• January 7, 2022

Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. అంతా ఒకే గూటికి.. వసు విషయంలో రిషి కంగారు

Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. అంతా ఒకే గూటికి.. వసు విషయంలో రిషి కంగారు

    గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే శుక్రవారం నాటి Guppedantha Manasu Episode 341 ధారావాహికలో ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి. ఇందులో గౌతమ్‌కు రిషి స్వీట్ వార్నింగ్ ఇస్తాడు. వసు జోలికి వెళ్లొద్దని నేరుగా చెప్పేస్తాడు రిషి. లిమిట్స్ క్రాస్ చేయోద్దని అంటాడు. ఇక మరో వైపు బయటకు వెళ్దామని జగతి ఎంతో ఉత్సాహంగా వసుతో చెబుతుంది. రిషి, మహేంద్ర, గౌతమ్ ఒకరికి తెలియకుండా ఒకరు అంతా కూడా జగతి ఇంటికి చేరుకుంటారు. అలా మొత్తానికి సీరియల్ అంతా కూడా సరదాగా గడిచిపోయింది.

    రోమియో జూలియట్ అంటూ వసుకి ఏదేదో పిచ్చిగా గౌతమ్ చెబుతుంటాడు. వసు నువ్వెళ్లు అని రిషి అంటాడు. దీంతో వసు వెళ్లిపోతుంది. ఎందుకురా అలా చేశావ్ అని రిషిని గౌతమ్ నిలదీస్తాడు. ఇది కరెక్ట్ కాదు.. నాకుఎందుకు అడ్డు పడుతున్నావ్.. అని గౌతమ్ అంటాడు. నువ్వెళ్లే దారి కరెక్ట్ కాదు.. అని రిషి అంటే.. అది నువ్వెలా డిసైడ్ చేస్తావ్ రా.. అని గౌతమ్ అంటాడు.

    నీ ఫ్రెండ్‌ని రా అని రిషి అంటే.. నువ్ మాత్రం ఫ్రెండ్‌వి కాదురా.. విలన్‌లా తయారవుతున్నావ్.. అని గౌతమ్ అరిచేస్తాడు. వసు బ్రిల్లియంట్ స్టూడెంట్.. యూనివర్సీటి టాపర్‌రా నా స్టూడెంట్ కోసం ఆలోచిస్తాను.. అలానే నువ్ నా ఫ్రెండ్‌విరా నీకోసం కూడా ఆలోచిస్తాను.. అని రిషి అంటాడు. ఆలోచించు కానీ అడ్డుపడకురా అని గౌతమ్ అంటాడు. వసుతో కొంచెం చనువు పెంచుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాను అని గౌతమ్ అంటే.. అందుకే ఆపుతున్నాను అని రిషి అంటాడు

    నువ్వేమైనా.. అని గౌతమ్ అని అనుమానిస్తాడు. చచ అలాంటిదేమీ లేదు.. నువ్వెళ్లే దారి మంచిది కాదు.. ఫ్రెండ్‌వి కాబట్టి పద్దతిగా చెబుతున్నాను.. లిమిట్స్ క్రాస్ అయితే నేను కూడా లిమిట్స్ క్రాస్ అవుతాను..ఇంకేట్రా సంగతులు.. కాఫీ అంటే ఇష్టం కదా?. మానేస్తా.. ఏడ్చావ్ లే.. పదరా.. లేరా.. అంటూ మళ్లీ గౌతమ్‌ని కూల్ చేసేస్తాడు రిషి. దీంతో ఇద్దరూ కలిసి వెళ్లిపోతారు.

    రిషి, గౌతమ్ చెప్పిన మాటలను తలుచుకుంటూ నిజంగా ప్రేమ ఇంత గొప్పదా? అని వసు ఆలోచనలో పడుతుంది. ఇంతలో జగతి వచ్చి.. అలా బయటకు వెళ్దామా? కారులో వెళ్లేసి వద్దామని అంటుంది. ఎందుకు మేడం మనసు బాగా లేదా? అని వసు ప్రశ్నిస్తుంది. మనసు బాగున్నా, బాగా లేకపోయినా అలా వెళ్లి రావొచ్చు అని అంటుంది. మహేంద్ర సర్‌ని కూడా పిలుద్దాం.. కబుర్లు చెబుతారు అని అంటుంది. మహేంద్రను పిలవాలంటే నేను పిలవలేనా? దానికి నీ పర్మిషన్ కావాలా? అని జగతి అంటుంది.

    మీరు వద్దన్నంత మాత్రానా నేను వదిలేస్తానా? నేను పిలుస్తాను అని మహేంద్రకు వసు కాల్ చేస్తుంది. విషయం చెప్పడంతోనే మహేంద్ర ఫుల్ జోష్‌లో బయల్దేరుతాడు. అది రిషి చూస్తాడు. మాటల్లో ఆనందం, మొహంలో హుషారు.. నడకలో వేగం.. డాడ్ ఎక్కడికో వెళ్తున్నారు.. అడగడం బాగుండది లేండి.. ఆనందంలో కారు సీటు బెల్టు పెట్టుకోవడం మర్చిపోకండి.. అని రిషి అంటాడు..

    వదిన నేను బయటకు వెళ్దామని అనుకుంటున్నాను.. ఎక్కడికని అనుకుంటున్నారు.. వసుధార దగ్గరకు.. చూశారా? మీరే షాక్ అయ్యారు.. రిషికి చెప్పకండి.. ఫైర్ అవుతాడు అని గౌతమ్ అంటాడు. వదిన ఆల్ ది బెస్ట్ చెప్పండి అని గౌతమ్ అంటాడు. ఇక మహేంద్ర దగ్గరకు వెళ్లి లిఫ్ట్ అడుగుతాడు. ఎక్కడికి వెళ్లాలని మహేంద్ర అడుగుతాడు. కొన్ని పనులు చెబితే జరగవు అని అంటారు కదా? అంకుల్ అని అంటాడు.

