- January 11, 2022
Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. రిషి ప్రేమ లేఖకు వసు ఫిదా.. చెంప పగలగొడతానన్న జగతి
గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే మంగళవారం నాటి Guppedantha Manasu Episode 344 ధారవాహికలో రిషి, గౌతమ్ తేలు కుట్టిన దొంగలా అయిపోయారు. రిషి రాసిన లవ్ లెటర్ జగతికి దొరుకుతుంది. ఇక జగతి తన ఆగ్రహావేశాలను చూపించింది. దీంతో గౌతమ్ మీద రిషి విరుచుకుపడ్డాడు. కానీ చివర్లో వసు మాత్రం అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చింది. అలా గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ ముందుకు సాగింది.
రిషి రాసిన ప్రేమ లేఖను చూసి గౌతమ్ గాల్లో తేలిపోతాడు. ఇది ప్రేమలేఖనా? కాదు కెవ్వు కేక అని సంబరపడిపోతాడు.ఇక నా లవ్ సక్సెస్ అని గౌతమ్ అంటే.. రిషి ఆశ్చర్యపోతాడు. అదే నాకే ఫస్ట్ ప్రైజ్ అని కవర్ చేస్తాడు గౌతమ్. ఏదో తోచింది రాశానురా అని రిషి చెబుతాడు. ఇక ఆ లెటర్‌లో ప్రియమైన వసుధార అని గౌతమ్ యాడ్ చేసుకుంటాడు.
ఎంతో ఉత్సాహంగా ఆ లెటర్‌ను ఇచ్చేందుకు గౌతమ్ వెళ్తుంటాడు. వెనక జేబులో పెట్టుకున్న ఆ లెటర్ కింద పడిపోతుంది. అది తెలియని గౌతమ్ రెచ్చిపోతాడు. వసు దగ్గరకు వెళ్తాడు ఓ సర్ ప్రైజ్ అని చెబుతాడు. మోకాళ్ల మీద కూర్చుంటాడు. ఇదంతా ఏంటన్నట్టుగా వసు ఆశ్చర్యపోతుంది. మోకాళ్ల మీద కూర్చున్న గౌతమ్.. వెనక జేబులోంచి దువ్వెన తీస్తాడు. దీంతో వసు ఆశ్చర్యపోతుంది. ఇదేంటి సర్ అని అంటుంది. అవును ఇదేంటి? అని జేబులన్నీ వెతుక్కుంటాడు. అలా ఎందుకు కూర్చున్నారు అని వసు అడుగుతుంది. ఏదో మోకాలి నొప్పి అని కవర్ చేస్తాడు.
ఈ తతంగాన్ని అంతా రిషి చూస్తుంటాడు. ఇక జగతి మేడం చేతిలో లెటర్ చూసి గౌతమ్ షాక్ అవుతాడు. ఇదేంటి మేడంకి దొరికిందా? అని వెళ్తాడు. అది ఏంటి మేడం అని వసు అడుగుతుంది. లవ్ లెటర్ అని చెబుతుంది. ఎవరు రాశారు మేడం అని అడుగుతుంది. రాసిన వాళ్లు పేరు, అడ్రస్ పెట్టరు కదా? అని అంటాడు. ఇక రిషి కూడా అక్కడి వస్తాడు. ఏంటి మేడం అని అడుగుతాడు. మన కాలేజ్ డిసిప్లేన్ అని జగతి సెటైర్ వేస్తుంది. దీంతో గౌతమ్ కంగారు పడతాడు. విధి వక్రించింది.. వీడు కూడా ఇప్పుడే రావాలా? అని గౌతమ్ అనుకుంటాడు.
అందులోని హ్యాండ్ రైటింగ్ రిషిది.. వాడు చెప్పలేడు.. సో నాకేం ప్రాబ్లం లేదన్నమాట అని గౌతమ్ హ్యాపీగా ఫీలవుతాడు. ఇక జగతి ఆ లెటర్‌ను చదువుతుంది. అందులో ప్రియమైన వసుధారకి అనే లైన్ యాడ్ చేసుకోవడంపై రిషి షాక్ అవుతాడు. అది నేను రాయలేదు కదరా అని రిషి లోలోపల అనుకుంటాడు. నువ్ యాడ్ చేసుకున్నావారా? అని గౌతమ్ వైపు కోపంగా చూస్తాడు.
నువ్ మామూలుగానే ఉంటావ్.. కానీ అందులో ప్రత్యేకత ఉంటుంది.. అందరిలానే నవ్వుతావ్ కానీ చలికాలంలో సూర్యుడి కిరణాలు తాకినట్టు చల్లగా ఉంటాయ్.. ఇదంతా ప్రేమే అయితే నిన్ను ప్రేమిస్తున్నట్టే కదా?.అని ఇలా లవ్ లెటర్ ముందుకు సాగుతుంది. దీనిపై జగతి ఫైర్ అవుతుంది. వాడేవడో నాకు దొరకాలి చెంప పగలగొడతాను అని జగతి ఆవేశ పడుతుంది. ఆ ఘటనను గౌతమ్ ఊహించుకుంటాడు. తనను జగతి కొట్టినట్టుగా ఊహించుకుని భయపడతాడు.వద్దు వద్దని అంటాడు. ఏంటి వద్దు అని జగతి అడుగుతుంది. ఏం లేదు మేడం అని కవర్ చేస్తాడు గౌతమ్.
దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోండి.. ప్రేమ అట.. ఇడియట్ రాస్కేల్ అని తిడుతూ ఆ లెటర్‌ను ముక్కలు ముక్కలు చేస్తుంది జగతి. సారు మీరు చాలా సీరియస్‌గా తీసుకోవాలి..అని జగతి అంటే.. రాసిందే వాడు.. వాడిని వాడే పట్టుకుంటాడా? అని గౌతమ్ లోలోపల నవ్వుకుంటాడు. కచ్చితంగా పట్టుకోండి సర్ అని చెప్పి జగతి, వసులు వెళ్లిపోతారు. ఆ లెటర్ ముక్కలను రిషి ఏరుకుంటాడు.
