• January 22, 2022

Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. ఇంటి ముందు అనామకురాలిగా జగతి.. రిషి పనికి దేవయాణి షాక్

Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. ఇంటి ముందు అనామకురాలిగా జగతి.. రిషి పనికి దేవయాణి షాక్

    గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే జనవరి 22న శనివారం ప్రసారం కానున్న Guppedantha Manasu Episode 354 ధారావాహికలో గుండెలు మెలిపెట్టే సీన్లు పడ్డాయి. జగతి కంట్లోంచి నీళ్లు ధారలా ప్రవహిస్తుంటాయి. ఏం చేయలేక మహేంద్ర అలా చూస్తుండిపోతాడు. ఇక దేవయాణి తన కసి అంతా కూడా తీర్చుకుంటుంది. కానీ చివరకు రిషి చేసిన పనికి దేవయాణి అవాక్కవుతుంది. అలా గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ ఎంతో భారంగా,హృద్యంగా ముందుకు సాగుతుంది.

    మహేంద్ర దగ్గరు దేవయాణి, ధరణి, ఫణీంద్ర, రిషి అంతా ఉంటారు. ఇక ఇంటికి వెళ్దామని మహేంద్ర అంటాడు. ఇంతలో నర్స్ వచ్చి.. రిషిని బిల్లింగ్ సెక్షన్‌కు రమ్మని అంటుంది. మీరు ఇంటికి వెళ్లండి.. అని అందరినీ పంపిచేస్తాడు రిషి. మనం వెళ్లి మహేంద్ర రూంను రెడీ చేద్దాం అని ధరణితో దేవయాణి అంటుంది.. నీ మీద వదినకు ఎంత ప్రేముందో చూశావా? అని ఫణీంద్ర అంటాడు.

    వదిన గారి ప్రేమ నాకు తెలియనిదా?.. అని మహేంద్ర చురకలు వేస్తాడు. రిషి బిల్లింగ్ సెక్షన్‌లో ఉంటాడు. ఇక మహేంద్ర వద్ద జగతి, వసు ఉంటారు. ఏంటి జగతి మేడం.. మిషన్ ఎడ్యుకేషన్ పనులు ఎంత వరకు వచ్చాయ్.. అని అంటాడు. ఇప్పుడు అది అవసరమా? అని జగతి అంటుంది. నేను ఫిట్‌గా ఉన్నాను.. ఏం వసుధార అని మహేంద్ర అంటాడు. ఎప్పుడూ మీరు ఫిట్‌గానే ఉంటారు.. అని వసు అంటుంది.

    నాకు ఓ కాఫీ ఇస్తావా? అని మహేంద్ర అంటే.. ఇకపై అలాంటివి కుదరవు.. ఏం తినాలో నేను డిసైడ్ చేస్తాను..అని జగతి అంటుంది. ఇదే మాట మన పుత్రరత్నం అన్నాడు తెలుసా? నీ కొడుక్కి నీ ఆలోచనలే వచ్చాయ్.. అని మహేంద్ర అంటాడు. థ్యాంక్స్ అని జగతి నవ్వేస్తుంది.. మా వదిన తెగ హడావిడి చేస్తోంది నా మీద ప్రేమ చూపిస్తోంది..మిమ్మల్ని ఏమీ అన లేదు కదా? అని మహేంద్ర అంటాడు.

    అనే అవకాశం రాలేదు.. వస్తే ఏదో ఒకటి అనేవారు కదా? అని వసు అంటుంది. వసు అలా ఎందుకు అంటావ్.. అని జగతి అంటుంది. మీ అంత ఓపిక నాకు లేదు మేడం.. అని వసు బదులిస్తుంది. వసు ఇది మన కారులో పెట్టేయ్.. అని బయటకు పంపిస్తుంది జగతి. నువ్ కూడా వెళ్తావా? అని జగతిని మహేంద్ర అంటాడు. నువ్ మీ ఇంటికి వెళ్తావ్.. నేను మా ఇంటికి వెళ్తాను అని జగతి అంటుంది.

    అది మన ఇళ్లు.. అని మహేంద్ర అంటాడు. అది ఒకప్పుడు అని జగతి అంటుంది.. ఎప్పుడో ఒకప్పుడు మళ్లీ మనదే అవుతుంది అని మహేంద్ర అంటాడు.. నువ్ ఇంటి వరకు వచ్చి నన్ను వదిలేయోచ్చు కదా? అని మహేంద్ర అంటాడు. అందరి గురించి కాదు నాకు బాగుంటుంది.. వచ్చి వదిలేయ్ అని జగతిని చేతిలో చేయి వేసి మహేంద్ర అడుగుతాడు. అలా ఆ ఇద్దరిని చూసి రిషి అటు నుంచి అటే వెళ్లిపోతాడు.

