- January 26, 2022
Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. తండ్రి కోరికను తీర్చిన రిషి.. ఇది కదా? సీన్ అంటే

గుప్పెడంత మనసు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ అంటే బుధవారం జనవరి 26న ప్రసారం కానున్న Guppedantha Manasu Episode 357 నాటి ధారావాహికలో ఎమోషనల్ సీన్స్ బాగానే పండాయి. రిషి స్వయంగా ఇంటికి వచ్చి తనను ఆహ్వానించడంతో జగతి సంబరపడిపోయింది. మరో వైపు గౌతమ్ దూకుడుకు ధరణి తెగ భయపడుతూ ఉంటుంది. అలా గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ ముందుకు సాగింది.
ధరణి నువ్వే మహేంద్రను చూసుకోవాలి. ఇక్కడుండి బాధపడటం తప్పా ఇంకేం చేయలేను.. అని జగతి అంటుంది. మీరు అంతగా చెప్పాల్సిన పని లేదు.. చిన్న మామయ్య గారిని నేను చూసుకుంటాను.. అని ధరణి అంటుంది. ఇక గౌతమ్ ఎంట్రీ ఇస్తాడు. మీర డైట్ గురించి డాక్టర్‌తోనే కదా? మాట్లాడుతోంది వదిన అని గౌతమ్ అడుగుతాడు.
చిన్న మామయ్య జగతి అత్తయ్య గురించి గౌతమ్‌కు చెప్పాల్సిన పని లేదు.. అని లోలోపల అనుకుంటుంది ధరణి. బయటకు మాత్రం అవును అని సమాధానం చెబుతుంది. ఈ గౌతమ్ గాడికి తెలివి తేటలు ఎక్కువ.. అని బిల్డప్ ఇస్తాడు. ఇంట్లో కనిపించలేదు.. ఎక్కడికి వెళ్లావ్.. అని ధరణి అంటుంది. తీరిక లేని పనులు..వదిన అని అంటాడు గౌతమ్.
రిషి ఎటు వెళ్లాడో నీకు తెలుసా?.. వదిన అని గౌతమ్ అడుగుతాడు. వాడు చెప్పడులే అని మళ్లీ గౌతమ్ అనేస్తాడు. నా ఫ్రెండ్‌ని లంచ్‌కి పిలవొచ్చా? ఈ విషయం పెద్దమ్మను అడగాలంటే భయంగా ఉంది. నాకు సాయం చేస్తావా? వదిన అని గౌతమ్ అంటాడు. ఎందుకు చేయను చేస్తాను.. కానీ ఆ ఫ్రెండ్ ఎవరు.. అమెరికా నుంచి వస్తాడా? అని ధరణి అడుగుతుంది.
దేవలోకం నుంచి ఏంజిల్ వస్తుంది అని గౌతమ్ లోలోపల అనుకుంటాడ. వసుధార అని గౌతమ్ చెప్పడంతో ధరణి షాక్ అవుతుంది. వసుధార నీ ఫ్రెండ్? అని ధరణి ఆశ్చర్యపోతుంది.. రిషి నా ఫ్రెండ్ అయినప్పుడు.. వసుధార నా ఫ్రెండ్.. మీరేందుకు అంత షాక్ అయ్యారు.. అని గౌతమ్ అడుగుతాడు. దేవయాణి అత్తయ్యకు వసుధార అంటే కోపం.. అస్సలు పడదు.. అని ధరణి అంటుంది.
ఎందుకు వసు మన రిషికి లైన్ వేస్తుందని భయమా?..అంత సీనే లేదు.. రిషి అంత సీరియస్‌గా ఉంటాడు..వాడి దగ్గరకు వెళ్లాలంటే నేనే భయపడతాను అని గౌతమ్ అంటాడు. రిషి చాలా మంచోడు.. అని ధరణి అంటాడు. మంచితనాన్ని సెల్ ఫోన్‌లా చూపించలేం కదా? అని గౌతమ్ అంటే.. చెడ్డగుణం చూపించకపోయినా తెలుస్తుంది కదా?. అని ధరణి కౌంటర్ వస్తుంది.
