• January 5, 2022

బాలీవుడ్‌ను వెనక్కి నెట్టేసిన టాలీవుడ్.. హిస్టరీలోనే ఫస్ట్ టైం

బాలీవుడ్‌ను వెనక్కి నెట్టేసిన టాలీవుడ్.. హిస్టరీలోనే ఫస్ట్ టైం

    కరోనా, లాక్డౌన్ వంటి వల్ల సినిమా పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ పడ్డట్టు అయింది. అయితే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తరువాత వచ్చిన కొద్ది గ్యాప్‌లో ఇతర ఏ ఇండస్ట్రీ కూడా కోలుకోలేకపోయింది. కానీ టాలీవుడ్ మాత్రం ఓ రేంజ్‌లో పుంజుకుంది. తెలుగు ప్రేక్షకులు కరోనాను కూడా లెక్కచేయలేదు. క్లిష్ట పరిస్థితుల్లో విడుదలైన సినిమాలను బ్లాక్ బస్టర్‌ హిట్ చేసేశారు.

    అలా సంక్రాంతి సీజన్లో వచ్చిన రవితేజ క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆ తరువాత వచ్చిన ఉప్పెన, జాతి రత్నాలు రికార్డులను క్రియేట్ చేశాయి. ఇక వకీల్ సాబ్ దెబ్బకు బాక్సాఫీస్ మోత మోగింది. అలా ఈ నాలుగు సినిమాలతో ప్రథమార్థం మొత్తం బాగానే నడిచినట్టు అనిపించింది. మళ్లీ లాక్డౌన్ పడింది. ఆ తరువాత సినిమాలేవీ విడుదల కాలేదు.

    ఇక బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఏదీ కూడా టాలీవుడ్‌లా రికవరీ కాలేదు. ఇక డిసెంబర్ నెలలో అయితే ఏకంగా బాక్సాఫీస్‌ను అల్లల్లాడించారు. బాలయ్య అఖండ, బన్నీ పుష్ప, నాని శ్యామ్ సింగ రాయ్ ఇలా అన్ని సినిమాలు దుమ్ముదులిపాయి. డిసెంబర్ మొత్తం కూడా టాలీవుడ్ కళకళలాడింది. అయితే హిందీ పరిశ్రమ మాత్రం వెలవెలబోయింది.

    అదీ కాకుండా తెలుగు సినిమా.. పుష్ప.. డబ్బింగ్ రూపంలో హిందీలోకి వెళ్లి అరవై కోట్లకు పైగా రాబట్టింది. అలా ఈ ఏడాది టాలీవుడ్ నుంచి దాదాపు 1300 కోట్ల టర్నోవర్ జరిగిందట. కానీ బాలీవుడ్ మాత్రం 5 నుంచి 7 వందల కోట్ల లోపే బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఇన్నేళ్ల సినీ చరిత్రలో ఇలా బాలీవుడ్ కంటే టాలీవుడ్ దుమ్ములేపేయడం మొదటి సారి అని తెలుగు ప్రేక్షకులు కాలర్ ఎగిరేస్తున్నారు.

    ఇక హిందీ వరకు చూస్తే కేవలం అక్షయ్ కుమార్ సూర్యవంశీ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. రణ్ వీర్ సింగ్ 83 సినిమా దారుణమైన డిజాస్టర్‌గా మిగిలింది. అలా మొత్తానికి బాలీవుడ్ బాక్సాఫీస్‌కు ఈ ఏడాది నిరాశే మిగిలినట్టు అయింది.

    Leave a Reply