ఐపీఎల్ సీజన్ మొత్తానికి ముగిసింది. చివరకు ఉత్కంఠగా సాగిన కేకేఆర్ సీఎస్‌కే మ్యాచ్‌లో ధోని సేన గెలుపొందింది. ఐపీఎల్‌లో సీఎస్‌కే నాలుగోసారి చాంపియన్‌గా నిలిచింది. కేకేఆర్‌తో జరిగిన ఫైనల్లో సీఎస్‌కే 27 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించి ఐపీఎల్ 2021 విజేతగా నిలిచింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.
అయితే మ్యాచ్ అనంతరం కోల్‌కతా టీం మీద ప్రశంసలు కురిపించాడు. తన దృష్టిలో అసలు విజేత కోల్‌కతా అని చెప్పుకొచ్చాడు. కరోనా వల్ల ఈ టోర్నీ రెండు బాగాలు జరగడం మోర్గాన్ టీంకు కలిసి వచ్చిందని అన్నాడు. ఈ సీజన్‌లో ఎవరైనా విజేతగా నిలవాలంటే అది కోల్‌కతానే అని, వాళ్లకు మధ్యలో దొరికిన విరామం కలిసి వచ్చిందంటూ చెప్పుకొచ్చాడు.