మీరు ఓకే అంటే.. వసుధారని లంచ్‌కి పిలుస్తాను.. లేదంటే పండక్కి నేనే వాళ్లింటికి లంచ్‌కి వెళ్తాను.. ఇళ్లు మారుతుందేమో కానీ దిల్‌లో ప్రోగ్రాం మారదు.. నేనూ వసు సంక్రాంతి.. అని గౌతమ్ రెచ్చిపోతాడు. రిషికి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టేలా ఉన్నాడే..అని గౌతమ్ గురించి ధరణి ఆలోచిస్తుంది. ఇక వసు రిషిలు మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు ఓ హెల్ప్ చేయాలి.. అని రిషి అడిగేస్తాడు. నేనేం చేయగలను అని వసు అంటుంది.
నువ్వ్ మాత్రమే చేయగలవ్..అని ఏదో చెబుతాడు రిషి. నా స్థాయికి మించి అడిగారు.. నేను చేయలేను సర్..అని వసు చేతులెత్తేస్తుంది. నిన్ను ఎప్పుడూ ఏ హెల్ప్ అడగలేదు కదా? అని రిషి అంటే.. ఎప్పుడూ అడగలేదని అసాధ్యమైంది అడిగితే చేయలేను అని వసు అంటుంది.. నేను నీకు ఎన్ని సార్లు సాయం చేశాను.. ప్రిన్స్, జెంటిల్మెన్.. అన్నావ్.. అని రిషి అంటాడు.
అవన్నీ నిజమే కానీ.. ఇది మాత్రం నా వల్ల కాదు.. అని వసు అంటుంది. నాకు తెలుసు.. నాకు ఎవ్వరూ హెల్ప్ చేయరు.. నేను ఎప్పుడూ ఒంటరివాడినే..అని రిషి బాధపడతాడు. ఈ విషయంలో నేను ఏ హెల్ప్ చేయలేను అంటూ లోలోపల వసు అనుకుంటుంది. ఇక ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తుంటారు. హెల్త్ జాగ్రత్త.. వర్క్ లోడ్ తగ్గించుకో.. నీ గురించి వదిన కంగారు పడుతోందని మహేంద్రకు ఫణీంద్ర సూచిస్తాడు.
వదినకు నేను అంటే ఎంత అభిమానమో నాకు తెలుసు కదా? అని మహేంద్ర అంటాడు. అంతా నటన అని ధరణి తన మనసులో అనుకుంటుంది. అయినా దేవయాణికి వినపడినట్టుంది. ఒక్కసారిగా కోపంగా చూస్తుంది.. మనసులో మాట బయటకు వినిపిస్తుందా? ఏంటి.. అని ధరణి కంగారు పడుతుంది. మీరు కూడా తినండి వదిన అని గౌతమ్ అంటే.. అందరూ తిన్నాకే తింటాను..అని ధరణి చెబుతుంది.అది పెద్దలకు ఇచ్చే గౌరవం అని ఫణీంద్ర మెచ్చుకుంటాడు..
మహేంద్ర గండం నుంచి బయటపడ్డాడు కాబట్టి.. చాలా గ్రాండ్‌గా సంక్రాంతి సెలెబ్రేట్ చేసుకుందాం.. అని ఫణీంద్ర అంటాడు. పండుగ అదిరిపోద్దన్న మాట.. అని గౌతమ్ అంటాడ. జగతి లేకుండా జరిగే పండుగ నాకు పండుగే కాదు.. అని మహేంద్ర లోలోపల అనుకుంటాడు. గాలి పటాలు ఎగిరేద్దాం ఏమంటారు అంకుల్.. అని గౌతమ్ అడిగితే.. మహేంద్ర సరేనని తలూపుతాడు. రిషి ఎక్కడికి వెళ్లాడు.. అని గౌతమ్ అడుగుతాడు. అలా సీన్ అక్కడికి ఎండ్ అవుతుంది.
