ఎన్టీఆర్ ధరించిన కళ్ళజోడు ధర ఎంతంటే?

ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. 

ఆర్ఆర్ఆర్ సినిమా క్రేజ్‌తో రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌లు పాన్ వరల్డ్‌ స్టార్లు అయిపోయారు.

నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో ఆర్ఆర్ఆర్ సినిమా అంతర్జాతీయంగా ట్రెండ్ అవుతోంది.

గోల్డెన్ గ్లోబ్ అవార్డు ప్రధానోత్సవంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌ కనిపించిన తీరుకు అంతా ఫిదా అయ్యారు.

ఇక మన హీరోలు అంతర్జాతీయ వేదికల్లో ఎక్కడా కనిపించినా వారు ధరించిన షర్టులు, షూలు, కళ్లజోళ్లకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆ మధ్య ధరించిన వాచ్ ధర సైతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఎన్టీఆర్ తాజాగా ధరించిన కళ్లజోడికి సంబంధించిన ధర ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఎన్టీఆర్ తాజాగా ధరించిన సన్ గ్లాసెస్ ధర దాదాపు నలభై రెండు వేలకు పైగా ఉన్నట్టు తెలుస్తోంది.