Site icon A2Z ADDA

Vijay Sethupathi: విజయ్ సేతుపతికి ఘోర పరాభవం.. ఎయిర్ పోర్టులో ఆగంతకుడి దాడి

Vijay Sethupathi మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కేవలం కోలీవుడ్ నటుడే కాదు. దక్షిణాది మొత్తానికి రిప్రజెంట్ చేసే స్థాయి ఉన్న నటుడు. ఇప్పుడు విజయ్ సేతుపతి పాన్ ఇండియన్ స్టార్‌గా మారిపోయాడు. ఆల్రెడీ బాలీవుడ్ ప్రాజెక్టలతో బిజీగా ఉన్నాడు. ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చద్దాలో ముందుగా విజయ్ నటించాల్సింది. కానీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆ స్థానంలోకి నాగ చైతన్య వచ్చాడు.. అలా విజయ్ సేతుపతి ఇప్పుడు నేషనల్ స్టార్.

అలాంటి విజయ్ సేతుపతి మీద దాడి జరగడం, అది కూడా ఎంతో సెక్యూరిటీ ఉండే ఎయిర్ పోర్టులో దాడి జరగడం ఎంతో బాధాకర విషయం. ఇది కచ్చితంగా విచారించదగ్గ విషయమే. అయితే ఆగంతుకుడు అలా ఎందుకు వచ్చాడు.. ఎందుకు విజయ్ సేతుపతిని ఎగిరి వెనక నుంచి తన్నాడు అన్నది మాత్రం ప్రశ్నాకర్థంగా మారింది.

అయితే నెట్టింట్లో మాత్రం వింత వాదనలు వినిపిస్తున్నాయి. పునీత్ రాజ్ కుమార్‌ను కడసారి చూసేందుకు తమిళ హీరోలెవ్వరూ రాలేదని, నివాళ్లు అర్పించలేదని కన్నడ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారట. అందుకే ఇలా కోపం వచ్చిన ఓ అభిమాని విజయ్ సేతుపతి మీద దాడి చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు.

Exit mobile version