- December 19, 2021
Pushpa Collection : పుష్ప సెకండ్ డే కలెక్షన్.. ఏ ఏరియాలో ఎంతంటే?

Pushpa Day 2 Area Wise Collection పుష్ప సినిమా రెండో రోజు కలెక్షన్లలో కాస్త తగ్గింది. అయినా కూడా సినిమా విడుదలైన ప్రతీ చోటా దుమ్ములేపుతోంది. ఈ వీకెండ్ మొత్తాన్ని పుష్ప రాజ్ అల్లాడించబోతోన్నాడు. ఇక ఆదివారం నాడు కూడా మంచి వసూళ్లే రాబట్టేట్టు కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్ప మొదటి రోజు 24.9 కోట్ల షేర్, రెండో రోజు 13.7 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా రెండు రోజుల్లో 38.60 కోట్ల షేర్, 56 కోట్ల గ్రాస్ కొల్లగొట్టేసింది.
రెండో రోజు ఒక్కో ఏరియాలో ఎంత కలెక్ట్ చేసిందంటే.. నైజాంలో 7.4కోట్లు, సీడెడ్‌లో 2.02, ఉత్తరాంద్రలో 1.25కోట్లు, ఈస్ట్ 76 లక్షలు, వెస్ట్ 52 లక్షలు, గుంటూరు 55 లక్షలు, కృష్ణా 77 లక్షలు, నెల్లూరు 43 లక్షలు అలా మొత్తంగా రెండో రోజు 13.70 కోట్లు రాబట్టింది. రెండో రోజు ఇరవై కోట్ల గ్రాస్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమ్ములేపేసింది.
అదే ఈ రెండు రోజుల్లో అయితే నైజాంలో 18.84కోట్లు, సీడెడ్‌లో 6.22, ఉత్తరాంద్రలో 3.05కోట్లు, ఈస్ట్ 2.19కోట్లు, వెస్ట్ 2.02 కోట్లు, గుంటూరు 2.83 కోట్లు, కృష్ణా 1.9 కోట్లు, నెల్లూరు 1.53 కోట్లు అలా మొత్తంగా రెండు రోజుల్లో 38.60 కోట్ల షేర్, 56 కోట్ల గ్రాస్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమ్ములేపేసింది.
అదే ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే.. కర్ణాటకలో 9 కోట్లు, తమిళనాడులో 3.05కోట్లు, కేరళలో 1.55కోట్లు, హిందీలో 3.35కోట్లు రెస్టాఫ్ ఇండియాలో 1.4 కోట్లు,ఓవర్సీస్లో 6.05 కోట్లు కొల్లగొట్టిందని అంచనా. అలా మొత్తంగా ఈ రెండు రోజుల్లో 58.90 కోట్ల షేర్, 94 కోట్ల గ్రాస్ రాబట్టిందని సమాచారం.