Site icon A2Z ADDA

Huzurabad bypoll : గెలిచిన రాజేంద్రుడు

Huzurabad bypoll తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా ఈ రోజు కోసమే ఎదురుచూశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల క్రమంలో కేసీఆర్ చేపట్టిన పథకలు, వేసిన ఎత్తులు, హరీష్ రావ్ మైండ్ గేమ్ అంతా కూడా చిత్తు అయింది. చివరకు అందరూ అనుకున్నట్టుగానే, ఊహించినట్టుగానే, ఆశించినట్టుగానే ఈటల రాజేందర్ గెలిచారు. అయితే ఇందులో దళిత బందు లాంటి పథకాన్ని పెట్టి.. కుటుంబానికి పది లక్షలు ఇచ్చినా కూడా ఓట్లు మాత్రం ఈటెలకే పడ్డాయి.

అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది. అన్ని వేలలా డబ్బు, అధికారం పని చేయదు. నిజంగానే ప్రజల్లో అభిమానాన్ని సంపాదించుకుంటే.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఎంత మంది చుట్టుముట్టినా సరే పద్మవ్యూహాన్ని చేదించే అర్జునుడిలా బయటకు వస్తారు అని నిరూపించారు. మొత్తానికి కేసీఆర్ గుండెల్లో ఈటెల దిగింది.

ప్రతీ రౌండ్‌లో బీజీపీ ఆధిక్యత కనబర్చింది. అయితే ఇది బీజేపీ విజయం కాదు.. టీఆర్ఎస్ ఓటమి కాదు. కేవలం కేసీఆర్ పతనానికి ఇది నాంది. ఈటెల నిజాయితికి దక్కిన గెలుపు ఇది. మొత్తానికి కేసీఆర్‌ను ఢీ కొట్టి నిలిచిన బలమైన ఈటెల అని ఈటెల రాజేందర్ మీద అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 19వ రౌండ్ తర్వాత ఈటెల రాజేందర్ 19,541 ఆధిక్యంలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ సొంతూర్లో కూడా ఈటల ఆధిపత్యమే కనిపిస్తోంది.

Exit mobile version