డైరెక్టర్‌గా, ఎడిటర్‌గా, మాటల రచయితగా శ్రవణ్ తన ప్రతిభను చూపించాడు. మొదటి సినిమానే అయినా అనుభవం ఉన్న దర్శకుడిలా హ్యాండిల్ చేశాడు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
రేటింగ్ 2.75