• January 5, 2022

Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. రిషి మనసులో వసు.. మొత్తానికి ప్రేమ చిగురించేసినట్టే!

Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. రిషి మనసులో వసు.. మొత్తానికి ప్రేమ చిగురించేసినట్టే!

    గుప్పెడంత మనసు ఈ రోజు సీరియల్ ఎపిసోడ్ అంటే బుధవారం నాటి Guppedantha Manasu Episode 339 ధారావాహికలో రిషి తన మనసు ఏంటో తెలుసుకున్నాడు. తన మనసులో వసు ఉందని తెలుసుకున్నాడు. ఇక గౌతమ్ చేష్టలకు రిషి అడ్డుకట్టే వేసే ప్రయత్నం చేశాడు. వసు నీకు ఎప్పటికీ దక్కదు అనేట్టుగా పరోక్షంగా మాటలను సంధించాడు. మరో వైపు జగతి కూడా వసు రిషి సంబంధం గురించి ఆలోచిస్తుంటుంది. మొత్తానికి గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ ఎలా సాగిందంటే..

    వసుకి తెలియకుండా సెల్ఫీ తీశానంటూ గౌతమ్ చూపించడంతో రిషి ఆశ్చర్యపోతాడు. ఆ సెల్ఫీలను రిషి డిలీట్ చేయడంతో మిత్రద్రోహి అంటూ గౌతమ్ అరిచేస్తాడు. ఫ్రెండ్ అంటే ప్రాణాలు ఇస్తారు అని గౌతమ్ అంటే.. ఇలాంటి పనులను వ్యతిరేకిస్తారు నాలాంటి వాళ్లు అని రిషి కౌంటర్ వేస్తాడు.. తనకు తెలియకుండా సెల్ఫీ తీశావ్ అని వసుకి చెబితే ఏమవుతుందో తెలుసా? అని రిషి అంటాడు. బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? అని గౌతమ్ అంటే.. చేసింది కరెక్ట్ కాదని చెబుతున్నాను అంటూ రిషి చెబుతాడు.. అప్పుడే వసుధార ఆర్డర్ తీసుకుని వస్తుంది. వసుకి చెప్పకురా కావాలంటే పార్టీ ఇస్తాను అని గౌతమ్ అంటాడు. ఏదో పార్టీ అంటున్నారు అని వసు అంటుంది.. నాక్కూడా వినిపించలేదు.. పార్టీ ఎందుకు ఇస్తున్నావ్ రా అని గౌతమ్‌ని ఇరికిస్తాడు రిషి.. పార్టీ ఎందుకు ఇస్తున్నారు సర్ అని గౌతమ్‌ని వసు అడిగితే.. బుద్ది తక్కువై.. డబ్బులు ఎక్కువై..అని అంటాడు. ఏమైంది ఇలా మాట్లాడుతున్నారు.. అని వసు లోలోపల అనుకుంటూ ఉంటుంది.

    వసు బొమ్మను గీసేందుకు గౌతమ్ చాలా కష్టపడతాడు. ఏంజిల్ కళ్లురా అంటూ గౌతమ్ ఏదేదో చెబుతుంటాడు. మనసులో ఆ రూపం ఉంటే.. పేపర్ మీదకు వస్తుంది అని రిషి అంటాడు.. అలాంటిలాంటి కళ్లు కాదురా.. ఆ కళ్లు చూడాలంటే అదృష్టం ఉండాలి.. అని గౌతమ్ అంటే.. నువ్ ఇంకా చూడలేదన్నమాట అని రిషి సెటైర్ వేస్తాడు.. కళను గొప్ప భావనతో చూడాలి.. ఏకాగ్రత లేనప్పుడు ఏ పని చేయకూడదు.. అందులోఇలాంటి పనులు అస్సలు చేయకూడదు అని అంటాడు రిషి.. నువ్ నన్ను ఎప్పుడు ఉత్సాహ పరిచావ్ అని.. నా ఏంజిల్ బొమ్మ గీస్తాను.. ఆ అందమైన కళ్లను అందంగా గీస్తాను.. అని మళ్లీ మొదలుపెడతాడు గౌతమ్.

