- January 22, 2022
ప్రతీ కథ ముగిసిపోవాల్సిందే.. సీరియల్ ముగిసింది : నిరుపమ్ పరిటాల

HITLER GARI PELLAM-Nirupam Paritala హిట్లర్ గారి పెళ్లాం అనే సీరియల్ చాలా తక్కువ సమయంలోనే ఎక్కువగా పాపులర్ అయింది. కార్తీక దీపం సీరియల్లో వచ్చిన క్రేజ్ మూలంగా కొత్త సీరియల్ మీద కూడా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. స్టార్ మాలో కార్తీక దీపం సీరియల్ టాప్ రేటింగ్‌తో ఉంటుంది. అలాంటి సీరియల్‌ను ఢీ కొట్టేందుకు జీ తెలుగు హిట్లర్ గారి పెళ్లాం అనే సీరియల్‌ను నిరుపమ్‌తో ప్లాన్ చేసిందని అప్పట్లో రూమర్ వచ్చింది.
హిట్లర్ గారి పెళ్లాం సీరియల్ కోసం కార్తీక దీపం సీరియల్ వదిలేశాడని, కార్తీక దీపం సీరియల్ నుంచి నిరుపమ్‌ను తీసేశారంటూ రూమర్లు వచ్చాయి. మధ్యలో కొన్ని రోజులు డాక్టర్ బాబు కార్తీక దీపం సీరియల్లో కనిపించలేదు. ఆ సమయంలోనే హిట్లర్ గారి పెళ్లాం సీరియల్ కూడా ప్రారంభం అయింది. దీంతో ఆ రూమర్లు మరింత ఎక్కువగా వచ్చాయి.
అయితే హిట్లర్ గారి పెళ్లాం సీరియల్లో ఏజే (అభినవ్ జాగర్లమూడి)గా నిరుపమ్ అద్భుతంగా నటించేశాడు. మీసం కట్టు, సీరియస్ లుక్కుతో అందరినీ మెప్పించాడు. అయితే ఈ సీరియల్ ముగిసిపోతోందంటూ గత కొన్ని రోజులుగా రూమర్లు బయటకు వచ్చాయి. అయితే దానికి తగ్గట్టే ఈ సీరియల్ ఎండ్ అయిపోయింది. తాజాగా నిరుపమ్ తన సీరియల్ యూనిట్‌తో కలిసి సెలెబ్రేట్ చేసుకున్న ఫోటోలను షేర్ చేశాడు.
ప్రతీ కథ ఎక్కడో చోట ఏదో రోజు ముగిసిపోవాల్సిందే.. ఈ రోజు హిట్లర్ గారి పెళ్లాం సీరియల్‌కు ముగింపు పలికాం. ఇదేమీ అంత సులభమైన ప్రయాణం కాదు.. ఇది మాకు ఎన్నో నేర్పించింది.. ఎన్నో అనుభవాలను నేర్పించింది.. ఎన్నో మెమోరీస్‌ను అందించింది.. ఈ ప్రయాణం వెనుకున్న ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. ఈ సీరియల్‌ను ఆదరించిన తెలుగు, తమిళ, మళయాలం అభిమానులందరికీ థ్యాంక్స్. మీ ప్రేమ ఆదరణ ఎప్పుడూ ఇలానే ఉండాలి.. మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను అని నిరుపమ్ చెప్పుకొచ్చాడు.