Romantic Review గుణ శేఖర్ మాట్లాడుతూ.. ‘జగన్ డైలాగ్స్ హీరోలందరూ చెబుతుంటే విన్నాం.. ఇప్పుడు ఆకాష్ చెబుతుంటే వినడం ఎంతో ఆనందంగా ఉంది. ఆకాష్ చాలా ఇంటెన్స్‌తో నటించాడు. జగన్ రాసిన కారెక్టర్‌ను బాగా అర్థం చేసుకుని నటించాడు. అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
రాజమౌళి మాట్లాడుతూ.. ‘సినిమా ఇప్పుడే చూశాను. సినిమాలో ఏదైనా వంకను వెతికితే.. వీడు ముసలోడు అయిపోయాడు..వీడికేం తెలుసని యూత్ అనుకుంటారేమో. అనిల్ అద్భుతంగా తెరకెక్కించాడు. ఏం అనుకున్నాడో అది చేసేశాడు. అద్భుతమైన జంట దొరికింది. ఆకాష్ అద్బుతంగా నటించాడు. వేరే లెవెల్‌లో నటించాడు. చాలా సేపు క్లోజప్ పెట్టాడు. అందులో అద్భుతంగా నటించాడు. మన ఇండస్ట్రీకి మరో అద్భుతమైన నటుడు దొరికాడు. యూత్ అందరికీ ఈ చిత్రం పండుగే. మీరు పెట్టిన డబ్బులకు సంతృప్తి చెందుతారు’ అని అన్నారు.
హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ‘పూరి జగన్నాథ్ గారు డైలాగ్స్ అద్బుతంగా రాశారు. సినిమాలో ఆకాష్ అద్బుతంగా నటించారు. క్లైమాక్స్‌లో దుమ్ములేపేశాడు. ఏడిపించేశాడు’ అని అన్నారు.
వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. ‘మేం ఇక్కడికి పూరి జగన్నాథ్ కోసం వచ్చాను. సినిమాలో ఆకాష్ అద్బుతంగా నటించాడు. క్లైమాక్స్‌లో చించేశాడు. మీరు కచ్చితంగా ఈ ఇద్దరితో ప్రేమలో పడిపోతారు. సినిమా చూశాక ఓ హ్యాంగవుట్‌లో ఉంటారు. అందరూ అక్టోబర్ 29న వచ్చి చూడండి’ అని అన్నారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ…‘ఆకాష్ అద్బుతంగా నటించాడు. థియేటర్లో అందరం ఎంజాయ్ చేశాం. పూరి జగన్నాథ్ గారి డైలాగ్స్ బుల్లెట్లు పేలినట్టు పేలాయి. అనిల్ నా మొదటి సినిమా పటాస్‌కు వీఎఫ్ఎక్స్ చేశాడు. ఆయన మొదటి చిత్రమిది. ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. ‘ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీని చేయాలంటే అది పూరి గారి వల్లే అవుతుంది. రెండ్రోజుల ముందే సినిమాను చూపించడం మామూలు విషయం కాదు. హీరోయిన్ కోసం రిపీట్ ఆడియెన్స్ ఉంటారు. పూరి వారసత్వాన్ని ఆకాష్ ముందుకు తీసుకెళ్తాడు. మీరు (పూరి జగన్నాథ్) తడి గుడ్డేసుకుని పడుకోండి’ అని అన్నారు.
బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘సినిమా అద్భుతంగా ఉంది. మా పూరి అబ్బాయి ఇరగదీశాడు. అద్బుతంగా చేశాడు. మంచి లవ్ స్టోరీ. పెద్ద హిట్ అవుతుంది. మా నిర్మాత ఛార్మీ బాగా తీసింది’ అని అన్నారు.
మెహర్ రమేష్ మాట్లాడుతూ.. ‘పూరి జగన్నాథ్ గారు లవ్ స్టోరీ రాస్తే నాకు ఎప్పుడూ ఇష్టమే. ఇడియట్ అయినా గానీ దేశముదురు అయినా గానీ.. మీరు రాసిన గొప్ప స్టోరీల్లో ఇదొకటి. ఆకాష్ అద్భుతంగా నటించాడు. కేతిక శర్మ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇడియట్ సినిమాను కొట్టేయాలి. డైరెక్టర్ అనిల్ అద్భుతంగా తీశాడు’ అని అన్నారు.
డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ.. ‘ఎప్పుడూ సైలెంట్‌గా ఉండే మా ఆకాష్.. పూరిలా మాట్లాడాడు. ఇండస్ట్రీకి మంచి హీరో దొరికాడు. సినిమా అద్బుతంగా ఉంది. హీరోయిన్ కేతిక శర్మ కోసం ఆడియెన్స్ మళ్లీ వస్తారు. జగన్ గారు.. జగన్ లాంటి అనిల్‌ను ఇచ్చారు’ అని అన్నారు.
బొమ్మరిల్లు భాస్కర్ మాట్లాడుతూ.. ‘ఫుల్ సినిమాను ఇంత రొమాంటిక్‌గా తీశారు. ఆ జంట కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. అందరూ సినిమాను చూడండి’ అని అన్నారు.