• January 4, 2022

Rashmi Gautam : తాగొచ్చావా? ఏంది.. రష్మీ పరువుతీసిన సుడిగాలి సుధీర్

Rashmi Gautam : తాగొచ్చావా? ఏంది.. రష్మీ పరువుతీసిన సుడిగాలి సుధీర్

    Rashmi Sudheer సుధీర్ రష్మీ జోడికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత తొమ్మిదేళ్లుగా ఈ ఇద్దరూ కలిసి బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఎప్పుడూ కూడా ఈ జంట మీద నెగెటివిటీ అనేది రాలేదు. ఎందుకంటే ఈ ఇద్దరి కెమిస్ట్రీ, ట్రాక్‌లో సహజత్వం ఉందని అందరూ నమ్ముతారు. అందుకే సుధీర్ రష్మీ జోడిని అందరూ ప్రేమిస్తారు.

    సుధీర్ రష్మీ నిజ జీవితంలో పెళ్లి చేసుకుని ఒక్కటవ్వాలని ఎంతో మంది కోరుకుంటూ ఉంటారు. కానీ తామిద్దం కేవలం స్నేహితులమేనని రష్మీ, సుధీర్ చెప్పుకొస్తుంటారు. ప్రేమ, పెళ్లి అనేవి లేవని, తాము కేవలం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు మాత్రమే అలా నటిస్తుంటామని అంటుంటారు.

    మామూలుగా అయితే రష్మీ మీద సుధీర్ ఎప్పుడూ కూడా సెటైర్లు వేయడు. కానీ తాజాగా హైపర్ ఆది స్కిట్‌లో భాగంగా రష్మీ మీద సుధీర్ పంచ్ వేస్తాడు. రైజింగ్ రాజు, రష్మీ ఇద్దరూ ఒకరినొకరు చేతులు పట్టుకుని రోడ్డు దాటించుకుంటున్నారు..అని రష్మీ వయసు మీద కౌంటర్ వేశాడు. దీంతో రష్మీ తూ అని అంటుంది.

    అయితే స్కిట్ అంతా అయిన తరువాత రోజా ఓ పుల్ల వేసింది. సుధీర్ అన్ని మాటలు అంటుంటే అలా చూస్తున్నావేంటి? అని రష్మిని రోజా అడుగుతుంది. స్కిట్ కదా? అని ఊరుకున్నాను అంటుంది రష్మీ. స్కిట్ కోసం వచ్చినప్పుడు న్యాయం చేయాలి కదా? ఏది రాస్తే అది చేయాలి కదా? అని సుధీర్ అంటాడు.

    అంటే వాళ్లు ఏది చెబితే అది అంటావా? ఇప్పుడు నాతో డ్యాన్స్ చేయ్ అని అంటుంది రష్మీ. అలా రష్మీ సుధీర్ డ్యాన్స్ వేస్తారు. మళ్లీ ఇంకో పాట కూడా వేయండని రష్మీ అంటుంది. ఏంది రెడ్ బుల్ తాగి వచ్చావా? అంటూ రష్మీ పరువుతీసేస్తాడు సుధీర్.

    Leave a Reply