    నేను గీస్తోంది బొమ్మ కాదురా.. ప్రాణంరా.. ఆ కళ్లు చూస్తే కళ్లు తిరిగి పడిపోవాలి.. అని చెబుతాడు. కానీ ఆ బొమ్మను గౌతమ్ గీయలేకపోతాడు. ఇప్పుడు నా వల్ల కాదు.. నాకు గ్రహాలు అనుకూలించడం లేదు.. గీయను అంటూ వెళ్లిపోతాడ. ఏంటి వీడు కళ్లు కళ్లు అని కలవరిస్తున్నాడు.. అని రిషి అనుకుంటాడు. అందమైన కళ్లు అంటే ఏవి.. అని రిషి తలుచుకోగానే వసుధార కళ్లు గుర్తకువస్తాయి. నాకు వసుధార కళ్లు ఎందుకు గుర్తొస్తున్నాయ్.. అవేమంతా పెద్ద గొప్ప కళ్లా?.. అని బొమ్మ వేయడం ప్రారంభిస్తాడు. చివరకు వసుధార బొమ్మను గీసేస్తాడు. ఏంటి వసుధార బొమ్మ గీశాను.. అని అనుకుంటాడు. అలా మొత్తానికి తన మనసులో వసు ఉందని రిషి తెలుసుకున్నట్టు అయింది.

    వసుధార ఏంటి.. ఇంకా నిద్ర లేవలేదేంటి? ఇలా సోఫాలో పడుకోవడం ఏంటి.. అని జగతి అనుకుంటుంది. బుక్స్ తీసేస్తుండగా అందులోంచి నెమలీక పడుతుంది. ఈ చిన్న పిల్లల చేష్టలేంటి.. అందరినీ ధైర్యంగా ఎదిరిస్తావ్.. వాదిస్తావ్. మళ్లీ చిన్న పిల్లలా మారిపోతావ్.. రిషిలానే నువ్ కూడా అర్థం కావు.. లేపాలా? వద్దా? ఎప్పుడు పడుకుందో ఏమో? అని జగతి అనుకుంటూ ఉంటుంది. ఇక కింద పడ్డ నెమలీకను తీసుకెళ్లి.. జంట నెమలీకలు మధ్యలో పెడుతుంది. బాగా లేదని మళ్లీ తీసేస్తుంది. రెండే బాగున్నాయ్.. అని అంటుంది.

    గుడ్ మార్నింగ్ రిషి.. అని ధరణి కాఫీని తీసుకొస్తుంది. గుడ్ మార్నింగ్ మిత్రమా?.. థ్యాంక్స్ ఫర్ ది కాఫీ.. అని గౌతమ్ తీసుకునే లోపు.. ఇది నా కాఫీ అని రిషి తీసేసుకుంటాడు.. వదిన వాడికి వేరే కాఫీ ఇవ్వండి.. వదిన వేరేది ఇస్తుంది.. అని రిషి అంటాడు. ఇది నాకే రాసే ఉందని త్యాగం చేయ్ రా.. అని గౌతమ్ అంటే.. అన్నీ రాసి పెట్టి ఉండవు.. కొన్ని మనమే రాసుకోవాలి.. దీని మీద నీ పేరు లేదు.. నాదే ఉంది.. అని రిషి అంటాడు.

    త్యాగం చేసేందుకు కూడా లిమిట్స్ ఉంటాయ్.. అని రిషి అంటే.. షేర్ చేసుకుందామా?.. అని గౌతమ్ సలహా ఇస్తాడు. అన్నీ షేర్ చేసుకోలేం.. నీకు వచ్చేది నీకు వస్తుంది.. నీకు కానిది ఎంత తపించినా రాదు.. చేయాల్సిందల్లా వెయిట్ చేయడమే.. అని రిషి పరోక్షంగా పంచ్‌లు వేస్తాడు. ఏంట్రా ఇంత పొద్దున ఇలా మాట్లాడుతున్నావ్.. అని గౌతమ్.. నేను ఎప్పుడూ ఒకేలా ఉంటాను.. సమయం సందర్భం పట్టి మారిపోను.. నువ్వే మార్చుకోవాలి.. అని గౌతమ్‌కు రిషి సెటైర్లు వేస్తాడు.

