• January 13, 2022

Karthika Deepam నేటి ఎపిసోడ్.. వంటలక్క లాజిక్‌కు రుద్రాణి షాక్.. మోనిత కోసం వేలుని కట్ చేసుకున్న కార్తీక్!

Karthika Deepam నేటి ఎపిసోడ్.. వంటలక్క లాజిక్‌కు రుద్రాణి షాక్.. మోనిత కోసం వేలుని కట్ చేసుకున్న కార్తీక్!

    కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే గురువారం నాడు అంటే జనవరి 13న తేదీన ప్రసారం కానున్న Karthika Deepam Episode 1248 ధారావాహికలో అదిరిపోయే సీన్లు పడ్డాయి. మోనితను ఎక్కడ చూడాల్సి వస్తుందోనని కార్తీక్ తన వేలుని కట్ చేసుకుంటాడు. మరో వైపు తన పిల్లల మీద కన్నేసిందని తెలుసుకున్న దీప.. రుద్రాణికి సరైన రీతిలో అర్థమయ్యేలా గుణపాఠం చెప్పింది. మొత్తానికి కార్తీక దీపం నేటి ఎపిసోడ్ ఎలా సాగిందంటే..

    హోటల్‌లో ఉన్న మోనితను కార్తీక్ చూస్తాడు. మోనిత ఇటే వస్తోందేంటి? నన్ను చూసిందా? అని కార్తీక్ కంగారు పడతాడు. తీరా మోనిత వచ్చింది వాష్ బెసిన్ కోసమని తెలుస్తుంది. ఇంతలో అప్పిగాడు వచ్చి.. వాష్ బెసిన్ కోసం మీరు లేవాలా? మేడం.. నేనే మీ దగ్గరికి తీసుకొస్తాను.. అని అంటాడు. వాటర్ తీసుకొస్తాడు. ఐ అప్పి.. అప్పు.. మీరేం చేస్తారు మేడం అని అడుగుతాడు.

    డాక్టర్ అని చెబుతుంది మోనిత.. మీరు డాక్టర్ అయి ఉంటే మీ సార్ కూడా డాక్టర్ అయి ఉంటారు.. కదా? అని అప్పిగాడు అంటాడు. కరెక్ట్ చెప్పావ్.. చాలా ఫేమస్ గుండె జబ్బుల డాక్టర్.. ఎలాంటి జబ్బు అయినా నయం చేస్తారు.. అని మోనిత చెప్పుకుంటూ వెళ్తుంది. అరేయ్ జూనియర్ త్వరగా తీసుకుని రారా అని ఎగ్ బిర్యానీ ఆర్డర్ గురించి కార్తీక్‌ను పిలుస్తుంటాడు..

    ఇక మోనిత ఇక్కడు వచ్చిందేంటి.. ఈ ఊరి వదిలి వెళ్లాలా? వెళ్తే రుద్రాణి అప్పు ఎలా? విజయ నగరంలో ఉంటేనే వదల్లేదు.. ఎలా తప్పించుకోవాలి.. రుద్రాణి నుంచి ఎలా తప్పించుకోవాలి.. ఊరుకుంటుందా? దీప పిండి వంటలు.. రుద్రాణి సంగతేంటి?.. అని పరివిధాలుగా కార్తీక్ తలుచుకుంటూ ఉంటాడు. మేడం అని అప్పిగాడు విసిగిస్తుంటాడు. సినిమా యాక్టర్ అవ్వాలనే కోరిక నాకు ఎక్కువ మేడం.. ఎవరైనా తెలిసిన వాళ్లుంటే చెప్పండి అని అప్పిగాడు అడుగుతాడు.. నాకు ఓపిక తక్కువ..కోపం ఎక్కువ.. వెళ్లి చెప్పింది చెయ్ రా బాబు.. అని అంటుంది. మేడం అనే పిలుపు మార్చి అక్కా అని పిలుస్తాడు. అరుస్తున్నా కదా? నీకు వినిపించడం లేదా?..అని కార్తీక్ మీద కేకలు వేస్తాడు అప్పిగాడు.

    ఇక మోనితను చూడాల్సి వస్తుందేమో.. ఎలా తప్పించుకోవాలో తెలీక.. వేలిని కట్ చేసుకుంటాడు కార్తీక్. రక్తం రావడం చూసి అప్పిగాడు.. అరెరె కొత్త పని కదా?.. నీకు కోసుకుపోయింది.. అవతలా డాక్టర్ వచ్చింది.. రా చూపిద్దాం.. మనకు బాగా క్లోజ్ అయింది.. అని అంటాడు. ఎందుకు వచ్చిందట.. అని కార్తీక్ ఆరా తీస్తాడు. అది అడిగితేనే.. ఏరా అని అంటుందని అప్పిగాడు చెబుతాడు.

