• January 11, 2022

దేవుడున్నాడని అప్పుడే అనిపించింది.. రాజశేఖర్-శివలింగం సంఘటనపై జీవిత కామెంట్స్

దేవుడున్నాడని అప్పుడే అనిపించింది.. రాజశేఖర్-శివలింగం సంఘటనపై జీవిత కామెంట్స్

    Jeevitha-Raja sekhar జీవిత, రాజశేఖర్ బంధం గురించి అందరికీ తెలిసిందే. రాజశేఖర్ వెన్నంటే ఉంటూ జీవిత తన సంసారాన్ని ముందుకు తీసుకొస్తోంది. ఇక ఇప్పుడు శేఖర్ అంటూ రాజ శేఖర్‌ను కొత్త అవతారంలో చూపించబోతోంది జీవిత. ఈ క్రమంలోనే ఈ ఇద్దరూ ఆలీతో సరదాగా షోకి వచ్చారు. ఇందులో భాగంగా జీవిత మాట్లాడుతూ ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చారు.

    రాజశేఖర్ మెడలో ఓ శివలింగం ఉంటుందని, అది ఎప్పుడూ కూడా ఆయన వద్దకే వచ్చి చేరుతుందని, ఎన్ని సార్లు మిస్ అయినా కూడా తిరిగి తిరిగి తన వద్దకే వస్తుందని చెప్పుకొచ్చారు. అలా జరగడంతో ఏదో శక్తి ఉందని, దేవుడున్నాడని నమ్మకం ఎక్కువగా పెరిగిందని జీవిత చెప్పుకొచ్చారు. ఓ సారి దొంగతనం జరిగినా కూడా ఆ దొంగే తీసుకొచ్చాడని తెలిపారు.

    ఓ సారి షూటింగ్‌లో, ఇంకోసారి పార్కులో శివ లింగం మిస్ అయిందని చెప్పుకొచ్చారు. ఓ సారి పార్కులో వాకింగ్‌కు వెళ్లారు. ఇంటికి వచ్చి చూస్తే.. గొలుసు ఉంది కానీ దానికి శివలింగం లేదు. అది అసలే చాలా చిన్నగా ఉంటుంది. ఎక్కడో పోయింది.. దొరకదులే అని అనుకున్నాం. కానీ పార్క్ సెక్యూరిటీకి ఫోన్ చేసి రాజశేఖర్ రిక్వెస్ట్ చేశారు. అది చాలా సెంటిమెంట్.. దొరికితే ఇవ్వమని అన్నార. తెల్లారే ఫోన్ చేశాడు. దొరికిందని అన్నాడు. నేను షాక్ అయ్యాను. అంత పెద్ద పార్కులో ఇంత చిన్నది ఎలా దొరికిందా? అని అనుకున్నాను.

    ఇంకోసారి షూటింగ్‌లో ఎవరో దొంగతనం చేశారు. అప్పుడు గొలుసుతో సహా పోయింది. కానీ రాజశేఖర్ గారికి ఓ వ్యక్తి మీద అనుమానం వచ్చింది. వాడు మా దగ్గర పని చేస్తాడు. కానీ తీసింది వాడేనని నాకు తెలీదు. కానీ రాజశేఖర్ పసి గట్టారు. ఎవడు కొట్టేశాడు తెలియాలి..పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. నువ్వెలి వెతుకు అని ఆ దొంగకే రాజశేఖర్ చెప్పాడు.

    వాడెందకు తీస్తాడు.. అని నేను అంటే.. వాడే తీసుకొచ్చిస్తాడు చూడు అని రాజశేఖర్ అన్నారు. ఆయన చెప్పినట్టుగానే వాడు తీసుకొచ్చిచ్చాడు. అలా ఆ శివలింగానికి ఆయనకు చాలా అనుబంధం ఉంది. ఆయన శివ భక్తుడు. అందుకే అమ్మాయిల పేర్లు కూడా శివ అనే ఉంటుంది అని జీవిత అసలు విషయం చెప్పుకొచ్చారు.

     

    Leave a Reply