• January 19, 2022

Karthika Deepam నేటి ఎపిసోడ్.. దీప కష్టాలు తీరనున్నాయ్.. సాయం కోసం సౌందర్య వద్దకు కార్తీక్

Karthika Deepam నేటి ఎపిసోడ్.. దీప కష్టాలు తీరనున్నాయ్.. సాయం కోసం సౌందర్య వద్దకు కార్తీక్

    కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే బుధవారం జనవరి 19న ప్రసారం కానున్న Karthika Deepam Episode 1253 ధారావాహికలో కార్తీక్, దీప ఇద్దరూ మథన పడుతూనే ఉన్నారు. కంటి ముందు అమ్మానాన్నలున్నా కూడా పలకరించలేని పరిస్థితి అని కార్తీక్, ఏ సమస్య వచ్చిందని అత్తా మామలు ప్రకృతి వైద్య శాలకు వచ్చారని దీప కంగారు పడుతూ ఉంటుంది. ఇక మరో వైపు రుద్రాణి పోరు కూడా ఎక్కువ అవుతుంది.

    రుద్రాణిని కొట్టినవారిని చూడాలని ప్రకృతి వైద్యశాలకు వస్తుంది దీప. ఇక్కడ రుద్రాణిని కొట్టింది ఎవరు.. ఎక్కడున్నారు అని అడుగుతుంది. ఎందుకు అని అక్కడ పని చేసే ఓ వ్యక్తి అడుగుతుంది. చెడుకి దూరంగా ఉండాలి.. మంచి ఎక్కడున్నా చూడాలి అంటారు కదా? అందుకే అని దీప చెబుతుంది. దీంతో రూంలో ఉన్న తన అత్త మామలను చూసి దీప కన్నీరు కారుస్తుంది.

    వీళ్లేందుకు ఇక్కడున్నారు.. అంటే రుద్రాణిని కొట్టింది అత్తమ్మ గారేనా? ఎందుకు కొట్టి ఉంటారు.. అసలు వీళ్లు ఎందుకు ఇక్కడున్నారు.. ఎవరికి ఏమైంది.. అత్తయ్య గారే సేవలు చేస్తున్నారంటే.. మామయ్య గారికే ఏదో అయి ఉంటుందని ఇలా పలురకాలుగా ఆలోచిస్తూ దీప కన్నీరు పెడుతుంది. ఇక చూడకుండానే అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోతోంది దీప. మళ్లీ వచ్చి చూస్తాను అని దీప చెప్పి వెళ్లిపోతుంది.

    ఇక మరో వైపు రుద్రాణికి వార్నింగ్ ఇచ్చేందుకు కార్తీక్ వెళ్తాడు. రుద్రాణి గారు అని ఎన్ని సార్లు పిలిచినా పట్టించుకోదు. మొక్కలు పిల్లలు, పిల్లికి పిల్లలు అని ప్రతీసారి పిల్లల గురించి తన మనుషులో మాట్లాడుకుంటూ ఉంటుంది. నా పిల్లలకు భోజనం పంపించేందుకు మీరు ఎవరు? అని కార్తీక్ అడుగుతాడు. కోటేశ్‌ను ఇంట్లోకి తీసుకురావడానికి నువ్వెవ్వరు అని రుద్రాణి అంటుంది.

    అది మానవత్వం అని కార్తీక్ అంటే.. ఇది రుద్రాణితత్త్వం అని రుద్రాణి అంటుంది. నేను సాయం చేసేందుకు చేశాను.. అని కార్తీక్ అంటాడు. దీంతో రుద్రాణి సైలెంట్ అవుతుంది. ముందు వడ్డీ, అప్పులు కట్టండి అని రుద్రాణి అంటుంది. నా బర్త్ డే.. మీ పిల్లలకు కొత్త బట్టలు కుట్టించాను.. వీటి కొలతలు ఎలా వచ్చాయో తెలుసా? మీ పిల్లల బట్టలు ఎత్తుకొచ్చారు.. ఈ సారి అంటూ రుద్రాణి ఏదో అనబోతోంది. దీంతో కార్తీక్ మరింత ఫైర్ అవుతాడు. ముందు అప్పు కట్టండి సారు అని రుద్రాణి అంటుంది. రంగరాజును దీప భుజానికి వేసుకుని వెళ్తోంది ఏంటి.. నేను అంటే అంత భయమా? ఆ మాత్రం భయం ఉండాలిలే అని కార్తీక్‌తో రుద్రాణి అంటుంది.