    కాఫీ గురించేనా? నువ్ మాట్లాడేది.. అని రిషి అంటే.. నీకు ఎలా అర్థమైతే అలా.. అని రిషి మరో కౌంటర్ వేస్తాడు. కాఫీ బాగుంది.. థ్యాంక్స్..వదిన అని రిషి ఇంకా గౌతమ్‌ని రెచ్చగొడతాడు. బాగున్న కాఫీని నాకు ఎందుకు ఇవ్వలేదురా? అని గౌతమ్ అంటే.. నువ్ ఎంత గింజుకున్నా నీకు రాసిలేనిది నీకు ప్రాప్తం రాదు.. అని కౌంటర్ వేస్తాడు. మంచి స్ట్రాంగ్ కాఫీని తీసుకురండి. వదిన అని గౌతమ్ అంటాడు.

    రిషి పేపర్ చదువుతుంటే.. గౌతమ్ తీసుకోవాలని చూస్తాడు. ఏంట్రా పేపర్ మీద కూడా నా పేరు రాసి పెట్టిలేదా?. అని గౌతమ్ అనడంతో.. పేపర్ అంతా నీ పేరు రాసి పెట్టి ఉందిరా అని రిషి అంటాడు.. ఏంట్రా లేచావ్.. అని గౌతమ్ అంటాడు. మళ్లీ క్లాస్ పీకుతావా? అని గౌతమ్ అంటే.. క్లాస్ అని కాదురా అని రిషి అంటాడు.. నీ ప్రోగ్రాం ఏంటో చెప్పలేదు..అని గౌతమ్ అడిగితే.. నీకు పీఏనారా.. నీ ఫ్రెండ్‌నురా అని అంటాడు.. తిడుతున్నావా.. పొగుడుతున్నావా? అని గౌతమ్ అంటాడు.. ఎలా అర్థమైతే అలా అని రిషి అంటాడు.. నేను మాత్రం కాలేజ్‌కి వెళ్తున్నాను అని రిషి అంటాడు.. నువ్ ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే.. నువ్ నా ఫ్రెండ్‌విరా అని గౌతమ్ అంటాడు.. వీడేంటో అర్థం కాడు..వదిన స్ట్రాంగ్ కాఫీ క్యాన్సిల్.. డబుల్ స్ట్రాంగ్..అని చెబుతాడు.

    కారులో జగతి, వసు వెళ్తుంటారు. నువ్వేంటి సోఫాలో పడుకున్నావ్ అని వసుని జగతి ప్రశ్నిస్తుంటుంది. చదువుతూ అలా పడుకున్నా అని వసు చెబుతుంది.. చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గిందని అనుకున్నా అని జగతి అంటే.. చిన్న చిన్న వాటికి డిస్టర్బ్ అవుతా కానీ చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గదు మేడం అని వసు చెబుతుంది.. చాలా పెండింగ్ వర్క్ ఉందని మీ ఎండీ గారికి చెప్పు.. అని జగతి అంటుంది. మా ఎండీగారు.. ఏంటి మన ఎండీగారు మేడం అని వసు అంటుంది..నీకు నచ్చితే ఎండీగారు.. నచ్చకపోతే మా అబ్బాయి.. కదా? అని జగతి అంటుంది. ఏదో ఒక సారి అన్నంత మాత్రానా మీరు పదే పదే అనడం బాగా లేదు మేడం అని వసు అంటుంది.. మిషన్ ఎడ్యుకేషన్ వర్క్ కూడా చాలా పెండింగ్ పడింది. అని వసు అంటే.. నువ్ తలుచుకుంటే అయిపోద్ది.. నువ్ చెబితే రిషి కాదంటాడా?అని జగతి అనడంతో వసు సిగ్గపడుతుంది. ఇక వెనకాల బైక్ మీద గౌతమ్ ఫాలో అవుతుంటాడు.

    కాలేజ్‌లో దిగిన రిషి.. వసు కోసం దిక్కులు చూస్తాడు. ఏంటి నాకు వసు గుర్తుకు వస్తోంది..అని అనుకుంటాడు. ఏంటి వసుధార ఇంకా రాలేదా?.. అని పుష్పను అడుగుతాడు. నాకు తెలుసు. ఇంకా రాలేదని, ఈ మధ్య ఆలస్యంగా వస్తోంది అని లోలోపల రిషి అనుకుంటాడు. వచ్చింది కానీ లైబ్రరీకి వెళ్లింది సర్ అని చెబుతుంది అలా మొత్తానికి ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌లో వసుకి రోమియో జూలియట్ బుక్‌ను రిషి ఇస్తాడు. వసు రిషి మాట్లాడుకుంటే మధ్యలోకి గౌతమ్ ఎంట్రీ ఇస్తాడు.

    Leave a Reply