• January 3, 2022

Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. వసుతో గౌతమ్ క్లోజ్!.. అలా ఇరుక్కుపోయిన రిషి

Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. వసుతో గౌతమ్ క్లోజ్!.. అలా ఇరుక్కుపోయిన రిషి

    గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే సోమవారం నాటి Guppedantha Manasu Episode 337 ధారావాహికలో రిషి, వసు, గౌతమ్, మహేంద్ర, జగతి చుట్టూ తిరిగింది. వసు దగ్గరకు గౌతమ్ వెళ్లడంతో రిషికి కాలిపోతుంది. టిఫిన్ కూడా చేయకుండా వెళ్లిపోతాడు. మరోవైపు జగతిని రివర్స్‌లో రిషి ప్రశ్నిస్తాడు. వసు విషయంలో రిషి కాస్త బయటపడ్డట్టు కనిపిస్తుంది. గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ ఎలా కొనసాగిందంటే..

    వసుని, జగతిని విడదీసేందుకు ప్రయత్నించింది ఎవరై ఉంటారా? అని మహేంద్ర ఆలోచిస్తుంటాడు. అదే సమయంలో రిషి ఎంట్రీ ఇస్తాడు. డాడ్ మీరేంటి ఇక్కడా?? అని అడుగుతాడు. ఇది నా ప్రశ్న అనుకుంటాను.. అని మహేంద్ర కౌంటర్ వేస్తాడు. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను.. అని రిషి సమాధానం చెబుతాడు. ఓ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ వచ్చాను.. అని మహేంద్ర చెబుతాడు.

    అదేంటో చెప్పండి అని రిషి అంటే.. నీకుఅర్థం కాదులే అని మహేంద్ర అంటాడు.. అర్థం చేసుకుంటాను.. అని రిషి అంటాడు. అయితే నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను.. వాటికి ఆన్సర్స్ చెప్పు అని రిషిని మహేంద్ర అడుగుతాడు. ఆకలి వేసి అరటి పండు తిని.. ఆ తొక్కను నడిచే రోడ్డు మీద వేశాడని అనుకో వాడిని ఏమంటారు అని మహేంద్ర అడుగుతాడు..

    ఇంగ్లీష్‌లో ఏదేదో చెబుతుంటే.. తెలుగులో చెప్పమని మహేంద్ర అడిగితే.. బుర్రతక్కువ అంటారు.. అని చెబుతాడు. సంబంధం లేకుండా పక్క వారి జీవితాల్లోకి వచ్చి ప్రశాంతతను చెడగొట్టే వాడిని ఏమంటారు? అని మహేంద్ర మరో ప్రశ్న వేస్తాడు.. పనికి మాలినవాళ్లు అని రిషి సమాధానం చెబుతుంటాడు.. ఇంచు మించు అలాంటిదే అని మహేంద్ర అంటాడు.

    ఒకరు ఒకరి నుంచి ఒకరిని దూరం చేయాలని చూస్తున్నారు.. ఆ ఒకరు ఎవరో తెలిస్తే.. అని మహేంద్ర అనుకుంటూ ఉంటాడు. ఇంతలో రిషి కల్పించుకుంటూ వసుధార గురించేనా? అని రిషి ప్రశ్నిస్తాడు. అలా నేను ఏదో ఒకటి చెబితే నీకు వసుధార గుర్తుకు వచ్చిందేంటి.. అని మహేంద్ర అడగడంతో రిషి తడుముకుంటాడు. మొన్న నువ్ టైంకి వచ్చావ్ కాబట్టి సరిపోయింది.. లేకపోతే ఏం జరిగిపోయేదో.. విడిపోయేవారు.. అని మహేంద్ర ఆ విషయాలను తలుచుకుంటాడు.

    విడిపోలేదు కదా?.. అని రిషి ఆ టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఆ ఇద్దరి మధ్య ఎవరో ఏదో చేశారు.. తెలిస్తే నా చేతిలో ఉంటుంది. అని మహేంద్ర అంటాడు. వదిలేయండి డాడ్ అని రిషి అంటే.. ఎందుకు వదిలేయాలి రిషి అని మహేంద్ర అంటాడు.. ఆలోచిస్తే ఏదో ఒక లాజిక్ తడుతుంది.. తను ఎవరో తెలుస్తుంది.. జగతి బాధపడ్డా, వసు బాధపడ్డా.. బాగుండదు కదా? వాళ్లను విడిదీస్తే ఏం వస్తుంది.. నాకు తిట్లు రావు గానీ.. అని మహేంద్ర తెగ బాధపడుతూ ఉంటాడు.