    జగతి మేడం కారులో గౌతమ్.. రిషి కారులో అందరూ కలిసి వెళ్తారు. వసుతో మాట్లాడుతున్నట్టు కారు నడుపుకుంటూ వస్తాడు గౌతమ్.. మీ అందరూ ఒక్కటై.. మీ కారును తీసుకొచ్చేందుకు నన్ను వాడతారా?.. అని గౌతమ్ అనుకుంటాడు. ఇంకా రాలేదేంటి అని ఇంటి వద్ద దేవయాణి ఎదురుచూస్తుంది.. బయల్దేరామని మెసెజ్ పెట్టారు.. వస్తారులే.. అని ఫణీంద్ర అంటాడు. దిష్టి బొమ్మలా ఇక్కడే ఉన్నావేంటి.. వెళ్లి దిష్టి తీసేందుకు తయారు చేయ్ అని అంటుంది.

    ఇంతలో కారు వస్తుంది. మహేంద్ర ఒక్క నిమిషం ఉండు.. అని కారు దిగుతుంది జగతి. అలా జగతిని చూసి ఇక్కడకు వచ్చిందేంటి అని దేవయాణి షాక్ అవుతుంది. మహేంద్రను కారులోంచి జగతి, ఫణీంద్రలు దింపుతారు. మహేంద్ర అలా కిందపడిపోతుండగా జగతి పట్టుకుంటుంది. డాడ్ జాగ్రత్త.. మా డాడ్‌ని నేను చూసుకుంటాను.. అని జగతిని వదిలేయమన్నట్టుగా పరోక్షంగా చెబుతాడు రిషి.

    దీంతో జగతి బాధపడుతుంది. ఇక జగతి గడప అవతలే ఉంటుంది. దిష్టి తీస్తున్న నెపంతో జగతిని మరింత బాధపెడుతుంది దేవయాణి. దిక్కు మాలిన వాళ్ల దిష్టి.. అసలే ఈ ఇంటి మీద చాలా మంది కళ్లున్నాయ్.. అని దేవయాణి పరోక్షంగా సూటి పోటి మాటలు అంటుంది. అలా జగతి ఇంటి బయటే ఉంటూ కన్నీరు కారుస్తూ ఉంటుంది. ఇక ఇంట్లోకి వెళ్లిన మహేంద్ర.. ఈ గడప దాటి ఎప్పుడొస్తావ్ జగతి అని లోలోపల అనుకుంటాడు..

    ఆ గడప దాటి ఎప్పటికీ రాలేనేమో మహేంద్ర.. అని జగతి లోలోపల అనుకుంటుంది. లోపలకు వచ్చి తలుపులేసేయ్ ధరణి.. అని దేవయాణి అంటుంది. పెద్దమ్మ ఒక్క నిమిషం.. అంటూ రిషి బయటకు వెళ్తాడు. జగతికి దండం పెడతాడు. మీ ఇద్దరూ లేకపోతే మా డాడ్ ఉండేవారే కాదు.. థ్యాంక్యూ అని రిషి చెప్పడంతో దేవయాణి కుళ్లుతో చచ్చిపోతుంది. మహేంద్ర చిరు నవ్వు నవ్వేస్తాడు.

    ఇక వసు, జగతి వెనక్కి బయల్దేరుతారు. మీరు కూడా లోపలకి వెళ్లొచ్చు కదా? మేడం అని వసు అంటుంది. తలుపులు తెరిచి ఉంటే వెళ్లడం కాదు.. అందులో ఉన్న మనుషులు మనసు తలుపులు తెరిచి ఉండాలి.. నా రాక కోసం అంతా ఎదురుచూడాలి.. అవకాశం కాదు.. ఆహ్వానం ఉన్నప్పుడే ఆ గడప తొక్కుతున్నాను. మొక్కుతాను.. అది గడప కాదు.. సీతారాములను విడదీసిన లక్ష్మణ రేఖ.. గౌరవంగా పిలిచిన రోజే అక్కడికి వెళ్తాను.. అసలు వెళ్తానోలేదో.. ఇలానే ఒంటరిగా రాలిపోయే అనాథ శవంలా రాలిపోతోనేమో.. అని జగతి బాధపడుతుంది. అలా ఎపిసోడ్ ముగుస్తుంది.

    Leave a Reply