విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ను కొట్టేశాడు. మొదటి రోజే 39 కోట్లకు పైగా కొల్లగొట్టేశాడు. ఇక బుకింగ్స్ చూస్తే గంట గంటకు వేల టికెట్లు తెగుతున్నాయి. ఈ వీకెండ్ మొత్తం కింగ్డమ్ హవానే కొనసాగేలా ఉంది. ఇక ఈ క్రమంలో విజయ్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ మేరకు తాను ఇండియాకు కింగ్ అయితే చేసే ఫస్ట్ పని ఏంటో చెప్పుకొచ్చారు.
ఇండియాలో కులాలు, మతాలు, ప్రాంతాలు, యాసలు అని విడిపోయి కొట్టుకుంటూ ఉంటున్నాం.. అదే ఏదైనా యుద్దం వస్తే.. పాకిస్థాన్‌తో వార్ అయినా, క్రికెట్ అయినా కూడా అప్పుడు మనమంతా ఇండియన్స్ అని అంటాం.. మళ్లీ అది అయిపోతే.. నువ్వు అది నేను ఇది.. అంటూ విడిపోతూ ఉంటాం.. మనమంతా ఏప్స్ నుంచి వచ్చామని చెబుతుంటారు.. అంటే అందరం ఒక్కటే..
కానీ మధ్యలో ఎవరో వచ్చి వారి స్వలాభం కోసం మనల్ని విడగొట్టారు.. అవన్నీ లేకుండా.. మనమంతా ఒక్కటే అనేలా చేస్తాను.. ఉండే ఓ వందేళ్లు, 80 ఏళ్లు హ్యాపీగా, సంతోషంగా, పాజిటివిటితో బతికేలా చేస్తాను అంటూ విజయ్ గొప్ప ఫిలాసఫీని చెప్పేశారు.