Site icon A2Z ADDA

కింగ్డమ్‌కి రెండ్రోజుల్లో ఎంతొచ్చిందంటే?.. ఇదీ విజయ్ స్టామినా

విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రానికి ప్రస్తుతం మంచి వసూళ్లు వస్తున్నాయి. వీకెండ్ మొత్తం విజయ్ హవానే కొనసాగేలా ఉంది. చూస్తుంటే కింగ్డమ్ మూవీకి రెండు వారాలు ఢోకా లేదనిపిస్తోంది. ఆగస్ట్ 14 వరకు కింగ్డమ్ దుమ్ములేపేలా ఉంది. ఓపెనింగ్ డే అంటూ 39 కోట్లు కింగ్డమ్ కొల్లగొట్టేసింది. ఇక రెండో రోజు కూడా అదే స్థాయిలో రాబట్టినట్టుగా కనిపిస్తోంది. రెండ్రోజుల్లో మొత్తంగా కింగ్డమ్ మూవీకి 53 కోట్లు వచ్చాయని తెలుస్తోంది. అంటే రెండో రోజు 14 కోట్లకు పైగానే వచ్చినట్టుగా కనిపిస్తోంది.

రెండో రోజు నైజాంలో 1.85 కోట్లు, సీడెడ్‌లో 79 లక్షలు, ఉత్తరాంధ్రలో 48, గుంటూరులో 21, ఈస్ట్ 26, కృష్ణా 26, వెస్ట్ 18, నెల్లూరులో 13 లక్షలు వచ్చాయి. అలా మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.11 కోట్లకు పైగా షేర్ వచ్చింది. అలా మొత్తంగా రెండ్రోజుల్లో చూసుకుంటే నైజాంలో 6.05 కోట్లు, సీడెడ్‌లో2.49 లక్షలు, ఉత్తరాంధ్రలో 1. 64, గుంటూరులో 96, ఈస్ట్ కోటి, కృష్ణా 80, వెస్ట్ 62, నెల్లూరులో 47 లక్షలు వచ్చాయి. అలా మొత్తంగా రెండ్రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 14 కోట్లకు పైగా షేర్ వచ్చింది.

Exit mobile version