• March 20, 2022

RRR ఈవెంట్‌లో మెరిసిన కన్నడ యాంకర్.. అను శ్రీ మామూల్ది కాదు

RRR ఈవెంట్‌లో మెరిసిన కన్నడ యాంకర్.. అను శ్రీ మామూల్ది కాదు

    RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం నాడు చిక్ బల్లాపూర్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌లో యాంకర్ సుమ తన స్టైల్లో దుమ్ములేపేసింది. అయితే సుమకు ధీటుగా కన్నడ యాంకర్ రెచ్చిపోయింది. కన్నడ యాంకర్ అను శ్రీ అందరినీ ఆకట్టుకుంది. కన్నడ సుమ అంటూ తనను పరిచయం చేసుకుంది. మొత్తానికి కన్నడ యాంకర్ సమయస్ఫూర్తికి, మాటల ధాటికి రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా ముగ్దులైపోయారు.

    తమ ప్రసంగంలో చివర్లో కూడా అను శ్రీకి థ్యాంక్స్ చెప్పారు. ఇక కన్నడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ శివన్న సైతం అనుశ్రీని పొగిడేశారు. మొత్తానికి ఈ ఈవెంట్‌తో అను శ్రీ.. తెలుగు వారికి కూడా దగ్గరైంది. దీంతో అను శ్రీ కథ ఏంటో తెలుసుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అయితే అను శ్రీ ఇన్ స్టా ఖాతాను చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే.

    దాదాపు రెండు మిలియన్లకు దగ్గర్లో ఫాలోవర్లున్నారు. ఇక ఆమె అప్పుకి వీరాభిమాని. పునీత్ రాజ్ కుమార్‌తో దిగిన ఫోటోలు, ఆయనంటే ఎంత అభిమానమో తెలిపే పోస్టులే ఎక్కువగా ఉన్నాయి. మొత్తానికి తెలుగులో సుమ అయితే.. కన్నడ సుమగా అను శ్రీకి మంచి డిమాండ్ ఉందని అర్థమవుతోంది.

     

    Leave a Reply