ఏం జరిగింది? అని జగతి, వసులను మహేంద్ర అడుగుతాడు. కానీ ఏం చెప్పకుండా వెళ్తారు. రిషి ఏం జరిగింది? అని మహేంద్ర అడుగుతాడు. ఏం జరగలేదు డాడ్ అని రిషి కవర్ చేస్తుంటే గౌతమ్ ఎంట్రీ ఇస్తాడు. ఏం జరగలేదని అంటావేంట్రా? అని గౌతమ్ చెప్పబోతోంటే.. ఇవన్నీ డాడ్‌కి అవసరమా?. అని రిషి అంటాడు. ఏం లేదు డాడ్.. వాడేదో పిచ్చి మాటలు.. పదరా..అని గౌతమ్‌ని పక్కకు తీసుకెళ్తాడు రిషి.
రేయ్ నీకు అసలు బుద్ది ఉందా? కాంపిటేషన్‌కి అని రాయించావ్ కదా? మాట్లాడకు.. నీకు అసలు బుర్ర పని చేస్తోందా.. ఏంట్రా ఈ వంక బుద్దులు.. కాస్త అయితే ఘోరం జరిగేది.. కాలేజ్‌లో ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకునేది లేదు.. నువ్ చేసింది కరెక్ట్ కాదురా.. నాకు చాలా కోపం వస్తోంది.. అనవసరంగా నన్ను ఇరికించావ్ కదరా.. కాంపిటేషన్ అబద్దమా? అని రిషి అడుగుతాడు. అంటే అది అని గౌతమ్ నీళ్లు తడుముకుంటాడు.. ఏమైనా అందామంటే చిన్నప్పటి ఫ్రెండ్‌వి అయిపోయావ్.. పోరా..అని గౌతమ్‌ని చీదరించుకుంటాడు రిషి. ఏంట్రా నువ్వొద్దంటే.. క్లాస్ ఇస్తే.. ఆగిపోతానా. ప్రేమ ఎవ్వరికీ భయపడదురా.. అని గౌతమ్ తనలో తాను అనుకుంటాడు.
రెస్టారెంట్ వద్ద వసుని జగతి డ్రాప్ చేస్తుంది. లోపలకు వచ్చి కాఫీ తాగండ మేడం అని వసు అంటుంది. ఇలా వచ్చిన ప్రతీ సారి కాఫీ తాగాలని లేదు కదా?.. లవ్ లెటర్ విషయంలో నేను ఏమైనా ఎక్కువ రియాక్ట్ అయ్యానా? అని జగతి వసుని అడుగుతుంది. సముద్రానికి తన హద్దులు తెలుసు.. అలలు వస్తాయ్.. కొన్నిసార్లు మాత్రమే ఉప్పొంగుతాయ్.. మీరు సముద్రం వంటి వారు. మీకు హద్దులు చెప్పడం కరెక్ట్ కాదు.. అని వసు అంటుంది. ఇక జగతి వెళ్తుంది. మీరేం చేసినా నా మంచికే చేస్తారు నాకు తెలుసు.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. మీరేంటో నాకు తెలుసు కదా? అని మనసులో వసు అనుకుంటుంది.
జగతి మాటలు తలుచుకున్న రిషి.. ఈ రకంగానైనా వసుకి ప్రేమ మీదున్న అభిప్రాయం తెలుస్తుందని అనుకుంటే.. జగతి మేడం మధ్యలోకి వచ్చి అంతా డిస్టర్బ్ చేసింది.. అని అనుకుంటాడు. ఇంతలో వసు నుంచి మీతో మాట్లాడాలి సర్.. అనే మెసెజ్ వస్తుంది. ఏం మాట్లాడుతుంది.. ప్రేమ లేఖ గురించి మాట్లాడుతుందా?.డౌట్ వచ్చిందా? వచ్చి ఉండదులే.. అని రిషి తనలో తాను అనుకుంటాడు. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో అసలు విషయం తెలుస్తుంది. ఆ లెటర్ ఎవరు రాశారు సర్.. బాగా రాశారు సర్.. నా జీవితాన్ని దగ్గరి నుంచి చూసిన వ్యక్తే రాసి ఉండాలి.. అతడిని ఒకసారి చూడాలని ఉంది సర్.. అని వసు అంటుంది. దీంతో రిషి ఫుల్ ఖుషీ అవుతాడు. నవ్వాలే ఏడ్వాలో తెలియని పరిస్థితి అంటే ఇదేనమో అని రిషి అనుకుంటాడు.
- Tags
- Guppedantha Manasu Daily serial Episode
- Guppedantha Manasu Episode 344
- Guppedantha Manasu New Episode
- Guppedantha Manasu serial today Episode 344
- guppedantha manasu serial yesterday episode
- Guppedantha Manasu Today Episode
- Guppedantha Manasu today Episode 344
- గుప్పెడంత మనసు
- గుప్పెడంత మనసు ఈ రోజు సీరియల్
- గుప్పెడంత మనసు ఈరోజు ఎపిసోడ్
- గుప్పెడంత మనసు ఈరోజు సీరియల్
- గుప్పెడంత మనసు టుడే ఎపిసోడ్
- గుప్పెడంత మనసు డైలీ సీరియల్
- గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్
- గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ కావాలి
- గుప్పెడంత మనసు సీరియల్ టుడే ఎపిసోడ్
- జగతి
- మహేంద్ర
- రిషి
- వసు
- వసుధార