• December 15, 2021

Pushpa The Rise : ‘పుష్ప’ ప్రీ రిలీజ్ బిజినెస్.. నీయవ్వ తగ్గేదే లే!

Pushpa The Rise : ‘పుష్ప’ ప్రీ రిలీజ్ బిజినెస్.. నీయవ్వ తగ్గేదే లే!

    Pushpa Pre Release Business అల్లు అర్జున్ స్టామినా ఇప్పుడు సౌత్ మాత్రమే కాకుండా నార్త్ కూడా చూసేందుకు రెడీగా ఉంది. డబ్బింగ్ సినిమాలతో బుల్లితెర, యూట్యూబ్‌లో అల్లు అర్జున్ నార్త్ ఆడియెన్స్‌కు సుపరిచితుడే. అయితే అల వైకుంఠపురములో సినిమా, అందులోని పాటలు, స్టెప్పులతో బన్నీ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఇక పుష్ప సినిమాతో మొదటి సారిగా పాన్ ఇండియన్ రేంజ్‌లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు.

    పుష్ప సినిమాకు మొదటి నుంచి కష్టాలే వచ్చాయి. పుష్ప బిజినెస్ ఆలస్యంగా జరిగింది. హిందీలో పుష్ప సినిమాను కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. మొత్తానికి హిందీ రిలీజ్ ఉంటుందా? లేదా? అని చాలా కాలం వ్యవహారం నడిచింది. మొత్తానికి అన్ని అడ్డంకులు తొలిగాయి. హిందీలోనూ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. కేజీయఫ్ సినిమాను హిందీలో రిలీజ్ చేసిన సంస్థే పుష్పను కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.

    అయితే పుష్ప సినిమాకు ఇంకా ఒక్క రోజు మాత్రమే గ్యాప్ ఉంది. రేపు కొన్ని చోట్ల ప్రీమియర్స్ కూడా పడతాయి. ఇక 17వ తేదీ నుంచి అన్ని చోట్ల పుష్ప రాజ్ కనిపిస్తాడు. అయితే ఇప్పుడు పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్ మీద అందరి దృష్టి పడింది. ఏ ఏ ఏరియాలో ఎంతెంతకు అమ్ముడుపోయిందనే లెక్కల గురించి అంతా వెతుకుతున్నారు.

    ఆ వివరాలిలా ఉన్నాయి. నైజాంలో 36 కోట్లు, సీడెడ్‌లో 18, ఉత్తరాంద్రలో 12.25, ఈస్ట్ 8, వెస్ట్ 7, గుంటూరు 9, క‌ృష్ణా 7.5, నెల్లూరు 4 ఇలా మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 101.75 కోట్లకు అమ్ముడుపోయింది.ఇక కర్ణాటకలో 9, కేరళలో 4, హిందీలో 10 కోట్లకు బిజినెస్ జరిగింది.

    రెస్టాఫ్ ఇండియాలో 1.15 కోట్లకు అమ్ముడుపోయింది. ఓవర్సీస్‌లో 13కోట్లకు అమ్మేశారట. అలా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా పుష్ప సినిమా 144.90 కోట్ల బిజినెస్ చేసిందని తెలుస్తోంది. ఈ లెక్కన 145 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగబోతోందన్న మాట. మరి పుష్ప రాజ్ తన స్టామినాతో ఎంత వసూల్ చేస్తాడో చూడాలి. ఎన్ని రోజుల్లో బ్రేక్ ఈవెన్ అవుతాడన్నది ఆసక్తికరంగా మారింది.

    Leave a Reply