• December 16, 2021

Guppedantha Manasu : గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్.. రిషిని ఉడికించిన వసు.. రెచ్చిపోయిన గౌతమ్

Guppedantha Manasu : గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్.. రిషిని ఉడికించిన వసు.. రెచ్చిపోయిన గౌతమ్

    గుప్పెడంత మనసు ఈ రోజు ఎపిసోడ్ అంటే గురువారం నాడు అంటే డిసెంబర్ 16 నాటి Guppedantha Manasu Episode 322 ధారావాహికలో రిషి మైండ్ బ్లాక్ అవుతుంది. ఇటు ఫ్రెండ్ గౌతమ్.. అటు ప్రేమించే అమ్మాయి వసు. మధ్యలో రిషి నలిగిపోతాడు. ఇక వసు కోసం గౌతమ్ చేసే పిచ్చి చేష్టలను రిషి భరిస్తుంటాడు. మొత్తానికి రిషి వసు మధ్య దూరం పెరుగుతుందా? తగ్గుతుందా? అనేది తెలియడం లేదు. నేటి ఎపిసోడ్ ఎలా సాగిందంటే..

    కారులో వెళ్తోన్న గౌతమ్‌కు వసు కనిపిస్తుంది. రిషిని కారు ఆపమని అంటాడు. నువ్ ఇలా అన్నావో లేదో.. అలా అమ్మాయి కనిపించింది.. నీ నోరు ఎంత మంచిదిరా అంటూ గౌతమ్ ఎగ్జైట్ అవుతాడు. తీరా అమ్మాయిని చూస్తే వసుధారనా? అని రిషి షాక్ అవుతాడు. ఇక గౌతమ్ అయితే వసు దగ్గరకు వెళ్లి ఫుల్ ఎగ్జైట్మెంట్‌తో హాయ్ అని అంటాడు. వసు మాత్రం సింపుల్‌గా హాయ్ అని వదిలేస్తోంది.

    నేనండి.. హాస్పిటల్.. పేషెంట్.. గౌతమ్ అని చెబుతూ ఉంటాడు. తెలుసండి అని వసు బదులిస్తుంది. మరి ఏంటి అంత సింపుల్‌గా హాయ్ అన్నారు.. మిమ్మల్ని చూసి నేను ఎగ్జైట్‌ అయ్యాను.. అని గౌతమ్ అంటే.. మీరు అలా ఎందుకు అయ్యారు అని వసు అడుగుతుంది.. నేను ఇప్పుడే అనుకున్నాను.. ఇలా మీరు కలిశారు.. అని గౌతమ్ అంటాడు. అవునా.. అయితే ప్రపంచంలో అందరూ బాగుండాలని కోరుకోండి.. అని వసు కౌంటర్ వేస్తుంది.

    లిఫ్ట్‌ కావాలా?.. అని గౌతమ్ అంటాడు. నో థ్యాంక్స్ అని వసు చెబుతుంది. అది నా కారు కూడా కాదు మా ఫ్రెండ్‌ది అని రిషిని చూపిస్తాడు గౌతమ్. రిషి సర్ ఫ్రెండా? అని వసు లోలోపల అనుకుంటుంది. ఇక మరో వైపు. వీడేంటి ఇంత సేపు మాట్లాడుతున్నాడు.. వసుకు ఇంత మాట్లాడాల్సిన అవసరం ఏముంది.. అని రిషి అనుకుంటాడు.

    రిషిని చూడటంతో లిఫ్ట్ ఓకే అని చెబుతుంది. ఎలా మాట్లాడతాడు.. నిన్నటిది మనసులో పెట్టుకుని మాట్లాడతాడా? అని టెస్ట్ చేసేందుకు వసు కారు ఎక్కడానికి వస్తుంది. థ్యాంక్యూ థ్యాంక్యూ అంటూ గౌతమ్ సంబరపడిపోతాడు. ఏంటి వసుధార వస్తుంది? అని రిషి కంగారు పడిపోతాడు.. రేయ్ రిషి నువ్ సూపర్‌రా.. కొంచెం లిఫ్ట్ ఇద్దాంరా.. అని గౌతమ్.. అరేయ్ గౌతమ్ అంటూ రిషి ఫైర్ అవుతాడు. ప్లీజ్‌రా.. అరేయ్ ప్లీజ్.. అర్థం చేసుకోరా.. అని రిషిని గౌతమ్ బతిమిలాడతాడు. సరే రమ్మను.. అని రిషి పర్మిషన్ ఇస్తాడు.