    వాళ్లిద్దరూ బాగానే ఉన్నారు కదా? వదిలేయండి డాడ్ అని రిషి అంటాడు. వదలను రిషి.. ఆ మూడో మనిషి ఎవరో తనను వదలను.. అని మహేంద్ర పట్టుబడతాడు. ఈ టాపిక్ ఇంతటితో వదిలేయండి.. అని రిషి అంటే.. అంతే అంటావా? అని మహేంద్ర అంటాడు. నా దగ్గర తీయకండి.. అని రిషి వెళ్లిపోతాడు. మేడం నా పేరు చెప్పలేదు.. మంచిది అయింది.. అంటూ రిషి రిలాక్స్ అవుతాడు.

    షార్ట్ ఫిల్మ్ అంటూ వసుతో పులిహోర కలిపేందుకు గౌతమ్ వస్తాడు.. వసుకి తెలియకుండానే సెల్ఫీ తీసుకుంటాడు.. పెద్ద పనైపోయింది అంటూ గౌతమ్ అసలు విషయాన్ని చెప్పకుండా వసు దగ్గర దాచి పెడతాడు. ఇక టిఫిన్ చేసే సమయంలో గౌతమ్ లేడేంటి? అని ధరణిని రిషి అడుగుతాడు. ఇంత పొద్దున్నే వాడికి ఏం పని అని వదినను రిషి అడుగుతాడు

    వసుధార వద్దకు వెళ్తాను అని అన్నాడు రిషి అంటూ ధరణి చెబుతుంది. దీంతో టిఫిన్ తినేయడం మానేస్తాడు రిషి.. అది కనిపెట్టిన దేవయాణి.. రిషికి కోపం తెచ్చేలా ప్రవర్తిస్తుంది. వసుధారకి అభిమానిగా మారిపోయాడేమో అని అంటుంది.. వసు తెలివితేటలకు ఎవ్వరైనా అభిమానిగా మారాల్సిందేనని ఫణీంద్ర అంటాడు.. టిఫిన్ తినడం మానేయడంతో నా టిఫిన్ అయిపోయింది.. అని రిషి అంటాడు. అదేంటి రిషి.. అని ఫణీంద్ర అంటాడు. నాకు పెద్దగా ఆకలేం లేదు అని రిషి వెళ్లిపోతోంటాడు.. రిషి ఈ రోజు మీటింగ్ టైమింగ్ ఫిక్స్ చేశావా?.. అని ఫణీంద్ర అడిగితే.. కాలేజ్‌కు వెళ్లి టైమింగ్ ఫిక్స్ చేస్తాను.. అని రిషి అంటాడు. మహేంద్ర తిను.. దేవయాణి సెటైర్లు వేస్తుంది.

    కారులో జగతి, వసు వస్తుంటారు. ఒకరినొకరు అన్న మాటలను జగతి, వసు తలుచుకుంటారు నేను నిన్ను వెళ్లమన్నానే అనుకునో అలా నువ్వు ఎలా వెళ్లిపోతావ్ అని వసుని జగతి అన్న మాటలను తలుచుకుంది.. ఎదుటి వారిని అర్థం చేసుకోవడంతో ఎప్పుడూ ఎందుకు పొరబాటు చేస్తాం అని వసు అడుగుతుంది.. సమస్యలను మన దృష్టిలోనే ఆలోచిస్తాం.. దోషులుగా చూస్తాం.. అలా కాకుండా ఎదుటి వారి దృష్టిలోంచి ఆలోచించాలి.. అది అసాధ్యం కాదు.. అని జగతి అంటుంది.

    ఇంతలోనే రిషి ఫోన్ వస్తుంది. దీంతో వసుధార జగతి మేడం వైపు చూస్తుంది. ఫోన్ వస్తే ఫోన్ వైపు చూడాలి. కానీ నా వైపు ఎందుకు.. అని జగతి అంటుంది. రిషి సర్ ఫోన్ చేస్తే నా పర్మిషన్ తీసుకుని మాట్లాడతావా? మాట్లాడు.. అని జగతి అంటుంది. ఎక్కడున్నావ్.. ఏం చేస్తున్నావ్.. ఎవరితో ఉన్నావ్.. అని ఇలా వసు మీద ప్రశ్నల వర్షం కురిపిస్తాడు రిషి. గౌతమ్ వచ్చాడట.. అని రిషి ప్రశ్నిస్తాడు. వచ్చాడు.. వెళ్లారు సర్.. అని వసు చెబుతుంది. ఇంత పొద్దున్నే రావడానికి వాడికేం పని.. సరే కాలేజ్‌లో కలుద్దాం.. అని వసు చెప్పేది ఏది వినకుండా రిషి ఫోన్ పెట్టేస్తాడు.

