• January 5, 2022

Karthika Deepam నేటి ఎపిసోడ్.. పాము, సింహం కథలు.. ఎంతైనా వంటలక్క బుర్రే బుర్ర!

Karthika Deepam నేటి ఎపిసోడ్.. పాము, సింహం కథలు.. ఎంతైనా వంటలక్క బుర్రే బుర్ర!

    కార్తీక దీపం ఈ రోజు సీరియల్ అంటే బుధవారం నాటి Karthika Deepam Episode 1241 ధారావాహికలో దీప తన భర్త, పిల్లలకు ఉపదేశాలు ఇచ్చింది. పాము కథలు, సింహం కథలు చెప్పి మోటివేట్ చేసింది. ఇక మరోవైపు సౌందర్య తన పెద్దోడి కోసం పరితపిస్తూ ఉంటుంది. మోనిత ఇంట్లోంచి నర్సమ్మను వారణాసి వెళ్లగొట్టేస్తాడు. అలా మొత్తానికి కార్తీక దీపం నేటి ఎపిసోడ్ ఎలా సాగిందంటే..

    వీడేంటి ఏడ్వడం లేదు.. ఒళ్లు ఇలా కాలిపోతోందేంటి.. సారీరా చూసుకోలేదు.. కాపురం పెట్టాలి.. అంటూ కార్తీక్ ఆ బిడ్డకు కాపురం పెడతాడు. తగ్గిపోతుందిలే.. అని అంటాడు. ఏంటిది టెంపరేచర్ తగ్గట్లేదు..నేనూ డాక్టర్‌నేరా.. నీకేం కానివ్వను.. అని అనుకుంటూ.. గతాన్ని తలుచుకుంటాడు. తాను చేసిన ఆపరేషన్, డాక్టర్‌గా చేసిన తప్పుని గుర్తు చేసుకుని నేను డాక్టర్‌ని కాదురా అని ఆ బిడ్డతో చెప్పుకుంటాడు..

    దీప ఎక్కడికెళ్లింది.. ఊరంతా వెతికాను.. ఎక్కడా కనిపించలేదు.. రుద్రాణి గానీ.. అనుకుంటూ ఆమె మాటలను గుర్తు చేసుకున్న కార్తీక్ కంగారు పడతాడు. ఇక బయటకు వెళ్దామని అనుకునే లోపు దీప వస్తుంది. ఏంటి దీప ఎంత టెన్షన్ పడుతున్నా.. నువ్ రాకపోయే సరికి.. నువ్ ఏమైపోయావో అని బాధపడుతున్నాను.. ఇంకెప్పుడూ ఇలా ఆలస్యంగా రావొద్దు.. ఊపిరి ఆగిపోతోంది.. అని కార్తీక్ అంటాడు. మీరేంటి ఇలా కొత్తగా భయపడుతున్నారు.. అని దీప అంటే భయపడాల్సి వచ్చింది.. అని కార్తీక్ చెబుతాడు.

    ఆ రుద్రాణి.. ఏమైనా అందా?.. అని దీప అడిగితే.. జరిగిందింతా చెప్పిన కార్తీక్ మాటలను విని దీప ఆశ్చర్యపోతుంది.. రుద్రాణి నన్నేం చేస్తుంది అంటూ దీప ధైర్యాన్నిస్తుంది.. ఊరంతా నీకోసం వెతికాను అని కార్తీక్ చెబుతుంటే పిల్లలు వస్తారు. నువ్ లేటుగా వచ్చావ్.. మేం ఫాస్ట్‌గా వచ్చామని పిల్లలు అంటారు. ఎందుకు స్కూల్లో త్వరగా వదిలారా? అని దీప అడుగుతుంది

    రుద్రాణి వచ్చి మాకు తినిపించాలని చూసిందంటూ జరిగిన విషయాన్ని చెబుతారు.. సరిగ్గా అదే టైంకి నేను అక్కడికి వెళ్లాను అని కార్తీక్ అంటాడు.. మాకు ఎందుకు లంచ్ బాక్స్ తెస్తుంది.. అలా ఎందుకు చేస్తోంది.. వద్దు వద్దు అన్నా తిను అంటుంది.. అని దీపను పిల్లలు అడుగుతారు. తెలిసిన ఆవిడ కదా?.. అలా చేసి ఉంటుంది.. వెళ్లండి వెళ్లి పడుకోండి.. అని దీప తన పిల్లలకు సర్దిచెబుతుంది.