    ఇక అక్కడ సీన్ కట్ చేస్తే దీప మీద సీన్ ఓపెన్ అవుతుంది. ఇంటి పక్కన ఉండే మహాలక్ష్మీ వస్తుంది. పంచదార అడుగుతుంది..వీడు భలే ముద్దుగా ఉంటాడు కదా? అని అంటుంది.. గ్లాస్ పంచదార ఇవ్వవా? సరుకులు తెచ్చుకున్నాక ఇస్తాను అని అంటుంది. మిమ్మల్ని చూస్తే బాగా చదువుకున్నవాళ్లలా ఉన్నారు.. పిల్లలను స్కూల్‌కు పంపించొద్దు.. రోజులు బాగా లేవు అని అంటుంది. అదేంటి అందరి పిల్లలు వెళ్తున్నారు కదా? మా పిల్లలకే ఏం అవుతుంది? అని దీప అంటుంది.

    సరే నేను వెళ్లొస్తా జాగ్రత్త.. అని వెళ్లిపోబోతోంది. నీ మనసులో ఏదో ఉంది.. అని మహాలక్ష్మీని దీప అడుగుతుంది. నువ్ మంచిదానివని చెబుతున్నాను.. రుద్రాణి నీ పిల్లల మీద కన్నేసింది.. రుద్రాణిది వచ్చే నెల బర్త్ డే.. జాకెట్లు, గౌన్లు కుట్టమని ఇచ్చింది.. ఆ గౌన్లు మీ ఇద్దరి పిల్లల కొలతలు.. అని చెబుతుంది. నా పిల్లల బట్టల కొలతలు ఆమెకు ఎలా తెలిసింది. బట్టలు ఆరేసినప్పుడు వాళ్ల మనిషి ఎత్తుకెళ్లాడట.. నీ చుట్టూ పెద్ద కుట్ర జరుగుతోందని నా అనుమానం.. అని దీపకు చెప్పి మహాలక్ష్మీ వెళ్తుంది.

    ఇక దీప ఆలోచిస్తూ ఉండగా.. మీది నుంచి ఓ ట్రంకు పెట్టె పడుతుంది. కోటేశ్ అప్పు లెక్కలు ఓ బుక్కులో రాసి ఉంటాయి. అంతే కాకుండా మోనిత బిడ్డను ఎత్తుకొచ్చిన కారు నెంబర్ రాసి ఉంటుంది. నన్ను క్షమించండి అమ్మా అని రాసి ఉంటుంది. అది చూసిన దీపకు అనుమానం వస్తుంది.. ఈ బండి నంబర్ ఎక్కడో చూసినట్టుంది.. ఎందుకు క్షమించమని అడుగుతున్నాడు.. అని దీప అనుకుంటుంది.

    ఇక భోజనం చేసిన మోనిత వెళ్లేందుకు సిద్దపడుతుంది. అక్కా ఒక సెల్ఫీ అని అడుగుతాడు. అప్పుడప్పుడు రండి అక్కా అని అడుగుతాడు. అప్పుడప్పుడు రావడానికి ఇదేం టూరిస్ట్ ప్లేసా? ఇప్పుడు రావడమే దండగా అని మోనిత వెళ్తుంది. ఇక సౌందర్య, ఆనంద్ రావులు ప్రకృతి వైద్యశాలలో ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు.

    పెద్దోడు త్వరలోనే కనిపిస్తారని అనిపిస్తోందండి అని సౌందర్య అంటుంది.. ఏమో సౌందర్య.. రోజురోజుకూ ఆశలు చచ్చిపోతోన్నాయి.. వాడు ఎలా ఉన్నాడో కానీ వాడు లేడన్న ఆలోచనే భారాన్ని పెంచుతోంది అని ఆనంద్ రావు అంటాడు.. ఎక్కువగా ఆలోచించి పాడు చేసుకోకండి.. మనసును తేలిక చేసుకోండి. వాడిని వదిలి మనం ఉండనట్టే.. మనల్ని వదిలి వాడు ఉండలేడు అని సౌందర్య అంటుంది..

