మా ఎన్నికలు జరిగిన తీరు, అందులో కొందరు చేసిన కామెంట్లు ఇండస్ట్రీలో వివాదాలకు దారి తీశాయి. ముఖ్యంగా మెగా బ్రదర్ నాగబాబు సీనియర్ నటులు కోట శ్రీనివాసరావు మీద చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి. అయితే నరేష్ సైతం కొన్ని విచిత్రమైన కామెంట్లు చేశారు. మంచు విష్ణు గెలిచాడు అని ప్రకటించిన తరువాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నరేష్ అత్యుత్సాహం ప్రదర్శించాడు.
ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఉండాలంటూ మోహన్ బాబును నరేష్ కోరాడు. అసలు అలా కోరడానికి నరేష్ ఎవరు?.. ఆ సందర్భంలా అలాంటి విషయం ఎందుకు ప్రస్థావించడం? లేనిపోని వివాదాలాను ఎందుకు తీసుకురావడం అని చాలా మంది మాట్లాడుకున్నారు. ఆ విషయం మీద ఇండస్ట్రీలో పెద్ద ఎత్తునే చర్చ జరిగింది. ఆల్రెడీ పెద్ద దిక్కు, పెద్దన్నగా చిరంజీవి ముందుండి ఇండస్ట్రీని నడిపిస్తున్నాడు. కానీ నరేష్ అలా కామెంట్ చేయడంతో అందరూ విస్మయానికి గురయ్యారు.
ఇక నిన్న మంచు విష్ణు ప్రమాణ స్వీకారమహోత్సవంలో నరేష్ చేసిన ఇంకొన్ని కామెంట్లు అందరినీ షాక్‌కు గురి చేశాయి. ఇండస్ట్రీలోని పెద్దలు అంటూ కృష్ణం రాజు, మురళీ మోహన్,మోహన్ బాబు అంటూ డీఆర్సీ మెంబర్ల గురించి చెప్పాడు. కానీ చిరంజీవి పేరు మాత్రం ఎక్కడా కూడా ప్రస్థావించలేదు. పైగా మాను ఎప్పటికీ అంటి పెట్టుకుని ఉంటాను.. ‘మా’కు అన్నలా పని చేస్తాను అని తనది తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడు నరేష్. ఇప్పటికే నరేష్ మీద అనధికారికంగా మెగా ఫ్యామిలీ బ్యాన్ విధించినట్టు తెలుస్తోంది.