• October 4, 2022

“బిహైండ్ సమ్ వన్” ట్రైలర్ కు అనూహ్య స్పందన*

“బిహైండ్  సమ్  వన్”  ట్రైలర్ కు అనూహ్య  స్పందన*

    రాజ్ సూర్య, నివిక్షా నాయుడు నటిస్తున్న చిత్రం “బిహైండ్ సమ్ వన్” కాయిన్ ఎర్త్ క్రియేషన్స్ బ్యానర్ పై డాక్టర్ సింగవరం సునీల్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు అజయ్ నాలి తెరకెక్కించారు.

    తాజాగా ప్రొడ్యూసర్ సునీల్ సింగ్ గారి తండ్రి సింగవరం సుభాన్ సింగ్ గారి చేతుల మీదుగా “బిహైండ్ సమ్ వన్” ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మంచి గ్రిప్పింగ్ గా ఉంది. అమ్మాయిలను చంపే ఒక కిల్లర్ ను ఈ ట్రైలర్ లో మనం గమనించవచ్చు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ను తెరకెక్కించినట్లు తెలుస్తుంది. తాజాగా రిలీజైన ఈ ట్రైలర్ కి అనూహ్య స్పందన లభిస్తుంది. ట్రైలర్ ఇలా ఉంటే.. సినిమా ఎలా ఉండబోతుందనేది..ట్రేడ్ వర్గాల ఉత్కంఠ రేపుతోంది.. సస్పెన్స్, త్రిల్లర్ సినిమాలు చాలా వచ్చాయి. కానీ ఈ మూవీ సరి కొత్త గా ఉంటుందని దర్సక ,నిర్మాతలు తెలిపారు.

    ఈ చిత్రంలో రాజ్ సూర్య, నివిక్షా నాయుడు తో పాటు సహర్ కృష్ణ ,రవి బాబు, అజయ్, సుమన్ తదితరులు కనిపించబోతున్నారు. అజయ్ నాలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి, విజయ్ కురవ్ కుల్ల సంగీతం అందిస్తున్నారు.

    నటీనటులు
    రాజ్ సూర్య, నివిక్షా నాయుడు,సహర్ కృష్ణ ,రవి బాబు, అజయ్, సుమన్ తదితరులు

    సాంకేతిక నిపుణులు:
    బ్యానర్ : కాయిన్ ఎర్త్ క్రియేషన్స్
    ప్రొడ్యూసర్ : డాక్టర్ సింగవరం సునీల్ కుమార్ సింగ్
    కో ప్రొడ్యూసర్ : సింగవరం సురేష్ కుమార్ సింగ్
    ఎగ్జిక్యూటివ్  ప్రొడ్యూసర్ : పండు గాయల సుబ్బయ్య
    డైరెక్టర్ : అజయ్ నాలి
    సినిమాటోగ్రఫీ : వెంకట్ ఆనెమ్
    మ్యూజిక్ : విజయ్ కురవ్ కుల్ల
    ఎడిటింగ్ : క్రాంతి.ఆర్కే
    లిరిక్స్ : రాంబాబు గోశాల
    కొరియోగ్రఫీ :రజిని
    ప్రొడక్షన్ డిజైనర్ : యోగానంద్
    ఫైట్స్ : రవి
    స్టిల్ : ఎస్.మనీ చిన్న శ్రీకాంత్
    అసిస్టెంట్ ఎడిటర్ : సంతోష్ పెద్ది
    పబ్లిసిటీ డిజైనర్ : తమిళ్ చేజియన్
    పి ఆర్ ఓ : లక్ష్మి నివాస్