Site icon A2Z ADDA

తలపడనున్న భారత్ పాక్.. వార్ వన్ సైడ్ అవుతుందా?

భారత్ పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే.. కేవలం అది ఆటలా ఉండదు. చూసే జనాలు సైతం దాన్ని ఆటలా అనుకోరు. తమ వ్యక్తితం, పర్సనల్‌గా తీసుకుంటారు.. ఆ ఆటను చూస్తుంటారు. ఇరు దేశాల ప్రజలు క్రికెట్ ఆటను ఆటగా మాత్రం చూడరు. ఇక భారత్ పాక్ తలపడుతోందంటే ప్రపంచం మొత్తం ఆసక్తిగా తిలకిస్తుంటుంది. అయితే ఇంత వరకు వన్డేల్లో కానీ, ప్రపంచ కప్‌లో గానీ పాక్ చేతిలో ఓడిన చరిత్రే మనకు లేదు. ఇక ఇప్పుడు మరోసారి పాక్‌ను చిత్తు చేసేందుకు ఇండియా రంగంలోకి దిగింది.

చివరగా 2019 వన్డే ప్రపంచ కప్‌లో పాక్ భారత్ తలపడ్డాయి. మళ్లీ ఇప్పుడు టీ 20 ప్రపంచ కప్‌లో ఇరు దేశాలు బరిలోకి దిగుతున్నాయి. ఇప్పుడు ఇండియన్ టీం ఎంత గట్టిగా ఉందో అందరికీ తెలిసిందే. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, అశ్విన్, వరుణ్, రాహుల్ చాహర్ ఇలా ఎంతో మంది బ్యాటింగ్, బౌలింగ్‌లో రాటుదేలి ఉన్నారు. నేటి మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. దుబాయ్‌లో ఈ మ్యాచ్ జరగబోతోందన్న విషయం తెలిసిందే.

Exit mobile version