Site icon A2Z ADDA

విష్ణు మంచు ‘కన్నప్ప’ ట్విట్టర్ రివ్యూ.. అవే హైలెట్స్

Kannappa Twitter Review విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప జూన్ 27న థియేటర్లోకి వచ్చింది. తెల్లవారు ఝాము నుంచే కన్నప్ప హంగామా, రివ్యూ, ట్విట్టర్ టాక్ నెట్టింట్లో మొదలైంది. కన్నప్ప చిత్రానికి దాదాపు అన్ని చోట్లా పాజిటివ్ రిపోర్టులే వస్తున్నాయి. ఇక ప్రభాస్ ఎంట్రీ సీన్, ప్రభాస్ ఉన్నంత వరకు అయితే సినిమా స్థాయి పెరిగిపోయిందని చెబుతున్నారు. క్లైమాక్స్‌లో విష్ణు అయితే తన యాక్టింగ్‌తో అందరినీ ఏడ్పించారని చెబుతున్నారు.

కన్నప్ప సినిమాకు ప్రభాస్ ఫ్యాన్సే ఎక్కువ మంది వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా వల్లే ఎర్లీ మార్నింగ్ షోలు కూడా పడ్డాయి. బుక్ మై షోలో టికెట్లు ఆ రేంజ్‌లో తెగాయంటే కూడా అది ప్రభాస్ అభిమానుల వల్లే అన్న సంగతి అందరికీ తెలిసిందే. విష్ణు మంచు సైతం ఈ విషయాన్ని అంగీకరిస్తారు. లక్షకు పైగా టికెట్లు తెగాయంటూ విష్ణు ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఇక ఇప్పుడు ట్విట్టర్‌లోకి టాక్ కూడా వచ్చేసింది.

కన్నప్ప ఫస్ట్ హాఫ్‌కు యావరేజ్ అని, సెకండాఫ్‌కు బ్లాక్ బస్టర్ అని రిపోర్టులు వచ్చాయి. ఫస్ట్ హాఫ్‌లో కథ ఏమీ లేదని, విజువల్స్, బీజీఎం అదిరిపోతుందని అంటున్నారు. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం బ్లాక్ బస్టర్ అని చెబుతున్నారు. ఈ మూవీకి సెకండాఫ్ కీలకం అని, ప్రభాస్ ఎంట్రీ స్క్రీన్ మీద నెవ్వర్ బిఫోర్ అనేలా ఉంటుందని చెబుతున్నారు. ప్రభాస్ పాత్రే ఈ మూవీకి ప్రాణం అని అంటున్నారు. ఇక క్లైమాక్స్‌లో విష్ణు యాక్టింగ్ అయితే అందరి చేత కంటతడి పెట్టిస్తుందని అంటున్నారు.

కన్నప్ప సినిమాకు టెక్నికల్‌గా వందకు వంద మార్కులు వేస్తున్నారు. విజువల్స్, మ్యూజిక్, ఆర్ఆర్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఇలా అన్నింట్లో వంద మార్కులు పడుతున్నాయి. విష్ణు యాక్టింగ్‌కి కూడా అందరూ వంద మార్కులు వేస్తున్నారు. మొత్తానికి కన్నప్పకి అయితే మంచి పాజిటివ్ టాక్ వచ్చినట్టుగానే కనిపిస్తోంది. పూర్తి రివ్యూ రావాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

Exit mobile version