- March 24, 2022
RRR Twitter Review : RRR ట్విట్టర్ రివ్యూ.. ఈ ఒక్క వీడియో చాలు
RRR Movie Twitter Review ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ మ్యానియానే కనిపిస్తోంది. మొత్తానికి నేటి శుక్రవారం (మార్చి 25) ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే చాలా చోట్ల ప్రీమియర్ షోలు పడ్డాయి. హిందీలో మీడియాకు ప్రత్యేకంగా షో వేశారు. ఇక హైద్రాబాద్లోనూ ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో పాటు ప్రత్యేకంగా ప్రీమియర్ షోలో సినిమాను చూస్తోన్నట్టు తెలుస్తోంది.
Interval…#RRR #RRRMoive
Theaters box lu baddalu kakunte ottu.. 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 just lit… Unexpected twists and anna #RamCharan & #NtrJr 🙏🙏🙏🙏🙏🙏— TollywoodPolls📽 (@tollywood_polls) March 24, 2022
మొత్తానికి ఆర్ఆర్ఆర్ సినిమా షోలు మాత్రం చాలా చోట్ల పడ్డాయి. ఓవర్సీస్ నుంచి టాక్ అదిరిపోయిందని తెలుస్తోంది. ట్విట్టర్లో ఇరువురు హీరోల అభిమానుల సందడి మొదలైంది. ట్విట్టర్లో ఆర్ఆర్ఆర్ సందడి కనిపిస్తోంది. ఇక మెగా, నందమూరి అభిమానుల మధ్య వార్ మొదలయ్యేట్టుంది.
#RamCharan Reviews are out – #Ramcharan steals the show..
– Viral bhayani ..wow 🔥 #RRRMovie
— cherryfanRRR 341 (@cherryfan341) March 24, 2022
మా హీరో సీన్ అదిరిపోయిందంటే.. మా హీరో సీన్ అదిరిపోయిదంటూ ట్వీట్లలో వార్ చేసేట్టున్నారు. ఇప్పటికే టాలీవుడ్ సెలెబ్రిటీలందరూ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా మీద ట్వీట్లేశారు. మొత్తానికి ఒక్కొక్కరు ఐదువేలు పెట్టి కూడా బ్లాక్లో టికెట్లు కొంటున్నట్టు తెలుస్తోంది.
అయితే ఈ సినిమా టైటిల్ కార్డ్, టైటిల్స్ పడే తీరుని చూస్తేనే సినిమా ఎలా ఉండబోతోందో అర్థమైంది. టైటిల్స్ చివర్లో రాజమౌళి పేరు.. ఆ తరువాత RRR అని వస్తుంది.. ది స్టోరీ అని వచ్చి నేరుగా కథలోకి వెళ్లినట్టు కనిపిస్తోంది. మొత్తానికి సినిమా ఎలా ఉండబోతోందో ఈ వీడియోతోనే అర్థమైంది.
Terrific Title Card🥵💥 @ssrajamouli #RRRMoive #RamCharan #NTR𓃵 https://t.co/3ZflVNW2dg pic.twitter.com/KkTmEW2zse
— R A J (@nagaraj85761545) March 24, 2022
రామ్ చరణ్ అదరగొట్టేశాడంటూ టాక్ బయటకు వచ్చింది. దీంతో రామ్ చరణ్ అభిమానులు ట్విట్టర్లో సందడి చేస్తున్నారు. ఈ మేరకు ట్వీట్ల వర్షం కురుస్తోంది. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం హంగామా చేస్తున్నారు.