Site icon A2Z ADDA

Yuvraj Singh: యువరాజ్ సింగ్ అరెస్ట్.. అంతలోనే ట్విస్ట్

Yuvraj Singh Got Arrested And Got Bail

Yuvraj Singh ఇండియన్ క్రికెట్ చరిత్రలో యువరాజ్ సింగ్‌ది ప్రత్యేక ధోరణి. బ్యాట్ పట్టుకుని స్టేడియంలోకి దిగితే ప్రత్యర్థులు వణికిపోవాల్సిందే. అలాంటి యువరాజ్ సింగ్ స్టేడియంలోనే కాదు సోషల్ మీడియాలోనూ దుమ్ములేపుతుంటాడు. ఎక్కువ యాక్టివ్‌గా ఉండే యువరాజ్ సింగ్‌కు అదే తలనొప్పి తీసుకొచ్చింది. గత ఏడాది జూన్‌లో ఇన్ స్టాగ్రాం లైవ్‌లో యువరాజ్ సింగ్ మాట్లాడిన మాటలు కొంపముంచాయి.

చాహల్‌తో చేసిన ఆ లైవ్‌లో యువరాజ్ సింగ్ కుల వివక్ష వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో నిన్న అతడిని అరెస్ట్ చేశారు. పంజాబ్ హర్యాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఆదివారం అరెస్ట్ చేసిన పోలీసులు.. పూచీకత్తు బెయిల్ మీద వదిలిపెట్టేశారు. కానీ అంతలోపే యువరాజ్ సింగ్ అరెస్ట్ అనే వార్తలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. కానీ బెయిల్ మీద విడుదలయ్యాడు అనేది హైలెట్ అవ్వలేదు.

Exit mobile version