• January 11, 2022

నేను ఎవరికీ కమిట్మెంట్ ఇవ్వను : గృహలక్ష్మీ లాస్య

నేను ఎవరికీ కమిట్మెంట్ ఇవ్వను : గృహలక్ష్మీ లాస్య

    Anchor Prashanthi గృహలక్ష్మీ సీరియల్‌తో యాంకర్ ప్రశాంతి ఫుల్ ఫేమస్ అయింది. లాస్య పాత్రలో ప్రశాంతి జీవించేస్తోంది. ఇంతకు ముందు ప్రశాంతికి యాంకర్‌గా ఓ మోస్తరు గుర్తింపు ఉండేది. కానీ లాస్యగా అందరి మనసులో విలన్ పాత్రకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ప్రతీ ఒక్కరూ లాస్యను ఆడిపోసుకుంటూ ఉంటారు.. తిడుతూ ఉంటారు.. అంటే అక్కడే లాస్య ఎంత సక్సెస్ అయిందో తెలుస్తోంది.

    అయితే లాస్య తన అభిమానులను అకస్మాత్తుగా పలకరిస్తుంటుంది. చెప్పుకుండా లైవ్‌లోకి వస్తుంది. అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. అయితే లాస్య పాత్ర, తులసి, నందుల పాత్రల గురించే ఎక్కువ ప్రశ్నలు ఎదురవుతుంటాయి. అయితే ఇవన్నీ వృత్తి పరమైన విషయాలే. ప్రశాంతి పెళ్లి విషయంలో నెటిజన్లకు చాలా అనుమానాలు వస్తుంటాయి.

    ఆమె లైవ్‌లోకి వచ్చిన ప్రతీసారి పెళ్లికి సంబంధించిన ప్రశ్నలే ఎదురవుతుంటాయి. పెళ్లి అయిందా? పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? సింగిలేనా? ప్రేమలో ఉన్నారా? అంటూ నెటిజన్లు ప్రశ్నలు వేస్తుంటారు. దానికి లాస్య తాజాగా కొత్త సమాధానాన్ని ఇచ్చింది. నాకు ఇంత వరకు ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు. ఈ మధ్యే రీల్ లైఫ్‌లో నందుతో పెళ్లి జరిగింది.

    కానీ రియల్ లైఫ్‌లోఇంకా పెళ్లి కాలేదు. నేను ఎవ్వరికీ కమిట్మెంట్లు ఇవ్వను. మూడు నెలల్లో పెళ్లి చేసుకుంటాను. ఆరు నెలల్లోపెళ్లి చేసుకుంటాను అని ఎవ్వరికీ మాటివ్వను. అయితే ఈ ఏడాది కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. నేను ఇంకా సింగిలే. ఈ ఏడాది పెళ్లి అవుతుందో లేదో చూడాలి అంటూ ప్రశాంతి అందరికీ తన పర్సనల్ విషయాలను చెప్పేసింది.

    Leave a Reply