    ఇక్కడ మీకు సౌకర్యంగానే ఉందా? అని వైద్యశాలలో పని చేసే వ్యక్తి పాలు తీసుకొస్తాడు. ఇక్కడికి సౌకర్యాల కోసం రాలేదు.. ప్రశాంతత కోసం వచ్చాం.. అని చెబుతుంది. మీతోపాటు ఇంకొకరు వచ్చారు కదా? ఎక్కడా కనిపించలేదు..అని మోనిత గురించి అడుగుతాడు. మాతో పాటు ఎవ్వరూ రాలేదు అని సౌందర్య అంటుంది. ఒకరు వచ్చారు.. ఎర్ర కారు నేను చూశాను.. అని అంటాడు. మేం వచ్చాం ఎవ్వరూ రాలేదని చెబుతుంది సౌందర్య. నేను అయితే చూశాను.. అని చెప్పి వెళ్తాడు. ఎవరు వచ్చి ఉంటారండి.. మోనిత వచ్చి ఉంటుందా? అని సౌందర్య పసిగడుతుంది. వస్తే.. మనల్ని ఏదో ఒక మాట అనకుండా ఉంటుందా? మోనిత అయి ఉండదులే.. అని ఆనంద్ రావు అంటాడు. ఇక్కడకు వచ్చి కూడా తన గురించి ఎందుకు ఆలోచించడం.. మీరు ప్రశాంతంగా ఉండండి.. అని సౌందర్య చెబుతుంది.

    రేపు రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు వెళ్లాలి.. త్వరగా రా.. అని అబ్బులుకు రుద్రాణి చెబుతుంది. ఇంటి ఆవిడ అని ఏదో చెప్పబోతాడు అబ్బులు.. పెళ్లాలే లోకమా? మీకు అని రుద్రాణి అరిచేస్తుంది. ఇంటావడకు మందులు అయిపోయాయ్.. ప్రకృతి వైద్య శాలకు వెళ్లి తీసుకొస్తాను.. అని అబ్బులంటే.. వెళ్తూ వెళ్తూ దారిలో తీసుకోవచ్చు అని రుద్రాణి అంటుంది..

    ఇక తన ఇంట్లో వంటగదిలో వంట చేస్తున్న దీపను చూసి రుద్రాణి షాక్ అవుతుంది. రేయ్ అబ్బులు.. ఏంట్రా ఇది.. నేనేం చూస్తున్నాను..అని రుద్రాణి అరిచేస్తుంది. దీంతో అబ్బులు మళ్లీ లోపలకు వెళ్తాడు. అంతా కులాసేనా? ఊళ్లో పెత్తనాలన్నీ బాగా చేసి వచ్చారా? ఊళ్లో వాళ్ల వడ్డీ సొమ్ములు బాగానే వసూళ్ అవుతున్నాయా? అని దీప అడిగేసింది.

    నువ్వెంటి మా ఇంట్లో వంటగదిలో అని రుద్రాణి అడుగుతుంది.. మా ఇంట్లో గ్యాస్ అయిపోయిందని వంట చేసుకుని వెళ్దామని బియ్యం, కూరగాయలు తెచ్చుకున్నాను.. అని అంటుంది దీప. మీ ఇంట్లో గ్యాస్ అయిపోతే.. మా ఇంట్లోకి వచ్చి చేస్తావా? అని రుద్రాణి అరిచేస్తుంది. ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం చేసుకోలేమా? రుద్రాణి గారు.. ఈ ఊర్లో అందరికీ బంధువు.. అందరికీ కావాల్సిన వాళ్లు.. అని దీప సెటైర్ వేస్తుంది. ఏమనుకుంటున్నావ్.. నువ్వెంటి? నా వంట గదిలోకి దూరడమేంటి? అని రుద్రాణి అంటుంది. ఇప్పుడు కరెక్ట్ పాయింట్‌కు వచ్చావరు.. వంట గదిని వాడుకుంటేనే ఇంత కోపం వస్తే.. నా ప్రాణానికి ప్రాణమైన పిల్లల మీద కన్నేస్తే నాకు ఎంత కోపం రావాలి.. నా పిల్లల జోలికి రాకండి.. అని స్వీట్ వార్నింగ్ ఇస్తుంది. అలా ఎపిసోడ్ ముగుస్తుంది.

    ఇక రేపటి ఎపిసోడ్‌లో పిల్లలు వేసిన ప్రశ్నలకు డాక్టర్ బాబు కుమిలిపోతాడు. మేం కనిపించకపోతే నువ్ టెన్షన్ పడతావ్ కదా? అలానే నానమ్మ తాతయ్య కూడా నీ గురించి టెన్షన్ పడతారు కదా? పెద్దోడా అని పిలుస్తుంటుంది కదా? అని పిల్లలు అడుగుతారు. నేనేం సాధించాను.. నేను చేసిన తప్పులకు మీ అందరూ అనుభవిస్తున్నారు..అని కార్తీక్ బాధపడుతుంటాడు.

    Leave a Reply