• December 14, 2021

Akhanda Collection : అఖండ హవా.. 12వ రోజు కాస్త రిలాక్స్ అయిన బాలయ్య

Akhanda Collection : అఖండ హవా.. 12వ రోజు కాస్త రిలాక్స్ అయిన బాలయ్య

    Akhanda 12th Day Collection బాలయ్య బాక్సాఫీస్ వద్ద గత కొన్ని రోజులుగా యుద్దం చేస్తూనే ఉన్నాడు. పదకొండు రోజుల్లో బాలయ్య దెబ్బకు బాక్సాఫీస్ మోతమోగింది. ఇక రెండో ఆదివారం నాటి కలెక్షన్లు చూసి అందరూ షాక్ అయ్యారు. గత శుక్రవారం విడుదలైన లక్ష్య, గమనం ఎక్కడా కూడా కనిపించలేదంటే.. అఖండ ఏ రేంజ్‌లో దూసుకుపోతోందో చెప్పనక్కర్లేదు. బాలయ్య దెబ్బకు ఆ రెండు సినిమాలు తట్టాబుట్టా సర్దేసుకున్నాయి.

    అయితే పదకొండో రోజు అఖండ సినిమా సాధించిన వసూళ్లు చూసి అంతా షాక్ అయ్యారు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 3.08 కోట్లు కొల్లగొట్టేసింది. ఆదివారం కాబట్టి ఆ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని థియేటర్లో అఖండే ఆడుతోంది. దీంతో సెకండ్ వీకెండ్ అఖండకు బాగానే కలిసి వచ్చింది. అయితే సోమవారం నాడు మాత్రం ఆ లెక్కలు కాస్త తగ్గాయి.

    ఇన్ని రోజులు బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించిన బాలయ్య.. పన్నెండో రోజు కాస్త రిలాక్స్ అయినట్టు తెలుస్తోంది. పన్నెండో రోజున అంటే Akhanda 12th Day Collection లెక్కలు చూస్తే ఆ విషయం అర్థమవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అఖండ పన్నెండో రోజు 1.1 కోట్ల నుండి 1.2 కోట్ల మధ్యలో కలెక్ట్ చేసే చాన్స్ ఉందని తెలుస్తోంది. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే దగ్గరదగ్గరగా రెండున్నర కోట్ల గ్రాస్‌ను రాబట్టేట్టు కనిపిస్తోంది.

    అదే ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే.. పదకొండు రోజుల్లో 61.97 కోట్ల షేర్, 105.8 కోట్ల గ్రాస్ కొల్లగొట్టేసింది. అయితే పన్నెండో రోజు లెక్కల్ని కలుపుకుంటే.. దగ్గరదగ్గరగా 63 కోట్ల షేర్.. 108 కోట్ల గ్రాస్ రాబట్టేట్టు కనిపిస్తోంది.

    పన్నెండో రోజు ఏరియా వారిగా ఎంత కొల్లగొట్టిందంటే.. నైజాంలో 32 లక్షలు, సీడెడ్‌లో 19 లక్షలు, ఉత్తరాంద్రలో 10, ఈస్ట్ 5, వెస్ట్ 5, గుంటూరు 5, కృష్ణా 4, నెల్లూరు 4 లక్షలు. ఇలా మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 84 లక్షల షేర్ 1.4 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. అఖండ విషయంలో మాత్రం ఇది చాలా తక్కువే అని చెప్పాలి.

    ఇక ఈ పన్నెండు రోజుల్లో అఖండ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 53.74 కోట్ల షేర్, 87.70 కోట్ల గ్రాస్‌ను రాబట్టగా.. అదే ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే.. కర్ణాటక రెస్టాఫ్ ఇండియాలో 4.18 కోట్లు, ఓవర్సీస్‌లో మిలియన్ డాలర్లు అలా మొత్తంగా కలుపుకుంటే 64 కోట్ల షేర్‌ను 109 కోట్ల గ్రాస్‌ను రాబట్టినట్టు సమాచారం.

    ఇక ఓవర్సీస్‌లో వన్ మిలియన్ మార్క్‌కు అడుగు దూరంలో ఉన్న అఖండ.. పన్నెండో రోజు లెక్కలతో ఆ ఫీట్‌ను అందుకున్నట్టు తెలుస్తోంది. ఇక మొత్తానికి బాలయ్య ఓవర్సీస్‌లో నయా రికార్డ్ నెలకొల్పినట్టు అయింది. ఏది ఏమైనా అఖండ ఊపు ఇంకా మూడు రోజులుంటుందని మాత్రం అనిపిస్తోంది. ఇక పుష్ప తరువాత అఖండ పరిస్థితి ఏంటన్నది చూడాలి.

    Leave a Reply