రిషి మాటలను తలుచుకున్న వసు.. కాఫీ ఇవ్వనా? అని జగతి అడుగుతుంది. మొదట ఇవ్వండి.,. అని అంటుంది. ఆ వెంటనే వద్దు మేడం..అని చెబుతుంది. కాఫీ కావాలో వద్దో చెప్పలేకపోతోన్నావా?.. అని జగతి అంటుంది. తను చెప్పింది నేను ఎలా చేయగలను..అని రిషి గురించి వసు ఆలోచిస్తుంటుంది. పొద్దున్నే ఏంటి ఇలా ఉన్నావ్.. అని జగతి అడిగితే.. ఏం లేదు మేడం.. అని వసు అంటుంది.
రిషి సర్ అలా ఎలా అడిగారు.. నా వల్ల కాదని చెబితే.. కూడా మళ్లీ మళ్లీ అడుగుతున్నారు.. ఈ రోజు నాతో మాట్లాడతారో కూడా తెలీదు.. అని రిషి గురించి వసు అనుకుంటూ ఉంటుంది. ఇంతలో రిషి వస్తాడు. రిషి రాకను చూసిన జగతి.. వసు.. వసు.. అంటుంది. ఇంతలో గుమ్మం వరకు వచ్చిన రిషి.. లోపలకి రావొచ్చా మేడం.. అని పర్మిషన్ అడుగుతాడు.
రండి సర్.. కూర్చోండి..అని జగతి అంటుంది. ఏంటి ఇంత పొద్దున్నే వచ్చాడు. క్లాస్ పీకుతారేంటి.. తప్పించుకోవాలి అని వసు అనుకుంటుంది. ఇంతలో కాఫీ తీసుకునిరా అని జగతి చెప్పడంతో వసు లోపలకు వెళ్తుంది. కూర్చోండి సర్ అని జగతి అంటే.. పర్లేదు మేడం.. ఇప్పుడు నాకేం కాఫీ వద్దు.. పొద్దున్నే కాఫీ కోసం రాలేదు.. మీరు నాకొక హెల్ప్ చేయాలి.. అని రిషి అంటాడు.
చెప్పు రిషి..అని జగతి అనేస్తుంది. ఆ వెంటనే చెప్పండి సర్.. అని మళ్లీ అంటుంది. డాడ్ విషయంలో.. మా డాడ్ సంతోషమే నాకు ముఖ్యం.. ఆయన ఆనందం ముందు నాకు ఏదీ ముఖ్యం కాదు.. ఆయన సంతోషంగా ఉండాలి.. అందుకు మీరు ఒక పని చేయాలి మేడం.. అని అంటాడు రిషి. చేస్తాను సర్.. కానీ ఇక్కడి నుంచి వెళ్ళమనకండి.. నన్ను వెళ్లిపోమని కాకుండా మీరేం చెప్పినా చేస్తాను సర్.. అని జగతి అంటుంది.
నేను చెప్పింది.. మీరు కాదనకూడదు.. అని రిషి అంటాడు. సర్.. ఇక్కడి నుంచి వెళ్లమనడం కాకుండా ఏం చెప్పినా చేస్తాను సర్.. అని జగతి అంటుంది. మీరిక్కడి నుంచి వెళ్లాలి.. అని రిషి చెప్పడంతో జగతి బాధపడుతుంది. మా డాడ్ సంతోషం కోసం.. మా ఇంటికి రావాలి.. అని రిషి అనడంతో.. సర్.. అని జగతి సంబరపడుతుంది. ఇక్కడి నుంచి వెళ్లాలంటే.. ఆ ఇంటికి వెళ్ళాలన్నట్టు.. మా ఇంటికి రావాలన్నట్టు.. అని క్లారిటీగా చెబుతాడు రిషి.
సర్.. నేను.. నేను ఆ ఇంటికి.. నా ఇంటికి.. అని జగతి ఎమోషనల్ అవుతుంది. అవును మేడం.. మా ఇంటికి.. అని నొక్కి మరీ చెబుతాడు రిషి. సర్. నన్ను ఇంటికి పిలుస్తున్నారా?.. అని జగతి అంటుంది. మా ఇంటికి రావాలి.. మా డాడ్ సంతోషం కోసం.. మా డాడ్ ఆనందం కోసం రావాలి..అని రిషి అడుగుతాడు. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో జగతిని ఇంట్లోకి రావడం చూసి దేవయాణి మొహం మాడిపోతే.. మహేంద్ర మొహం వెలిగిపోతుంది.