    ఇక మరో వైపు మహేష్ వెతికి వెతికి అలిసిపోతాడు.. ఎక్కడున్నారు సర్.. మీ కోసం రెండు తెలుగు రాష్ట్రాలు తిరిగేలా ఉన్నాను.. ఈ ఊరు అయిపోయింది.. ఇంకో ఊరు తిరగాలి.. అంటూ తాడి కొండ నుంచి వెళ్లిపోతాడు. ఇక పిల్లాడికి ఇంకా జ్వరంగా తగ్గకపోయే సరికి కాపురం పెడుతూనే ఉంటాడు కార్తీక్. ఇవన్నీ మీకు ఎలా తెలుసు.. అని దీప ప్రశ్నిస్తుంది. నేను డాక్టర్ అని చెప్పబోయి ఆగిపోతాడు కార్తీక్. ఎవరోఏదో అన్నారని పది మందికి ఉపయోగ పడే వృత్తిని కాదనుకుంటే ఎలా.. ఓ సారి ఓ స్వామిజీ దగ్గరకి ఓ పాము వెళ్లింది.. అందరూ నన్ను చూసి భయపడుతున్నారు..ఏం చేయాలని అడిగిందట.. కాటేయడం మానేయాలిని చెప్పాడట..

    ఇక ఆ పాము కాటేయడం లేదని అందరూ కొట్టేవారట.. కొన్నాళ్లకు స్వామిజీ దగ్గరకు వెళ్లి నన్ను అందరూ కొడుతున్నారని వాపోయిందట.. కాటు వేయొద్దని చెప్పాను కానీ బుస కొట్టొద్దని చెప్పానా? అని అన్నాడట.. హాస్పిటల్‌లో పని చేయోద్దని అన్నారు కానీ.. తోటి వారికి సాయం చేయోద్దని అనలేదు కదా?.. అన్ని సార్లు విజయం సాధిస్తే అది విజయం కాదు.. ఎన్నో ఆపరేషన్లు.. ఒకటి ఫెయిల్ అయింది.. కోటేశు, శ్రీవల్లి ఆశ్రయం ఇచ్చారు.. మన కళ్ల ముందే వాళ్లు చనిపోయారు.. తెలియకుండా జరిగిన వాటికి బాధ్యత వహించకపోయినా.. కళ్లముందు జరిగే వాటికి బాధ్యత వహించాలి.. వాడికి జ్వరం వచ్చింది.. తడిబట్టతో.. డాక్టర్‌ని కాను మిమ్మల్ని మీరు సమాధాన పర్చుకున్నట్టున్నారు.. ఎవరు అవునన్నా కాదన్నా మీరు డాక్టర్.. తెలియక వంద తప్పులు చేయోచ్చు.. కానీ తెలిసి ఒక తప్పు కూడా చేయరు.. బాబుని ఇలా ఇవ్వండి. హాస్పిటల్‌కి తీసుకెళ్తాను.. అని దీప అంటుంది. ఇంతలో కార్తీక్ వచ్చి.. బాబుకు ఏం కావాలో డాక్టర్‌గా మందుల చీటి రాశాను.. తీసుకురా.. అని పంపిస్తాడు. నువ్ డాక్టర్ బాబు వద్ద క్షేమంగా ఉండు.. అని బిడ్డను ఇచ్చి దీప వెళ్లిపోతుంది.