    వాడు రమ్మనగానే రావాలా?. రాను అని అనొచ్చు కదా?. అని వసు గురించి లోలోపల రిషి ఫైర్ అవుతాడు. అరేయ్ నేను ఎంత ఆనందంగా ఉన్నానో నీకు తెలుసా? నేను ఇలా అనుకున్నానో లేదో అలా కనిపించింది.. నేను గ్రేట్ కదా?. అని రిషిని గౌతమ్ అడుగుతాడు. అవును నువ్ గ్రేట్.. మహా గ్రేట్ అని వెటకారంగా రిషి అంటాడు. వీడు నా బచ్ పన్ దోస్త్.. అని రిషిని వసుకు పరిచయం చేస్తాడు గౌతమ్.

    హలో సర్.. అని రిషి ఎవరో తెలీనట్టుగానే వసు ఉంటుంది. ఇంత అందమైన అమ్మాయికి ఎంతో అందమైన పేరుండాలి కదా?. అని పేరు తెలుసుకునేందుకు గౌతమ్ ప్రయత్నిస్తాడు. మీ పేరు ఏంటి? అని గౌతమ్ అడగడంతో వసుధార అని రిషి పిలుస్తాడు. ఎంతో బ్యూటీఫుల్ పేరు.. అని గౌతమ్ సంబరపడతాడు. అయినా నీకు ఆమె పేరు ఎలా తెలుసురా? అని రిషి అడుగుతాడు గౌతమ్.

    ఆమె నా స్టూడెంట్‌రా అని రిషి బదులిస్తాడు. నేను సర్ వాళ్ల కాలేజ్‌లోనే చదువుతున్నాను సర్.. అని వసు కూడా బదులిస్తుంది. థ్యాంక్యూ గాడ్.. రిషి థ్యాంక్యూరా.. అని గౌతమ్ అంటాడు. నాకెందుకు థ్యాంక్స్ రా అని రిషి అంటే.. అదంతేరా.. కాలేజ్ పెట్టి మంచి పని చేశావ్ రా.. ఎందుకిలా అంటున్నానో నీకు తెలుస్తుందిలే అని గౌతమ్ గుణుక్కుంటాడు..

    వసుధార అని నేరుగా గౌతమ్ పిలుస్తాడు. అండి, గారు, మేడం ఇవన్నీ మనుషుల మధ్య దూరం పెరుగుతాయ్ అందుకే నేను వసుధార అని పిలుస్తాను అని గౌతమ్ అంటాడు.. కోపాలు,అలకలు, అపార్థాలు కూడా దూరాన్ని పెంచుతాయ్ అని వసు అంటే.. ఉంటారులేండి కొంత మంది వెధవలు.. అంత ఎందుకు వీడు కూడా చిన్నప్పుడు అన్నింటికి అలిగే వాడు.. ఇంకా అలానే ఉన్నావారా? అని గౌతమ్ కాస్త ఓవర్ చేస్తుంటాడు.

    షటప్.. అని రిషి ఫైర్ అవుతాడు. నేను స్ట్రెయిట్ ఫార్వార్డ్.. మనసులో ఏముంటే అదే చెబుతాను.. అని గౌతమ్ అంటే.. అదే మంచి పద్దతి..కానీ కొంత మంది ఉంటారు మనసులో ఏమైనా ఉన్నా అడగరు.. ఏదేదో ఊహించుకుని ఫీలవుతుంటారు.. అని రిషి మీద వసు సెటైర్ వేస్తుంది. అబ్బె అదొక వేస్ట్ పద్దతి అండి.. మనసులో ఉంటే చెప్పేయాలి.. మళ్లీ ఎప్పుడెప్పుడు కలుస్తానా? అని అనుకున్నాను.. చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది.. అందులోనూ రిషి కాలేజ్‌లో.. నా ఆనందం ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు.. అని ఇలా గౌతమ్ వాగుతూనే ఉంటాడు.