    అలా అక్కడ సీన్ కట్ చేస్తే.. దీప మీద ఓపెన్ అవుతుంది. తన అత్త మామల పరిస్థితి గురించి దీప ఆలోచిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని డాక్టర్ బాబుకు చెప్పాలా? వద్దా? అని ఆలోచిస్తుంటుంది. చెబితే బాధపడతారు.. ఈ రుద్రాణి బాధలు, అప్పు తీర్చి వేరే ఊరికి వెళ్లాక చెబుదాం.. ఒకే ఊర్లో ఉండి కూడా చూడలేకపోయాను అని బాధపడితే ఎలా అని కార్తీక్ గురించి దీప ఆలోచిస్తుంటుంది. అచ్చం ఇలానే దీప గురించి కార్తీక్ ఆలోచిస్తుంటాడు. అమ్మానాన్నలను చూసిన విషయాన్ని దీపకు చెప్పాలా? వద్దా? అని కార్తీక్ ఆలోచిస్తుంటాడు.

    ఇక మోనిత చేష్టలకు విన్ని షాక్ అవుతుంది. బొమ్మలో బాబును చూసుకుంటూ ఉంటుంది. ఈ బొమ్మలో ఇంకెన్ని రోజులు చూసుకుంటారు మేడం.. తీసేద్దామని విని అంటుంది. దీంతో మోనిత ఫైర్ అవుతుంది. నా మీద జాలి పడుతున్నావా?.. నేనేమీ బాధపడటం లేదు అని విన్నికి మోనిత చెబుతుంది. ఈ మేడం ఏంటో అర్థం కావడం లేదు అని విన్ని అనుకుంటుంది.

    ఇంట్లో కార్తీక్ వంట గ్యాస్‌ను బిగిస్తుంటాడు. అమ్మానాన్న మన కోసం చాలా కష్టపడుతున్నారు కదా? అని పిల్లలు అనుకుంటారు. అందుకే వారిని ఇకపై ప్రశ్నలతో విసిగించొద్దని అనుకుంటారు హిమ, శౌర్య. కళ్ల ముందే అమ్మానాన్నలున్నా కూడా అడగలేని హేయమైన పరిస్థితి వచ్చింది.. ఎంతో మందికి వైద్యం చేసిన నేను వాళ్లకి చేయలేకపోయాను.. ఇన్ని హాస్పిటల్స్ ఉండగా.. వాళ్లు తాడి కొండకు రావాల్సిన అవసరం ఏంటి?.. అని కార్తీక్ తన మనసులో తాను అనుకుంటాడు.

    బయటకు వెళ్దామన్నావ్ కదా? నాన్న వెళ్దామా? అని హిమ అంటుంది.. ఇప్పుడు వద్దమ్మా తరువాత వెళ్దాం.. అని కార్తీక్ అంటాడు. ఇక్కడకు వచ్చాక నువ్ మాతొ ఉండటం లేదు.. కబుర్లు చెప్పడం లేదు.. అని హిమ అంటుంది. నా మనసేం బాగాలేదు.. గ్యాస్ సిలిండర్ బిగించాను.. అమ్మ రాగానే వంట చేయమనండి.. అని చెప్పి వెళ్తాడు. అమ్మ దగ్గరకు వెళ్లి డబ్బు తెచ్చి రుద్రాణికి ఇచ్చి.. ఈ ఊరు వదిలి వెళ్లిపోదామని కార్తీక్ అనుకుంటాడు. అలా మొత్తానికి ఎపిసోడ్ అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో ప్రకృతి వైద్య శాలలోకి కార్తీక్ ఎంటర్ అవుతాడు. అయితే తరువాత ఏం జరుగుతుందన్నది చూడాలి.

    Leave a Reply