    మోనిత వచ్చి ఫోటో తీసుకెళ్లిందా?..అని ఆదిత్య ఆశ్చర్యపోతాడు. అది అక్కడ ఎందుకు పెట్టావ్ అని సౌందర్య అడుగుతుంది. తరువాత పాడేద్దామని అనుకున్నాను కానీ అలా నువ్ విసిరేసే టైంకే వస్తుందని మనకేం తెలుసు అని ఆదిత్య అంటాడు. ఆ మోనిత మనకు అడుగడుగునా అడ్డం పడుతోంది.. బస్తీలో ఇళ్లు కొనేసింది.. ఏం చేస్తుంది.. అంటూ సౌందర్య కంగారు పడుతుంది. తన గురించి ఆలోచించడం వేస్ట్.. అన్నయ్య ఆచూకి కోసం వెదుకుతున్నాం అని ఆదిత్య చెబుతాడు.

    పెద్దోడు, దీప, పిల్లలు వెళ్లి ఇన్ని రోజులు అయింది.. మన బతుకు మనం బతుకుతున్నాం.. అని సౌందర్య బాధపడుతుంది. కావాలనే వెళ్లారు కాబట్టి ఆచూకి దొరకడం లేదు.. లేకపోతే ఈ పాటికే కనిపెట్టేసేవాళ్లం.. వాళ్లు ఎక్కడున్నా సంతోషంగా ఉన్నారని అనుకొని మనం సంతృప్తి చెందాలి.. ఇక మోనిత వల్ల జరిగే నష్టమేమీ లేదు.. అన్నీ చేసేసింది.. మోనితను మరిచిపో మమ్మీ.. అని ఆదిత్య కాస్త ధైర్యాన్ని చెప్పేందుకు ప్రయత్నిస్తాడు.

    మోనిత ఇక నర్సమ్మ నర్సమ్మ అని పిలుస్తుంటుంది. కానీ ఇంట్లోకి వారణాసి వచ్చి ఉంటాడు. నువ్వా ఏంటి ఇక్కడ అని మోనిత అంటుంది.. నర్సమ్మను బయటకు పంపించేశాం.. ఎవ్వరినీ తీసుకొచ్చినా ఒక్క రోజు కూడా ఇక్కడ ఉండనివ్వం.. మీరేం అనుకుని ఇక్కడకు వచ్చారోనాకు తెలీదు.. మా బస్తీ వాళ్ల గుండెల్లో దీప ఉంది.. వెళ్లిపోండి.. అని వారణాసి వార్నింగ్ ఇస్తాడు. అది అసంభవం అని మోనిత అంటుంది.. మిమ్మల్ని చూస్తే జాలి వేస్తుంది..ముందుముందు చాలా జరుగుతుంది.. మీకు మా బస్తీ వాళ్ల గురించి తెలియదు.. వస్తాను మేడం నమస్తే.. అని స్వీట్ వార్నింగ్ ఇచ్చేసి వస్తాడు.

    అమ్మా తమ్ముడికి కూడా అన్నం తినిపిద్దామా? అని పిల్లలు అంటారు. వాడిప్పుడు పాలు మాత్రమే తాగుతాడు. వీడు భలే ఉంటాడు అని దీప, పిల్లలు మురిసిపోతారు.. మనకే తినడానికి ఇబ్బంది అవుతుందంటే బాబుని పెంచుకుంటున్నారని అంటున్నారు.. అని శౌర్య ఊరి జనాల మాటలను చెబుతుంది. అత్తమ్మ నీకోటి చెప్పనా? అడవికి రాజు సింహం.. కానీ సింహం లేని సమయంలో మిగతా జంతువులన్నీ తిట్టుకుంటాయి.. కానీ సింహం రాగానే సైలెంట్ అవుతాయి. మనం సింహంలా బతకాలి.. ఎవరు ఏమన్నా సరే వీడు మనతోనే ఉంటాడు.. అని దీప అంటుంది. దీంతో ఆ బుడ్డోడు కూడా ఊ అనడంతో పిల్లలు నవ్వేస్తారు.. రుద్రాణి మనకు ఎందుకు లంచ్ బాక్స్ తెస్తోంది..మీతో గొడవ పడుతోంది.. మాతో ప్రేమగా ఉంటుంది ఎందుకు అని దీపను పిల్లలు ప్రశ్నించడంతో ఎపిసోడ్ ముగుస్తుంది.

    Leave a Reply