    కోపం వచ్చిన రిషి ఒక్కసారిగా కారుకు బ్రేకులు వేస్తాడు. దీంతో వసు వచ్చి గౌతమ్‌ భుజానికి తాకుతుంది. సారీ అండి.. అని వసు చెబుతుంది. అరేయ్ ఇదేదో బాగుంది.. ఇలానే ట్రై చేయరా.. అని రిషిని గౌతమ్ అడుగుతాడు. అలా అడగడంతో రిషి ఒక్క చూపు చూస్తాడు.. సర్లే వద్దు అని గౌతమ్ సైలెంట్ అవుతాడు. వసుధార నీది ఏ గ్రూప్.. అని గౌతమ్ అడుగుతాడు.

    మ్యాథ్స్ అని చెప్పడంతో.. నాది కూడా మ్యాథ్సే, వీడిది కూడా మ్యాథ్సే అని గౌతమ్ అంటాడు. సర్ మ్యాథ్స్‌లో గోల్డ్ మెడలిస్ట్ కదా?. అని రిషి గురించి వసు చెబుతుంటే.. వాడి మొహం వాడికి నేర్పించిందే నేను.. డౌట్స్ ఉంటే నన్ను అడుగు ట్యూషన్ చెబుతాను.. అని గౌతమ్ రెచ్చిపోతుంటాడు. తాను కాలేజ్ టాపర్.. యూత్ ఐకాన్ టైటిల్ విన్నర్.. అని వసు గురించి రిషి చెబుతాడు.

    ఐతే నా సెలక్షన్ సూపర్ అన్నమాట.. అని గౌతమ్ అంటాడు. సెలెక్షన్ ఏంటి.. అని రిషి నిలదీస్తాడు. మీకు ఇష్టమైన ఫుడ్, పెట్ ఇవన్నీ ఏంటి.. అని గౌతమ్ ఇలా ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. దీంతో చిరాకు వచ్చిన రిషి.. ఏంట్రా నీ గోల.. అని అరిచేస్తాడు. ఇవన్నీ నీ దగ్గరే తెలుసుకోవచ్చు కదా? నీ స్టూడెంట్ కదా? అని గౌతమ్ అంటాడు.. వింటున్నాను కదా? అని ఏది పడితే అది చెప్పకు.. అని రిషి అంటాడు.

    ఇద్దరం తెలివైన వాళ్లమే.. సరేనా? అని గౌతమ్ ఓ ఒప్పందానికి వద్దామని అంటాడు. తన రెస్టారెంట్ వచ్చింది.. అని రిషి అంటాడు. రెస్టారెంటా? అంత రిచ్చా?.. అని గౌతమ్ ఆశ్చర్యపోతాడు. రెస్టారెంట్ నాది కాదు.. ఇక్కడ పని చేస్తాను అని వసు అంటుంది. అంటే పనే దైవమన్నమాట.. అని గౌతమ్ ఇంకా రెచ్చిపోతాడు. అరేయ్ మనం వెళ్ది కాఫీ తాగుదామని రిషిని గౌతమ్ అడుగుతాడు.

    నాకు కాఫీ నచ్చదు.. అని రిషి కాస్త బెట్టు చేస్తాడు. కాఫీ అంటే నీకు ఇష్టం కదా? అని గౌతమ్ అంటే.. ఇష్టాలు మారొద్దని ఎక్కడైనా ఉందా?.. అని రిషి అంటాడు. అయితే నేను వసుధార అలా కాఫీ తాగేసి వస్తాం.. నువ్ అలా రౌండ్లు కొట్టేసి రారా? అని గౌతమ్ అంటాడు. కొట్టేది రౌండ్ కాదు.. నిన్ను.. నా పంచ్ పవర్ గురించి తెలుసు కదా? రారా అని గౌతమ్‌ని బెదిరిస్తాడు రిషి. రిషి ప్లీజ్ రా.. అని గౌతమ్ బతిమిలాడతాడు.

