Site icon A2Z ADDA

హుజూరాబాద్ ఫలితం.. వారిపై కేసీఆర్ సీరియస్!

కేసీఆర్ వేసిన ఎత్తులు, వేసిన పాచికలన్నీ కూడా వృథా అయ్యాయి. ఎంతో ఘనంగా ప్రారంభించిన దళిత బంధు పతకం కూడా కేసీఆర్‌ను కాపాడలేకపోయాయి. ఎన్ని కుయుక్తులు పన్నినా కూడా కేసీఆర్ ఓటమి చెందాడు. అంటే నేరుగా కేసీఆర్ ఓడకపోయినా.. ఈటెల రాజేందర్ గెలిచాడు అంటే కేసీఆర్ ఓడినట్టే. ఎందుకంటే హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య గానీ గెల్లు శ్రీనివాస్ వర్సెస్ ఈటెల అన్నట్టుగా గానీ పోటీ జరగలేదు.

ఈటెల వర్సెస్ కేసీఆర్ అన్నట్టుగానే వార్ జరిగింది. కేసీఆర్ ప్రభుత్వ యంత్రాగాన్ని మొత్తం వాడాడు. ఈటెల అనుచరలందరినీ దూరం చేశాడు. ప్రజలకు డబ్బుతో గాలం వేశాడు. పథకాలతో ఆకర్షించాడు.కానీ ప్రజలు మాత్రం ఎంతో తెలివిని ప్రదర్శించారు. డబ్బులు తీసుకున్నారు. ఓట్లు మాత్రం ఈటెలకు వేశారు. ఇక ఈ ఓటమిపై కేసీఆర్ సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. హుజూరా బాద్ ఉప ఎన్నికల బాధ్యతను తీసుకున్న వారిపై వేటు వేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇంచార్జ్‌లు, ఎమ్మెల్యేలు, మంత్రులపై కేసీఆర్ గుస్సా అవుతున్నాడనిపిస్తోంది.

 

Exit mobile version