వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో సాయి బాబా, హేమంత్ సంయుక్తంగా నిర్మించిన సిరీస్ ‘కానిస్టేబుల్ కనకం’. ఈటీవీ విన్‌లో ఆగస్ట్ 14న రాబోతోన్న ఈ సిరీస్‌లో రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ క్రమంలో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో
వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ.. ‘ఈటీవీ విన్ ఫ్యామిలీలో భాగం అయ్యాను అని ఎంతో గర్వంగా చెప్పుకుంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సాయి బాబా గారికి, హేమంత్ గారికి, సాయి కృష్ణ, నితిన్ గారికి థాంక్స్. ప్రశాంత్‌కి మహిళ పట్ల చాలా గౌరవం ఉంటుంది. మహిళల పట్ల ఆయనకున్న గౌరవం మీకు సిరీస్‌లో కనిపిస్తుంది. ప్రశాంత్ చాలా మంచి వ్యక్తి. ‘కానిస్టేబుల్ కనకం’ పాత్రను నాకు ఇచ్చిన ప్రశాంత్ గారికి థాంక్స్. మేఘ లేఖ నాకంటే అందంగా ఉంటుంది. రాజీవ్ కనకాల గారు నన్ను సొంత కూతురిలా చూసుకున్నారు. అవసరాల శ్రీనివాస్ గారు అద్భుతమైన నటుడు. శ్రీరామ్ గారు సెట్స్‌లో నిత్యం నవ్వుతూనే కనిపిస్తుంటారు. ఆయన మా అందరికీ పాజిటివ్ ఎనర్జీని ఇస్తుండేవారు. విష్ణు గారి ప్రొడక్షన్ డిజైన్ బాగుంటుంది. సురేష్ గారి ఆర్ఆర్‌తో మా సిరీస్ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లింది. ఆగస్ట్ 14న మా సిరీస్ రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
నిర్మాత సాయి బాబా మాట్లాడుతూ.. ‘‘కానిస్టేబుల్ కనకం’ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. సాయి కృష్ణ, నితిన్ ఇలా అందరికీ థాంక్స్. ఆగస్ట్ 14న రాబోతోన్న మా సిరీస్‌ను అందరూ చూడండి’ అని అన్నారు.
హేమంత్ మాట్లాడుతూ.. ‘మా టీం కోసం ఇక్కడికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఆగస్ట్ 14న మా సిరీస్ రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
డైరెక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ.. ‘మా సిరీస్ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి థాంక్స్. ‘కానిస్టేబుల్ కనకం’ ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుంది. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన సాయి బాబా గారికి థాంక్స్. సాయి కృష్ణ, నితిన్ ముందు నుంచీ నాకు సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. శ్రీరామ్‌కు ఇది మొదటి సిరీస్. ఆయన మంచి విజువల్స్ ఇచ్చారు. విష్ణు ప్రొడక్షన్ డిజైన్స్ అద్భుతంగా ఉంటాయి. సురేష్ గారి ఆర్ఆర్ అందరినీ వెంటాడుతుంటుంది. కో డైరెక్టర్ మురళీ కృష్ణకు థాంక్స్. నా టీం నవీన్, గౌతమ్, రాజ్ సింహలకు థాంక్స్. మా ఎడిటర్ మాధవ్ గారికి థాంక్స్. వర్ష బొల్లమ్మ, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్ ఇలా అందరూ అద్భుతంగా నటించారు.
ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ మాట్లాడుతూ.. ‘‘అనగనగా’, ‘AIR’ అంటూ సక్సెస్ కొట్టాం. మళ్లీ ‘కానిస్టేబుల్ కనకం’తో విజయం సాధించబోతోన్నాం. మా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి థాంక్స్. ఆగస్ట్ 14న దర్శనం మొదలు కానుంది.. ఇక పూనకాలు రాబోతోన్నాయి. ఇది మా 18 నెలల కల. ఏ ఒక్కరినీ నిరాశ పర్చదని హామీ ఇస్తున్నా. ‘అమ్మోరు’, ‘అరుంధతి’ రేంజ్‌లో మా ‘కానిస్టేబుల్ కనకం’ హై ఇస్తుంది. సుహాస్, నాగరాజు ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడ్డారు. సాయి కృష్ణ వల్లే ఈ ప్రాజెక్ట్ ఇంత వరకు వచ్చింది. సురేష్ బొబ్బిలి చూస్తే మీకు శివ తాండవం అంటే ఏంటో తెలుస్తుంది. క్లైమాక్స్‌లో వర్ష బొల్లమ్మ అందరినీ ఆకట్టుకుంటారు. ఆరేళ్లు ఎంతో కష్టపడి ప్రశాంత్ ఈ సిరీస్‌ను తీశారు. ఈ సిరీస్‌కు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఆగస్ట్ 14న పూనకాలు లోడింగ్’ అని అన్నారు.
ఈటీవీ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ మాట్లాడుతూ.. ‘‘కానిస్టేబుల్ కనకం’లో ఆరు ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ సిరీస్ కోసం అందరూ పగలు, రాత్రి అన్న తేడా లేకుండా పని చేస్తున్నారు. ఆగస్ట్ 14న మా సిరీస్ రాబోతోంది. మా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి థాంక్స్. మా సంస్థలో ఇదే మొట్టమొదటి క్రైమ్, థ్రిల్లర్. మళ్లీ మళ్లీ చూపించేలా మా సురేష్ బొబ్బిలి ఆర్ వెంటాడుతుంటుంది’ అని అన్నారు.
రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. ‘చిరంజీవి గారు మా సిరీస్ ట్రైలర్‌ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. హేమంత్ గారితో ముప్పై ఏళ్లు, సాయి బాబా గారితో 25 ఏళ్ల అనుబంధం ఉంది. అప్పటికీ ఇప్పటికీ వారి ప్రేమలో మార్పులేదు. నన్ను నమ్మి ఇంత మంచి పాత్రను ఇచ్చిన ప్రశాంత్ గారికి థాంక్స్. వర్ష బొల్లమ్మ గారు మల్టీ టాలెంట్. అందరం కలిసి సరదాగా షూటింగ్ చేశాం. శ్రీరామ్ మంచి విజువల్స్ ఇచ్చారు. ప్రశాంత్ గారు మా అందరి నుంచి మంచి అవుట్ పుట్‌ను తీసుకున్నారు. ఎక్కడా కూడా ఆయన కాంప్రమైజ్ అవ్వలేదు. ఆయనకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అవసరాల శ్రీనివాస్ ఎంట్రీతో సిరీస్ స్థాయి పెరిగింది. ఆయన అద్భుతంగా నటించారు. సురేష్ గారి ఆర్ఆర్‌తో ఈ సిరీస్ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లింది. ఆగస్ట్ 14న ఈ సిరీస్ ఈటీవీ విన్‌లో రానుంది. అందరూ చూడండి’ అని అన్నారు.
అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్‌కు థాంక్స్. అనగనగా సినిమాలో నాకు మంచి అవకాశాన్ని ఈటీవీ విన్ ఇచ్చింది. మళ్లీ ఇప్పుడు ‘కానిస్టేబుల్ కనకం’ అంటూ రాబోతోన్నాం. రాజీవ్ కనకాల గారితో సరైన సీన్లు పడే సినిమా నాకు ఇంత వరకు రాలేదు. ఫీమేల్ ఓరియెంటెడ్ కథలు మరిన్ని రావాలి. వర్ష బొల్లమ్మ గారు ‘కానిస్టేబుల్ కనకం’ పాత్రలో అందరినీ సర్ ప్రైజ్ చేస్తారు. మా సిరీస్ ఆగస్ట్ 14న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
మేఘ లేఖ మాట్లాడుతూ.. ‘చాలా రోజుల తరువాత ఓ ఫీమేల్ ఓరియెంటెడ్ సిరీస్ వస్తోంది. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన ప్రశాంత్ గారికి థాంక్స్. ఆయన దగ్గర ఇంకా ఎన్నో ఫీమేల్ ఓరియెంటెడ్ స్టోరీస్ ఉన్నాయి. మా ట్రైలర్‌ను చిరంజీవి గారు రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. వర్ష అంటే ఇన్ని రోజులు టెలిఫోన్ సీన్ గుర్తుకుక వచ్చేది. ఇకపై కానిస్టేబుల్ కనకం గుర్తుకు వస్తారు. మా సిరీస్‌ను ఆగస్ట్ 14న ఈటీవీ విన్‌లో చూడండి’ అని అన్నారు.
సుచిత్ర మాట్లాడుతూ.. ‘నేను ఇందులో మంచి పాత్రను పోషించాను. నన్ను నమ్మి ఇంత మంచి పాత్రను ఇచ్చిన ప్రశాంత్ గారికి థాంక్స్. మా సిరీస్ ఆగస్ట్ 14న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
నటుడు కోటి మాట్లాడుతూ.. ‘ఈటీవీ విన్‌లో ఇంత మంచి సిరీస్, అందులో మంచి పాత్రను పోషించడం ఆనందంగా ఉంది. చిరంజీవి గారి చేతుల మీద ట్రైలర్ రావడం ఆనందంగా ఉంది. ఆగస్ట్ 14న మా సిరీస్‌ను అందరూ చూడండి’ అని అన్నారు.
నటుడు రమణ భార్గవ్ మాట్లాడుతూ.. ‘మా సిరీస్ ట్రైలర్‌ను చిరంజీవి గారు రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. మా AIR సిరీస్‌లానే ఇది కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
ప్రొడక్షన్ డిజైనర్ విష్ణు వర్దన్ మాట్లాడుతూ.. ‘నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్, ఈటీవీ విన్ టీంకు థాంక్స్. మా సిరీస్‌ను ఆగస్ట్ 14న ఈటీవీ విన్‌లో చూడండి’ అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ.. ‘ఈ సిరీస్‌లో నాకు అవకాశం ఇచ్చిన ప్రశాంత్ దిమ్మల, ఈటీవీ విన్ టీంకు థాంక్స్’ అని అన్నారు.
కెమెరామెన్ శ్రీరామ్ మాట్లాడుతూ.. ‘నాకు అవకాశం ఇచ్చిన ప్రశాంత్, ఈటీవీ విన్ టీంకు థాంక్స్. ఈ సంస్థ నుంచి నేను డెబ్యూ అవుతుండటం ఆనందంగా ఉంది. ఈటీవీ విన్ వస్తోంది.. హిట్టు కొడుతోంది.. రిపీట్’ అని అన్నారు.