ప్రపంచంలో ఆపిల్ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్, విలువ, ఆదరణ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఆపిల్ అనేది సమాజంలో ఓ బ్రాండ్, స్టేటస్‌కు మారుపేరుగా తయారైంది. ఆపిల్ ఫోన్, ఐపాడ్, ల్యాప్ టాప్‌లు వాడుతున్నారంటే వారిని సపరేట్ సెక్షన్‌గా చూస్తుంటారు. అయితే వాటి ధరలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. సంపన్న వర్గానికి మాత్రమే ఆపిల్ అందుబాటులో ఉంటుంది. అయితే ఆపిల్ ఫోన్లను తుడిచే గుడ్డకు కూడా రెండు వేల రూపాయలంట. ఇదే విషయం మీద ఎలన్ మస్క్ కౌంటర్లు వేశాడు.
ఇప్పుడు ప్రపంచంలో కుబేరుల జాబితాలో ఎలన్ మస్క్ చేరిపోయాడు. అతని గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. ఎలన్ మస్క్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. అలాంటి ఎలన్ మస్క్ తాజాగా ఆపిల్ సంస్థను ఏకిపారేశాడు. ఆపిల్ సంస్థ ఎన్నడూ కూడా కస్టమర్ల దృష్టిలోంచి ఆలోచించిందని గడ్డి పెట్టాడు. ఆపిల్ ఇటీవలే మ్యాక్ బుక్ ప్రొ , ఎయిర్ పోడ్స్ మరియు పోలిష్ చేసే క్లాత్‌ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
టెస్లా కంపెనీ సీఈఓ ఎలన్ మస్క్ ఆపిల్ క్లాత్ గురించి ట్విటర్ వేదికగా కౌంటర్లు వేశాడు. స్క్రీన్ పోలిష్ చేసే గుడ్డ ముక్కకి రూ. 2000 మరి దారుణమని అన్నాడు. అయినా ఆపిల్ ఎప్పుడైనా తమ కస్టమర్లకి ఒక కొత్త ప్రాడక్ట్‌ని రిలీజ్ చేసే ముందు దాన్ని అమ్మాలనే ఉద్దేశ్యం తప్పా.. యూజర్లకు ఎలాంటి లాభాలు కలుగుతాయి? వారికి ఇది నష్టమా అని ఆలోచించదని అన్నాడు. ఇది వరకు కూడా ఇలానే ఎయిర్ పోడ్స్‌ని ప్రవేశ పెట్టినప్పుడు ఇయర్ ఫోన్ పిన్‌ని తీసేశారు. వేరే గత్యంతరం లేక అందరూ ఎయిర్ పోడ్స్ కొనాల్సిన పరిస్థితే వచ్చింది.
ఇప్పుడు ప్రవేశ పెట్టిన క్లాత్ గురించి తెలుసుకోవాలంటే, దాన్ని చాలా సాఫ్ట్ గా ఉన్న (non abrasive) మెటీరీయల్‌తో తయారు చేశారు. ఏ ఆపిల్ స్క్రీన్ ని అయిన ఈ క్లాత్‌తో క్లీన్ చేయవచ్చు. ఆపిల్ నానో టెక్షతురే గ్లాస్‌ని కూడా సులభంగా క్లీన్ చేయొచ్చు అని ఆపిల్ కంపెనీ తెలిపింది. దీని ధరం మాత్రం 19 డాల్లర్లు గా ఉండడం తో ఇప్పుడు స్క్రీన్‌ను క్లీన్ చేయడానికి రూ. 2000 పెట్టి ఆ గుడ్డు ముక్కను కొంటారో లేదో మరి వేచి చూడాల్సిందే.