    అలా రిషి ఫోన్ చేయడం మహేంద్ర చూస్తాడు. దీంతో రిషి షాక్ అవుతాడు. చెప్పండి ఏండీ గారు.. అని రిషిని మహేంద్ర అడుగుతాడు. ఇలా ఎందుకు చేస్తున్నారు.. అని రిషి అరిచేస్తాడు. అర్థమయ్యేలా చెప్పు అని మహేంద్ర అంటాడు.. అక్కడికి ఇంత పొద్దున్నే వెళ్లాల్సిన పనేముంది.. అని రిషి అంటాడు.. అక్కడికి అంటే ఏంటి అని మహేంద్ర సెటైర్ వేస్తాడు..

    డాడ్ గౌతమ్.. వసు దగ్గరకు వెళ్తున్నాడని చెప్పాడు కదా? అని రిషి అంటే.. ఆ విషయం మరిచిపోయాను అని మహేంద్ర అంటాడు.. అది మీరు మరిచిపోయారో నాక తెలీదు.. వెళ్లొద్దని చెప్పండి..అని రిషి అడుగుతాడు. గౌతమ్ నీ ఫ్రెండ్ కదా?. నువ్ చెబితేనే బాగుంటుందేమో.. కాదు కూడదు అంటావా? నేను చెబుతాను.. పాపం ఏమైనా ఫీలవుతాడేమో.. అని మహేంద్ర అంటాడు. నేనే చెప్పుకుంటానులే అని రిషి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.. మై డియర్ పుత్ర.. మామూలోడివి కాదు.. ఎందుకు కోపం వచ్చిందో చెప్పవు.. మనసు విప్పవు.. ఇలా ఎన్నాళ్లురా.. కానివ్వు. అని అనుకుంటాడు.

    ఇక సీన్ కాలేజ్‌లో జగతి, మహేంద్రల మీద ఓపెన్ అవుతుంది. అలా ఈ ఇద్దరూ నడుచుకుంటూ వస్తారు. జీవితం విచిత్రమైంది కదా? ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు.. అని మహేంద్ర అంటాడు. చెప్పండి మహేంద్ర సర్.. ఏదో జ్ఞాన బోధ చేస్తున్నారు.. కదా? అని జగతి అంటుంది. మన పుత్ర రత్నం వస్తున్నాడు.. వాడికి మూడ్ సరిగ్గా లేదనుకో.. నాకు జ్ఞాన బోధ చేస్తున్నారు.. అని అక్కడి నుంచి మహేంద్ర వెళ్లిపోతాడు.

    థ్యాంక్స్ మేడం.. అని రిషి అంటాడు. ఎందుకు సర్ మీరు చెప్పిన పని నేను చేయలేకపోయాను అని జగతి అంటుంది.. వసు గురించి నా కంటే ఎక్కువగా మీకే తెలియాలి.. అలాంటప్పుడు నేనేదో మీకు చెప్పాను అనుకోండి.. మీరు దానికి సరే అంటే ఎలా మేడం.. అని రిషి రివర్స్ గేర్ వేస్తాడు. వెళ్లమని చెప్పేది నువ్వే.. ఇప్పుడు వద్దని అన్నది నువ్వే.. నిన్ను అంత ఈజీగా అర్థం చేసుకోలేం. కనీసం వసు అయినా నిన్ను అర్థం చేసుకోవాలి అని జగతి అంటుంది.

    ఇక వసు, పుష్ప ఇద్దరూ మాట్లాడుకుంటారు. జీవితం అంటే పోగేసుకోవడం కాదు.. పోగొట్టుకోవడం.. అని ఇలా ఏదేదో మాట్లాడుకుంటూ వెళ్తారు. అలా రిషి కారు కీ జేబులోంచి పడిపోవడం వసు చూస్తుంది. దాని కోసం వసు వెతుకుతుంటే.. పుష్ప మాత్రం ఇవన్నీ మనకు అవసరమా? క్లాస్‌కి లేట్ అయితే రిషి సర్ తిడతారు రా అని పుష్ప లాక్కెళ్తుంది. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌లో వసు పని చేస్తున్న రెస్టారెంట్‌లో గౌతమ్ ఓ వైపు రిషి మరో వైపు కూర్చుంటారు. ఎందుకు వచ్చావ్ రా అని గౌతమ్‌ని రిషి అడిగితే.. నువ్ కూడా రోజు వస్తున్నావ్ కదా? అని రివర్స్‌లో గౌతమ్ అడుగుతాడు. అలా మొత్తానికి రిషిని ఇరికించేశాడు గౌతమ్. మరి రిషి ఇప్పటికైనా వసు మీదున్న ప్రేమను బయటపెడతాడో లేదో చూడాలి..

    Leave a Reply