    నాకు బెస్ట్ ఆఫ్ లక్.. చెప్పరా అంకుల్ అని గౌతమ్ అంటే.. చేసే పనులను బట్టి దీవెనలుంటాయి.. నువ్ ఏ పని చేస్తున్నావో తెలీదు కదా? అని మహేంద్ర అంటాడు. భలే ఇరికించారు అంకుల్ అని గౌతమ్ అంటాడు. నీ కోరికలో న్యాయం ఉంటే విజయం నీదే.. అని మహేంద్ర అంటాడు. చాలు అంకుల్.. ఈ మాత్రం ఎంకరేజ్మెంట్ ఉంటే చాలు.. అని గౌతమ్ ఖుషీ అవుతాడు.

    ఇక తండ్రీ కొడుకుల బంధం గురించి గౌతమ్ తీస్తాడు. వాడేమో ఎప్పుడూ సీరియస్‌గా ఉంటాడు.. వాడి ఆస్తేదో తీసుకున్నట్టు.. మీరేమో ఇంత సరదాగా ఉంటారు.. అని రిషి గురించి మహేంద్ర దగ్గర గౌతమ్ చెబుతాడు. యాపిల్ తియ్యగానే ఉండాలి.. నిమ్మకాయ పుల్లగానే ఉండాలి.. రిషి రిషిలానే ఉండాలి.. అదే బాగుంటుంది.. నాకు రిషి కొడుకు మాత్రమే కాదు హీరో అని రిషి గురించి మహేంద్ర ఎంతో గొప్పగా చెబుతాడు. ఎవ్వరిలో లేని క్వాలిటీస్ వాడిలోఉన్నాయంటూ పొంగిపోతాడు. ఇక వసుధార ఇంటికి అని చెప్పకుండా మధ్యలోనే దిగిపోతాడు గౌతమ్.

    ఎవరైనా ఇంటికి వచ్చారా?.. అని వసుకి టెన్షన్‌గా ఫోన్ చేస్తాడు రిషి. చదువుతున్నాను సర్ అని వసు చెప్పే లోపు రిషి కట్ చేస్తాడు. మొక్కలకు నీళ్లు పడుతున్న వసుని చూసి చదువుతున్నాను అని చెప్పావ్ అంటూ అడిగేస్తాడు రిషి. ఇప్పటి దాక చదువుతూనే ఉన్నాను సర్ అని అంటుంది. ఇంత ఫాస్ట్‌గా ఎలా వచ్చారు సర్ అని వసు అడిగితే.. షార్ట్ కట్‌లో స్పీడుగా వచ్చాను అని రిషి అంటాడు.. ఎందుకు సర్ అని వసు అంటే.. ఏ రావొద్దా? అని రిషి రివర్స్ కౌంటర్ వేస్తాడు..

    అలా అని నేను ఎందుకు అడుగుతాను.. సర్ అని వసు అంటుంది. వాటర్ కావాలి.. అని రిషి అడిగితే.. కాఫీ కావాలా? అని వసు అంటుంది. నేను వాటర్ అడిగాను.. అని మరోసారి రిషి కౌంటర్ వేస్తాడు. రిషి టెన్షన్‌లో ఉన్నట్టున్నాడు.. ఎక్కువ ప్రశ్నలు వేయకు.. అని వసుకి జగతి చెబుతుంది. ఏంటి సర్ ఏమైనా ప్రాబ్లమా?..అని వసు అడిగితే.. కొందరు మనుషుల వల్ల ప్రాబ్లం.. అని అంటాడు.

    పద వెళ్దాం అని రిషి అటు తిరిగే లోపు కిందపడిపోతోబోతాడు. ఇంతలో వసు పట్టుకుంటుంది. ఎక్కడికో వెళ్దామన్నారు.. సర్ అని వసు అంటుంది. పదా.. అని రిషి కదిలేలోపు.. మహేంద్ర ఎంతోజాలీగా కారులోంచి దిగుతాడు. రిషిని చూసి షాక్ అవుతాడు. రిషి నువ్వెంటి ఇక్కడా.. నీకంటే ముందే బయల్దేరాను కదా?.అని అంటాడు. ఎవరు ముందు బయల్దేరారన్నది కాదు.. అని రిషి అంటాడు. మేడం నాకు వాటర్ఇస్తారా? అని మహేంద్ర అడిగేలోపు గౌతమ్ కూడా ఎంట్రీ ఇస్తాడు.

    వామ్మో మై గాడ్ అందరూ ఇక్కడే ఉన్నారేంటి? నేనేదో వసుతో ఒంటరిగా మాట్లాడుదామని అనుకుంటే ఇలా రిషికి బుక్కయ్యానేంటి?.. అని గౌతమ్ అనుకుంటూ వస్తాడు. మొత్తానికి అందరూ ఒకే గూటికి చేరుకున్నారు.అలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో మహేంద్ర, జగతిల రిలేషన్ మీద గౌతమ్ ప్రశ్నలు కురిపించేలా ఉన్నాడు. ఇక రిషి కోపం బాగుంటుందా? సహనం బాగుంటుందా? అని వసుని జగతి అడుగుతుంది. సహనం అని వసు అంటే.. కోపం అని జగతి అంటుంది. మిమ్మల్ని ఎవ్వరైనా సరే ఒక్క మాట అనాలంటే నన్ను దాటి వెళ్లాల్సిందే..అని తండ్రి మీదున్న ప్రేమను రిషి బయటపెడతాడు.

    Leave a Reply