- August 2, 2022
Happy Birthday Devi Sri Prasad : D (దుమ్ములేపే) S (సాంగ్స్)తో P(ప్రేక్షక) లోకాలని ఊపేసే సంగీత దర్శకుడు!

Happy Birthday Devi Sri Prasad దేవీ శ్రీ ప్రసాద్ మార్క్ సంగీతం అంటే ఇష్టపడని తెలుగు ప్రేక్షకులుండరు. దేవీ సినిమా నుంచి మొన్నటి వరకు వచ్చిన ఎఫ్ 3 సినిమా వరకు దేవీ శ్రీ ప్రసాద్ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో దేవీ శ్రీ ప్రసాద్ తన సంగీతం ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇక డీఎస్పీగా తన ముద్ర ఏదైనా సినిమా ఆల్బమ్ మీద పడిందంటే.. ఆ సినిమా హిట్టే అనే స్థాయి వరకు చేరుకున్నాడు.
మధ్యలో దేవీ శ్రీ ప్రసాద్ ఊపు కాస్త తగ్గినట్టు అనిపించినా.. ఆయన శకం మాత్రం ఎంతో గొప్పగా కొనసాగుతూనే ఉంది. ఒకప్పటి యూత్ ప్రేక్షకులకు, ప్రేమికులకు దేవీ ఇచ్చిన సంగీతమే ఊపిరిలా ఉండేది. ప్రేమలో పడ్డవారైనా, బ్రేకప్ బాధలో ఉన్నా కూడా దేవీ సంగీతమే మందులా పని చేసేది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు దేవీ సంగీతాన్ని ఎంజాయ్ చేస్తుండేవారు.
దేవీ, ఆనందం, సొంతం ఒక టైపు ఆల్బమ్స్ అనుకుంటే.. ఆర్య,బొమ్మరిల్లు ఇంకో టైపు ఆల్బమ్స్. ప్రేమికులంతా కూడా ఈ ఆల్బమ్స్‌ను పాడుకుంటూ ప్రేమించుకునేవారు. ఇక ఐటం సాంగ్స్‌కు దేవీ శ్రీ ప్రసాద్ తెలుగులో పెట్టింది పేరు. ఎన్నో కొత్త పదాలను జనాలకు అలవాటు చేశాడు. రింగా రింగా, కెవ్వు కేక ఇలా ఎన్నెన్నో మాస్ పాటలతో జనాలను ఉర్రూతలూగించాడు. బన్నీ, పవన్ కళ్యాణ్, చిరంజీవి వంటి వారికి డీఎస్పీ కొట్టిన పాటలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్‌గా ఉంటాయి.
పుష్ప సినిమాతో ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు డీఎస్పీ. ఇప్పుడు డీఎస్పీ కాసింత స్లో అయ్యాడు. కానీ మెగా 154, పుష్ప 2తో మరోసారి డీఎస్పీ తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. చిరంజీవి మళ్లీ మాస్ ఆల్బమ్ ఇవ్వనున్నాడట. అలాంటి D (దుమ్ములేపే) S (సాంగ్స్)తో P(ప్రేక్షక) లోకాలని ఊపేస్తుండాలి.. ఇంకా ఇలాంటి ఎన్నో పుట్టిన రోజులను(ఆగస్ట్ 2) ఆయన జరుపుకోవాలని A2z Adda తరుపున విషెస్ అందజేస్తున్నాం.