- September 7, 2022
అమ్మో ఆరోహిలో ఇంత ఫైర్ ఉందా?.. రేవంత్ దుమ్ముదులిపేసిందిగా

బిగ్ బాస్ ఇంట్లో ఎప్పుడు ఎలా ఎవరు ఫైర్ అవుతారో చెప్పలేం. ఎవరికి ఎప్పుడు కోపం వస్తుంది.. ఎప్పుడు బరస్ట్ అవుతారో చెప్పలేం. బిగ్ బాస్ ఇంట్లో ఇప్పటికే రెండు రోజులు గడిచాయి. ట్రాష్ క్లాస్ మాస్ టాస్క్ కూడా ముగిసింది. టాస్క్ ముగిసే సరికి.. బాలాదిత్య, ఇనయ, అభినయ నామినేషన్‌లోకి వచ్చారు. ఇక మిగిలిన మెంబర్స్ కోసం నేడు నామినేషన్ ప్రక్రియ చేపట్టినట్టు కనిపిస్తోంది.
ఈ మేరకు వదిలిన ప్రోమోలో వార్, వాగ్వాదాం పీక్స్‌కు చేరుకున్నట్టు కనిపిస్తోంది. అయితే ఇందులో ఈ రెండ్రోజులు సైలెంట్‌గా ఉన్న ఆరోహి.. ఒక్కసారిగా పైకి లేచింది. తన గళాన్ని పైకి విప్పింది. గొంతెత్తి కరెక్ట్ పాయింట్ విసిరింది. అన్నింట్లోకి తల దూర్చుతున్న రేవంత్‌కు సరైన సమాధానం ఇచ్చింది. అసలే అన్నింట్లోకి దూరుతూ, తాను చెప్పిందో జరగాలన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు.
Modhati week nominate ayyedi evaru? 😱
Watch the drama unfold on @StarMaa, streaming 24/7 on @DisneyPlusHSTel.#BiggBossTelugu6 #BBLiveOnHotstar#DisneyPlusHotstar #StarMaa pic.twitter.com/UR4qJrRYq4
— starmaa (@StarMaa) September 7, 2022
దీంతో కొందరు రేవంత్ మీద గుర్రుగా ఉంటూ వచ్చారు. నామినేషన్ ప్రక్రియ సమయంలో అసలు విషయాన్ని రేవంత్ మొహం మీదే చెప్పేశారు. ఇక ఇందులో రేవంత్ మీద ఫైమా, ఆరోహిలు అదిరిపోయే పంచులు వేశారు. నువ్ రెండు మార్కుల ప్రశ్నకు 20 మార్కుల సమాధానం చెబితే.. నేను 20 మార్కుల ప్రశ్నకు రెండు వేల మార్కుల సమాధానం చెబుతాను అంటూ ఆరోహి అదరగొట్టేసింది.
ఇక ఫైమా సైతం రేవంత్‌కు అదిరిపోయే కౌంటర్లు వేసింది. మొత్తానికి ఈ మొదటి వారంలో ఆరోహి, సత్య, ఫైమా, చలాకీ చంటి, రేవంత్, అభినయ, ఇనయలు నామినేషన్‌లోకి వచ్చారు. ఇందులో ఇనయకు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.