    ఇక రిషి వినకపోయే సరికి వసుకు బై చెబుతాడు. మళ్లీ ఎప్పుడైనా కాఫీకి వెళ్దామని అంటాడు. చేతులు జోడించి గౌతమ్ చెబుతుంటే.. షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు వసు చేతులు జాపుతుంది. అంతలోనే ఇంత మార్పా.. అని గౌతమ్ మురిసిపోతాడు. థ్యాంక్స్ ఫర్ ది లిఫ్ట్.. అని గౌతమ్‌కు వసు చెబుతుంది. మనకు మనకు ఈ ఫార్మాలిటిస్ వద్దు అని గౌతమ్ అంటాడు.. కారు నాది అని రిషి అంటే.. పిలిచింది లిఫ్ట్ ఇచ్చింది ఆ సారే కదా?.. అని రిషికి పంచ్ వేస్తుంది వసు.

    ఇక వెళ్దామా?.. అని రిషి కాస్త వెటకారంగా అంటాడు. వసుధార సూపర్ కదా?. అని గౌతమ్ అంటాడు. కారు ఎక్కరా ముందు.. గౌతమ్ వెళ్దామా?.. అని రిషి అడుగుతాడు. అవునురా వసుధార ఇక్కడే పని చేస్తుందని నీకు ఎలా తెలుసు.. అని గౌతమ్ అడుగుతాడు. తను మా స్టూడెంటే కదరా?. ఎక్కు.. అని రిషి అంటాడు. అవును కదా? అని గౌతమ్ కారు ఎక్కి వెళ్లిపోతాడు.

    దేవయాణి చేసిన రచ్చను జగతి తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది.. ఏం ఆలోచిస్తున్నావ్ జగతి అని మహేంద్ర అడుగుతాడు. రిషి గురించి ఆలోచిస్తున్నాను మహేంద్ర.. తన కళ్లతో చూసి తప్పుగా అర్థం చేసుకున్నాడు.. అపార్థం చేసుకున్నాడు. వీలైనంత త్వరగా నిజం తెలిసేలా చేయ్.. అని మహేంద్రను జగతి రిక్వెస్ట్ చేస్తుంది. ట్రై చేస్తాను జగతి..అని మహేంద్ర అంటాడు.

    ఈ విషయాన్నైనా సీరియస్‌గా తీసుకో అని జగతి అంటే.. నేను అన్ని విషయాలు సీరియస్‌గానే తీసుకుంటాను కదా? అని మహేంద్ర అంటాడు. మాటలు చెప్పడం కాదు.. శిరీష్ విషయంలో రిషి ఎంత వరకు వెళ్లాడో నీకు తెలుసు కదా?? మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా చూడాలి..దేవయాణి అక్కయ్య మీద అమితమైన ప్రేమతో తప్పుదారి పడుతున్నాడు. రిషిని మార్చకపోయినా పర్లేదు.. తప్పుదారిలో వెళ్లకుండా చూడండి..

    మీకు ఎలా ఉందో గానీ.. నాది, వసు పరిస్థితి దారుణంగా ఉంది.. చేయనితప్పుకు నిందలు మోస్తన్నాం.. ఇందులో మా తప్పేమీ లేదని తెలిస్తే రిషి ఇంకా రిలాక్స్ అవుతాడు.. రిషి బాధ తగ్గుతుందని.. ఇలా చేయమంటున్నాను అని జగతి అంటుంది. నన్ను అపార్థం చేసుకున్నాడు.. ద్వేషిస్తూనే ఉన్నాడు సరే ఆ విషయంలో నేను బాధపడను.. దేవయాణి అక్కయ్య విషయంలోని అపోహను అయినా తొలగించు మహేంద్ర.. అని జగతి పదే పదే బాధపడుతూ ఉంటుంది. అలా ఎపిసోడ్ ముగుస్తుంది.

    ఇక రేపటి ఎపిసోడ్‌లో వసుకు ధరణి ఫోన్ చేయడం, తన వదిన వసుతో మాట్లాడుతోందని తెలిసి.. తనకు వినబడాలని వసు నానా రకాల మాటలు అనేస్తాడు రిషి. పెద్దమ్మకు ఇంత జరిగింది కదా? ఆ వసుధార మాత్రం ఫోన్ చేయడం లేదు సారీ చెప్పడం లేదు.. అహంకారమా? పొగరా? గర్వమా? అని అనేక మాటలు అంటాడు. అవన్నీ విన్న వసు.. నా తప్పు లేదు.. సారీ చెప్పేది లేదు.. నా గురించి ఇలా కూడా మాట్లాడతారా? అని వసు ఫైర్ అవుతుంది.

    Leave a Reply