Site icon A2Z ADDA

Liger Movie Twitter Review : లైగర్ ట్విట్టర్ రివ్యూ.. దెబ్బేసిన పూరి!

Liger Twitter Review పూరి జగన్నాథ్ (Puri Jagannadh) విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కాంబోలో లైగర్(Liger) సినిమా తెరకెక్కింది. ఎన్నో అంచనాల నడుము ఈ చిత్రం గురువారం నాడు విడుదలైంది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్స్ పడ్డాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎర్లీ షోస్ పడ్డాయి. అభిమానుల హంగామా కూడా మొదలైంది. అయితే ట్విట్టర్‌లో మాత్రం లైగర్‌కు ఎదురుదెబ్బలు తగులుతున్నట్టు కనిపిస్తున్నాయి.


విజయ్ లైగర్ సినిమా మీద నెటిజన్లు దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. పూరి వేస్ట్ అంటూ.. అవుట్ డేటెడ్ అని అంటున్నారు. సినిమా ఏం బాగా లేదని, ఎక్కడా కొత్తదనం లేదని, అవే పాత స్టోరీలను కలిపి తీశాడని అంటున్నారు. ఈ సినిమాలో ప్రథమార్థంలో కేవలం విజయ్ మ్యానిరజం, మేకోవర్ తప్పా ఇంకేం లేదని చెబుతున్నారు.


లైగర్ ఫస్ట్ హాఫ్ ఓకే ఓకే అన్నట్టుగా ఉంటే.. సెకండాఫ్ మరింత దారుణంగా ఉందని చెబుతున్నారు. తీరా సినిమా దారుణంగా బెడిసి కొట్టిందని అంటున్నారు. మొత్తానికి లైగర్ మీద ఒక్క పాజిటివ్ ట్వీట్ కూడా కనిపించడం లేదు. ఈ లెక్కన లైగర్ సినిమా మరో అతి పెద్ద డిజాస్టర్‌గా మిగలబోతోందనిపిస్తోంది.


అయితే లైగర్ ఓపెనింగ్స్ మాత్రం బాగానే ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ ట్విట్టర్‌లో మాత్రం పబ్లిక్ రెస్పాన్స్ దారుణంగా ఉంది. పూర్తి రివ్యూ వస్తే గానీ లైగర్ ఫ్యూచర్ ఏంటన్నది తెలియడం లేదు. పూరి విజయ్‌లకు లైగర్ మేలు చేస్తుందా? కీడు చేస్తుందా? అన్నది తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.

Exit mobile version