- December 13, 2021
Akhanda Collection : ‘అఖండ’ విధ్వంసం.. అది మాత్రం ఇంకా కలగానే మిగిలింది!.. అడుగు దూరంలో బాలయ్య
Akhanda Overseas Collection నందమూరి బాలకృష్ణ సినిమాలు మాస్ ప్రేక్షకులకు ఎలా ఎక్కేస్తాయో అఖండ మరోసారి నిరూపించింది. బీ, సీ సెంటర్లను మోత మోగించాలంటే బాలయ్య రంగంలోకి దిగాల్సిందే. అలాంటి బాలయ్య అఖండ సినిమాతో క్లాసు మాసు అనే తేడా లేకుండా దుమ్ములేపుతున్నాడు. అయితే ఓవర్సీస్లో ఓ మాస్ సినిమా ఈ రేంజ్లో ఆడటం మామూలు విషయం కాదు. అసలు అక్కడి ప్రేక్షకులు మాస్ సినిమాలను అంతగా ఆదరించరు.
వారికి కొత్తదనం, కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలంటేనే ఇష్టం. కానీ మొదటి సారిగా అక్కడి ప్రేక్షకులు ఓ మాస్ మసాలా కమర్షియల్ ఫార్మాట్ సినిమాకు ఓటేశారు. అఖండపై కాసుల వర్షాన్ని కురిపించారు. అఖండ అక్కడ బిజినెస్ పరంగా చూస్తే బ్లాక్ బస్టర్ హిట్. పెట్టిన డబ్బులకు డబుల్,త్రిబుల్ వచ్చేశాయి. కానీ ఓ రేర్ ఫీట్‌ను మాత్రం అందుకోలేదు..
తెలుగు హీరోలు ఓవర్సీస్లో వన్ మిలియన్ మార్క్‌ను క్రాస్ చేయాలని చాలా అనుకుంటారు. కానీ చాలా మందికి అది అందని ద్రాక్షలా ఉంటుంది. వన్ మిలియన్ డాలర్లను కొల్లగొట్టడం అంటే ఆషా మాషీ వ్యవహారం కాదు. అయితే ఈ మధ్య హీరోలు ఆ మార్క్‌ను క్రాస్ చేసేశారు. చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇలాంటి హీరోలందరూ మిలియన్ల డాలర్లను వసూళ్ చేశారు.
ఇక ఇప్పుడు అఖండతో బాలయ్య ఆ రేర్ ఫీట్‌ను అందుకునేందుకు రెడీ అయ్యాడు. అయితే పదకొండు రోజుల్లో అఖండ సాధించిన మొత్తానికి ఇంకొంచెం తోడు కావాల్సి ఉంది. అప్పుడే ఆ రేర్ ఫీట్‌ను బాలయ్య అందుకుంటాడు. అలా అడుగు దూరంలో బాలయ్య మిలియన్ మార్క్ వద్ద ఆగిపోయాడు. ఈ పదకొండు రోజుల్లో 983,683 డాలర్లు (7.44కోట్లు) వసూల్ చేసింది. ఇంకా 17 వేల డాలర్స్ వస్తే మిలియన్ మార్క్‌ను చేరుకుంటుంది. మరి ఆ మొత్తం మున్ముందు రోజుల్లో వస్తుందో లేదో చూడాలి.
ఓవర్సీస్ ఓవరాల్ రిపోర్ట్ ఇలా ఉంది. ప్రీమియర్స్ ద్వారా 332,509, మొదటి రోజు 1, 15,226.. రెండో 1,28,427.. మూడో రోజు 1,55,545.. నాల్గో రోజు 85,041.. ఐదో రోజు 21,778.. ఆరో రోజు 28,796 .. ఏడో రోజు 15,370.. ఎనిమిదో రోజు 12,018.. తొమ్మిదో రోజు 26,411.. పదో రోజు 37,255.. పదకొండో రోజు 25,308 డాలర్లను అఖండ వసూల్ చేసింది.
- Tags
- Akhanda 11th Day Overseas Collection
- Akhanda Collection
- Akhanda Day 11 Overseas Collection
- Akhanda Overseas Collection
- Akhanda Total 11 Days Overseas Collection
- Akhanda Total Box office Collection
- Akhanda Total Collection
- Akhanda Total Gross Collection
- Akhanda Total share Collection
- Akhanda Worldwide Collection
- అఖండ
- అఖండ ఓవర్సీస్ కలెక్షన్
- అఖండ ఓవర్సీస్ కలెక్షన్లు
- అఖండ కలెక్షన్
- అఖండ కలెక్షన్లు
- అఖండ కలెక్షన్స్
- అఖండ టోటల్ ఓవర్సీస్ కలెక్షన్స్
- అఖండ యూఎస్ కలెక్షన్
- అఖండ యూఎస్ కలెక్షన్లు
- అఖండ యూఎస్ కలెక్షన్స్