- December 14, 2021
Akhanda Collection : ‘అఖండ’ రేర్ ఫీట్.. మళ్లీ ఇన్నేళ్ల తరువాత బాలయ్య హవా

Akhanda Overseas Collection బాలయ్య బాబు నటించిన అఖండ సినిమా రేర్ ఫీట్ అందుకుంది. మాస్ మసాలా సినిమాలకు ఓవర్సీస్లో కాలం చెల్లింది. అక్కడి వారు ఇలాంటి మాస్ సినిమాలను ఆదరించరు అని అంతా అనుకునే వారు. అందుకే ఇక్కడ బ్లాక్ బస్టర్ అయిన కమర్షియల్ చిత్రాలకు కూడా అక్కడ అంతగా ఆదరణ లభించదు. కానీ అఖండకు మాత్రం అలాంటి హద్దులేవీ లేకుండా పోయాయి.
అఖండ సినిమా అన్ని చోట్లా దుమ్ములేపేస్తోంది. మరీ ముఖ్యంగా ఓవర్సీస్లో జాతరను తలపించింది. అన్ని థియేటర్ల వద్ద విదేశాల్లో బాలయ్య హంగామా కనిపించింది. మొత్తానికి పన్నెండు రోజుల్లో బాలయ్య రేర్ ఫీట్‌ను సాధించాడు. చాలా ఏళ్ల తరువాత బాలయ్య మళ్లీ మిలియన్ క్లబ్‌లోకి చేరాడు. అఖండ సినిమా వన్ మిలియన్ డాలర్లను వసూల్ చేసి అందిరినీ ఆశ్చర్యపరిచింది.
బాలయ్య నటించిన గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా మాత్రమే వన్ మిలియన్ మార్క్‌ను దాటింది. ఇంతవరకు బాలయ్య నటించిన మరేతర చిత్రం కూడా ఆ ఫీట్‌ను అందుకోలేదు. కానీ ఇప్పుడు మళ్లీ అఖండ సినిమా ఆ ఫీట్‌ను అందుకుని బాలయ్య సత్తాను చాటింది. మొత్తానికి బాలయ్య మాత్రం ఓవర్సీస్లోనూ తన పట్టు సాధించుకుని చూపించాడు.
ఓవర్సీస్ ఓవరాల్ రిపోర్ట్ ఇలా ఉంది. ప్రీమియర్స్ ద్వారా 332,509, మొదటి రోజు 1, 15,226.. రెండో 1,28,427.. మూడో రోజు 1,55,545.. నాల్గో రోజు 85,041.. ఐదో రోజు 21,778.. ఆరో రోజు 28,796 .. ఏడో రోజు 15,370.. ఎనిమిదో రోజు 12,018.. తొమ్మిదో రోజు 26,411.. పదో రోజు 37,255.. పదకొండో రోజు 28,713 డాలర్లను అఖండ వసూల్ చేసింది. అలా మొత్తంగా పన్నెండో రోజు లెక్కలు కలుపుకుంటే వన్ మిలియన్ డాలర్ల క్లబ్బులోకి అఖండ చేరుకుంది.